బ్లడీ మేరీ
| బ్లడీ మేరీ | |
|---|---|
| దర్శకత్వం | మొండేటి చందు |
| రచన | ప్రశాంత్ కుమార్ దిమ్మల |
| నిర్మాత | టీజీ విశ్వప్రసాద్ |
| తారాగణం |
|
| ఛాయాగ్రహణం | కార్తీక్ ఘట్టమనేని |
| కూర్పు | విప్లవ్ నైషధం |
| సంగీతం | కాల భైరవ |
నిర్మాణ సంస్థ | |
| పంపిణీదార్లు | ఆహా |
విడుదల తేదీ | 2022 ఏప్రిల్ 14 |
సినిమా నిడివి | 91 నిముషాలు |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
బ్లడీ మేరీ 2022లో తెలుగులో విడుదలైన థ్రిల్లర్ సినిమా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు మొండేటి చందు దర్శకత్వం వహించాడు. నివేదా పేతురాజ్, అజయ్, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2022 ఏప్రిల్ 14న ఆహా ఓటీటీలో విడుదలైంది.[1]
కథ
[మార్చు]మేరీ (నివేదా పేతురాజ్) ఓ అనాథ. మరో ఇద్దరు అనాథలు అయినటువంటి బాషా (కిరీటి దామరాజు), రాజు (రాజ్ కుమార్ కాశీరెడ్డి)తో కలిసి విశాఖలో ఉంటోంది. మేరీ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తుంది. బాషాకు మాటలు రావు (మూగవాడు). యాక్టర్ కావాలనేది అతడి కల. రాజుకు వినపడదు (చెవిటివాడు). కెమెరామ్యాన్ అవ్వాలనేది లక్ష్యం. అయితే అనుకోని విధంగా ఈ ముగ్గురు ఒక్కో హత్య కేసుల్లో ఇరుక్కుంటారు. అయితే వీరి జీవితాల్లో ఎదురైన ఈ షాకింగ్ సీరియల్ హత్యలకి కారణం ఎవరు? ఈ సమస్య నుంచి వారు బయట పడ్డారా లేదా, చివరకు ఏమైంది? అనేదే మిగతా సినిమా కథ.[2][3]
నటీనటులు
[మార్చు]- నివేదా పేతురాజ్
- బ్రహ్మాజీ
- అజయ్
- కిరీటి దామరాజు
- రాజ్ కుమార్ కసిరెడ్డి
- ఆర్జే హేమంత్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
- నిర్మాత: టీజీ విశ్వప్రసాద్
- కథ: ప్రశాంత్ కుమార్ దిమ్మల
- స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మొండేటి చందు
- సంగీతం: కాల భైరవ
- సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని
మూలాలు
[మార్చు]- ↑ 10TV (4 April 2022). "డేట్ ఫిక్స్ చేసుకున్న బ్లడీ మేరీ.. ఎప్పుడంటే..? | Bloody Mary Locks OTT Release Date". the original నుండి 20 April 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 April 2022.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ Eenadu (19 April 2022). "రివ్యూ: బ్లడీ మేరీ". the original నుండి 20 April 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 April 2022.
- ↑ NTV (15 April 2022). "టైమ్ పాస్ మేరీ!". the original నుండి 20 April 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 April 2022.