Jump to content

శివమ్

వికీపీడియా నుండి
శివమ్
దర్శకత్వంశ్రీనివాసరెడ్డి
కథకిషోర్ తిరుమల (రచయిత)
నిర్మాతరవికిషోర్
తారాగణంరామ్‌ పోతినేని
రాశి ఖన్నా
సంగీతందేవి శ్రీ ప్రసాద్
నిర్మాణ
సంస్థ
శ్రీ స్రవంతి మూవీస్
విడుదల తేదీ
అక్టోబరు2, 2015
దేశంభారతదేశం
భాషతెలుగు

శివమ్ [1] 2015 అక్టోబరు 2న విడుదలైన తెలుగు సినిమా.

శివమ్ అనే కుర్రాడిది ఒక విలక్షణ తత్త్వం. ప్రేమికుల పెళ్ళిళ్ళకు ఇంట్లో పెద్దలు అభ్యంతరపెడుతున్నారని తెలిస్తే చాలు... నేరుగా తాను బరిలోకి దిగిపోతాడు. పెద్దవాళ్ళతో పోరాడి మరీ, ప్రేమికుల జంటను కలుపుతూ ఉంటాడు. అలా అప్పటికి 112 పెళ్ళిళ్ళు చేయించి ఉంటాడు. ఆ క్రమంలో జడ్చర్ల పట్నాన్ని గడగడలాడించే భోజిరెడ్డి అనే ప్రతినాయకుని మనుషుల్ని కొట్టి, వాళ్ళకు శత్రువవుతాడు. అలాంటి కుర్రాడు రైలులో వెళుతూ, ఒకమ్మాయి ఏదో షూటింగ్ కోసం అన్న ఐ లవ్ యూ అన్న మాటను సీరియస్‌గా తీసుకుంటాడు. ఆ అమ్మాయినీ, ఆమె ప్రేమనూ వెతుక్కుంటూ వెళతాడు. అదే సమయంలో పోయిన పరువును తిరిగి తెచ్చుకోవడం కోసం భోజిరెడ్డి మనుషులు కథా నాయకుడి కోసం వెతుకుతుంటారు. మరోపక్క అభిమన్యు సింగ్ అనే మరో ప్రతినాయకుడు కూడా కథా నాయకుడి కోసం వెతుకుతుంటాడు. అతనెందుకు వెతుకుతున్నాడన్నది కాసేపు రహస్యం. తీరా కథా నాయకుడు కనిపించినప్పుడు అతణ్ణి వదిలేసి, కథా నాయకిని కిడ్నాప్ చేసుకొని వెళతాడతను. ప్రతినాయకుని దగ్గర నుంచి ఆమెను కథా నాయకుడు రక్షించడం, కథా నాయకుడు పనిపట్టడం కోసం ఇద్దరు ప్రతినాయకుల మధ్య ఒప్పందం కుదరడం లాంటివన్నీ తర్వాతి కథ. ఒక దశలో కథా నాయకితో ప్రేమ కన్నా, ప్రేమించినవాళ్ళను ఏకం చేయడం వైపే కథా నాయకుడు మొగ్గుతాడు. అలా ఎందుకన్నది నేపథ్యము . అదేమిటి, కథా నాయకుడు అసలు 'శివ 'అని పేరు పెట్టుకోవడానికీ, తాను పెళ్ళి చేసిన ప్రేమికుల మొదటి బిడ్డకు 'శివ ' అని వచ్చేలా పేరు పెట్టమనడానికీ కారణం ఏమిటి, ప్రేమ అనే విషయం వచ్చేసరికి అతనెందుకు శివమెత్తుతాడు, చివరకు ప్రతినాయకుల కథెలా ముగిసిందన్నది మిగతా చిత్ర కథ.

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Mahesh Babu gets a shock from Hero Ram Pothineni!".

బయటి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=శివమ్&oldid=4291802" నుండి వెలికితీశారు