ది ట్రిప్
Jump to navigation
Jump to search
ది ట్రిప్ | |
---|---|
దర్శకత్వం | వంశీకృష్ణ ఆకెళ్ళ |
నిర్మాత | దుర్గం రాజమౌళి |
తారాగణం | ఆమని షఫీ గౌతమ్ రాజు |
ఛాయాగ్రహణం | విశ్వ దేవబత్తుల |
కూర్పు | బొంతల నాగేశ్వరరెడ్డి |
సంగీతం | కార్తిక్ కొడకండ్ల |
నిర్మాణ సంస్థ | వి.డి.ఆర్ ఫిల్మ్స్ |
సినిమా నిడివి | 12 నవంబర్ 2021 |
భాష | తెలుగు |
ది ట్రిప్ 2021లో విడుదలైన తెలుగు సినిమా. వి.డి.ఆర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దుర్గం రాజమౌళి నిర్మించిన ఈ సినిమాకు వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వం వహించాడు.[1] ఆమని, గౌతమ్ రాజు, షఫీ, సౌమ్య శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను 26 అక్టోబర్ 2021న విడుదల చేసి[2], సినిమాను 12 నవంబర్ 2021న విడుదలైంది.[3]
కథ
[మార్చు]కాలేజ్ స్టూడెంట్ అయిన గౌతమ్ డ్రగ్స్‌కు అలవాటుపడి బానిస అవుతాడు. ఆమనీ తన కొడుకు డ్రగ్స్‌కు బానిసైయాడని తెలిసి తల్లడిల్లిపోతుంది. గౌతమ్ ఆ మత్తులో తనకు తెలియకుండానే తను తీసుకునే నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కుంటూ ఉంటాడు. ఈ క్రమంలోనే గౌతమ్ ఒకరోజు ఒక గ్రామానికి బయలుదేరి ఒక అడవిడిలో ఇబ్బందుల్లో పడుతాడు. గౌతమ్ అక్కడి నుండి ఎలా బయటపడ్డాడు, చివరగా అతడు ఎలా మారాడు అన్నదే మిగిలిన సినిమా కథ.
నటీనటులు
[మార్చు]- ఆమని
- గౌతమ్ రాజు
- షఫీ
- సౌమ్య శెట్టి
- సరళారెడ్డి[4]
- వైభవ్ సూర్య
- శ్రీసాయి దుర్గ
- డా. హరిగోపాల్
- బేబీ నేత్ర రెడ్డి
- మాస్టర్ అధర్వన్
- సిల్వర్ సురేష్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: వి.డి.ఆర్ ఫిల్మ్స్
- నిర్మాత: దుర్గం రాజమౌళి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వంశీకృష్ణ ఆకెళ్ళ
- సంగీతం: కార్తిక్ కొడకండ్ల
- సినిమాటోగ్రఫీ: విశ్వ దేవబత్తుల
- ఎడిటర్: బొంతల నాగేశ్వరరెడ్డి
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (27 October 2021). "రొటీన్‌కు భిన్నంగా 'ది ట్రిప్'". Archived from the original on 17 January 2022. Retrieved 17 January 2022.
- ↑ Andhrajyothy (26 October 2021). "'ది ట్రిప్' మూవీ ఫస్ట్ లుక్ విడుదల". Archived from the original on 17 January 2022. Retrieved 17 January 2022.
- ↑ Eenadu (11 November 2021). "ఈ వారం థియేటర్/ ఓటీటీలో వచ్చే సినిమాలివే". Archived from the original on 17 January 2022. Retrieved 17 January 2022.
- ↑ Sakshi (30 December 2021). "సందేశమే ఆమె సినిమా". Archived from the original on 17 జనవరి 2022. Retrieved 17 January 2022.