నారాయణ & కో
నారాయణ & కో | |
---|---|
దర్శకత్వం | చిన్న పాపిశెట్టి |
రచన | రవి గోలి |
నిర్మాత | సుధాకర్ కోమాకుల, పాపిశెట్టి బ్రదర్స్ |
తారాగణం | సుధాకర్ కోమాకుల, ఆమనీ, దేవి ప్రసాద్ |
ఛాయాగ్రహణం | రాహుల్ శ్రీవాత్సవ్ |
కూర్పు | సృజన అడుసుమిల్లి |
సంగీతం | డా. జోశ్యభట్ల శర్మ, నాగ వంశీ & సురేష్ బొబ్బిలి |
నిర్మాణ సంస్థలు | పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్, సుఖ మీడియా |
విడుదల తేదీs | 30 జూన్ 2023(థియేటర్) 5 సెప్టెంబరు 2023 (అమెజాన్ ప్రైమ్)[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నారాయణ అండ్ కో 2023లో తెలుగులో విడుదలైన సినిమా. పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్, సుఖ మీడియా బ్యానర్‌పై సుధాకర్ కోమాకుల పాపిశెట్టి బ్రదర్స్ నిర్మించిన ఈ సినిమాకు చిన్న పాపిశెట్టి దర్శకత్వం వహించాడు. సుధాకర్ కోమాకుల, పూజా కిరణ్, యామిని, జయ్‌కృష్ణ, ఆమనీ, దేవి ప్రసాద్, అలీరెజా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మార్చ్ 29న విడుదల చేయగా[2], సినిమా జూన్ 30న విడుదలైంది.[3]
నటీనటులు
[మార్చు]- సుధాకర్ కోమాకుల[4]
- పూజా కిరణ్
- యామిని
- జయ్‌కృష్ణ
- ఆమనీ
- దేవి ప్రసాద్
- అలీరెజా
- శివ రామచంద్రపు
- తోటపల్లి మధు
- సప్తగిరి
- శివ
- రాగిణి
- అనంత్
కథ
[మార్చు]నారాయణ (దేవిప్రసాద్)బ్యాంకులో క్యాషియర్‌గా పనిచేస్తుంటాడు. అతడి బ్యాంకులో దొంగతనం జరుగుతుంది. ఆ నేరం నారాయణపై పడటంతో 25 లక్షలు కట్టాల్సివస్తుంది. నారాయణ కొడుకు ఆనంద్ (సుధాకర్ కొమాకుల) క్రికెట్ బెట్టింగ్‌లో నష్టపోతాడు. ఆ డబ్బు కోసం బెట్టింగ్ గ్యాంగ్ అతడి వెంట పడుతోంటారు. తమ కష్టాలు తీరడం కోసం ఓ రౌడీ ఇచ్చిన డీల్ కు నారాయణ ఫ్యామిలీ ఒప్పుకుంటుంది. ఆ డీల్ ఏమిటి? ఈ క్రమంలో నారాయణ, ఆనంద్‌తో పాటు మిగిలిన కుటుంబసభ్యులు ఈ సమస్యల నుండి బయటపడ్డారు అనేదే మిగతా సినిమా కథ.[5]
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్, సుఖ మీడియా
- నిర్మాత: సుధాకర్ కోమాకుల, పాపిశెట్టి బ్రదర్స్
- కథ: రవి గోలి
- స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చిన్న పాపిశెట్టి
- మాటలు : రాజీవ్ కొసనం
- సంగీతం: డా. జోశ్యభట్ల శర్మ, నాగ వంశీ & సురేష్ బొబ్బిలి
- సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ్
- ఎడిటర్: సృజన అడుసుమిల్లి
- పాటలు :పూర్ణ చారీ, కాసర్ల శ్యామ్
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (5 September 2023). "ఓటీటీలోకి వచ్చేసిన 'నారాయణ అండ్ కో'". Archived from the original on 20 September 2023. Retrieved 20 September 2023.
- ↑ Namasthe Telangana (29 March 2023). "ఎంటర్‌టైనింగ్‌గా సుధాకర్ కోమాకుల నారాయణ అండ్ కో టీజర్". Archived from the original on 29 March 2023. Retrieved 29 March 2023.
- ↑ V6 Velugu (12 June 2023). "క్లీన్ కామెడీ..నారాయణ అండ్ కో". Archived from the original on 20 సెప్టెంబరు 2023. Retrieved 20 September 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ NTV Telugu (24 March 2023). "తిక్కల్ ఫ్యామిలీ మెంబరు గా సుధాకర్ కోమాకుల!". Archived from the original on 20 September 2023. Retrieved 20 September 2023.
- ↑ Sakshi (30 June 2023). "'నారాయణ & కో' మూవీ రివ్యూ". Archived from the original on 20 September 2023. Retrieved 20 September 2023.