బిపాషా బసు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బిపాషా బసు
బిపాషా బసు
జననం (1979-01-07) 1979 జనవరి 7 (వయసు 45)[1]
జాతీయతభారతీయురాలు
ఇతర పేర్లుబోనీ [2]
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు1996–ప్రస్తుతం
జీవిత భాగస్వామి[3]

బిపాషా బసు (జ. 1979 జనవరి 7) ఒక భారతీయ సినిమా నటి, మోడల్. ఈమె వివాహానంతరం బిపాషా బసు సింగ్ గ్రోవర్ గా పిలువబడుతోంది. [4] ఈమె ప్రధానంగా హిందీ సినిమాలలో నటించినా, తమిళ, తెలుగు, బెంగాలీ, ఇంగ్లీషు సినిమాలలో కూడా నటించింది. ఈమె భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు. ఈమె అనేక పురస్కారాలను పొందింది. ఈమెను మీడియా తరచుగా సెక్స్ సింబల్‌గా అభివర్ణిస్తూ ఉంటుంది.

ఢిల్లీలో పుట్టి కోల్‌కతాలో పెరిగిన బిపాషా 1996లో గోద్రేజ్ సింథాల్ సూపర్ మోడల్ కాంటెస్ట్‌లో గెలుపొంది తరువాత ఫ్యాషన్ మోడల్‌గా వృత్తిని విజయవంతంగా కొనసాగించింది. దానితో ఈమెకు సినిమా అవకాశాలు రావడం మొదలయ్యింది. ఈమె 2001లో "అజ్‌నబీ అనే థ్రిల్లర్ సినిమాలో ఒక ప్రతికూల పాత్రతో సినిమారంగంలో అడుగు పెట్టింది. ఆ పాత్ర ఈమెకు ఉత్తమ నటి (మొదటి సినిమా) విభాగంలో ఫిల్మ్‌ఫేర్ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. ఈమె ప్రధాన పాత్ర "రాజ్" అనే హారర్ సినిమాలో తొలిసారి నటించింది. తరువాత ఈమెకు వరుసగా సినిమా అవకాశాలు రావడం మొదలయ్యాయి. "జిస్మ్", "కార్పొరేట్", "నో ఎంట్రీ", "ఫిర్ హేరాఫేరీ", "ఆల్ ద బెస్ట్: ఫన్ బిగిన్స్", ధూం -2, "రేస్", "రాజ్-3D", "బచ్‌నా ఏ హసీనో", "ఆత్మ", "క్రియేచర్ -3D", "అలోన్" వంటి అనేక సినిమాలలో ఈమె తన నటనను ప్రదర్శించింది. అనేక సినిమాలలో ఐటం సాంగ్స్‌లో నటించింది.

ప్రారంభ జీవితం, మోడలింగ్ వృత్తి

[మార్చు]

బిపాషా బసు 1979, జనవరి 7న ఒక బెంగాలీ కుటుంబంలో ఢిల్లీలో జన్మించింది. ఈమె తండ్రి హీరక్ బసు ఒక సివిల్ ఇంజనీరు. తల్లి మమత గృహిణి. ఈమెకు బిదిషా బసు అనే అన్నయ్య, విజేత బసు అనే చెల్లెలు ఉన్నారు. ఢిల్లీలో ఈమె నెహ్రూప్లేస్‌లో 8వ యేడు వచ్చేవరకు నివసించింది. అక్కడ ఏపిజె ఉన్నత పాఠశాలలో చదివింది. [5] ఆమె కుటుంబం తరువాత కోల్‌కతాకు మారింది. అక్కడ ఈమె భవన్స్ విద్యామందిర్‌లో చదివింది.[6] పాఠశాలలో ఈమె లీడర్‌గా ఎన్నికై 'లేడీ గుండా'గా పేరు తెచ్చుకుంది.[7] ఈమె 12వ తరగతి వరకు సైన్స్ ప్రధాన అంశంగా చదివింది. తరువాత కామర్స్ సబ్జెక్టుకు మారింది.

ఈమెను మాజీ మిస్ ఇండియా మెహర్ జెసియా 1996లో కోల్‌కాతాలోని ఒక హోటల్ లో చూసి మాడలింగ్ చేపట్టమని సలహా ఇచ్చింది.[8]ఆ ఏడాది ఈమె ఫోర్డ్ కంపెనీ నిర్వహించిన గోద్రెజ్ సింథాల్ సూపర్ మోడల్ పోటీలో విజయం పొంది, భారతదేశం తరఫున మయామిలో జరిగిన "ఫోర్డ్ మోడల్స్ సూపర్ మోడల్ ఆఫ్ ద వరల్డ్" పోటీలో పాల్గొనింది.[9][10]

సినిమా రంగం

[మార్చు]
Bipasha Basu poses for the camera
ఐ.ఐ.ఎఫ్.ఎ ఫ్యాషన్ ఎక్‌స్ట్రావెంజా 2015లో బిపాషా బసు

ఈమె పాల్గొన్న గోద్రేజ్ సింథాల్ సూపర్ మోడల్ కాంటెస్ట్ న్యాయనిర్ణేతలలో ఒకరైన వినోద్ ఖన్నా తన కుమారుడు అక్షయ్ ఖన్నా సరసన "హిమాలయ్ పుత్ర" సినిమాలో నటించడానికి ఈమెను ఆహ్వానించాడు. అయితే వయసు తక్కువగా ఉందనే కారణంతో ఈమె ఆ పాత్రను తిరస్కరించింది. దానితో ఆ పాత్ర అంజలా జవేరీకి దక్కింది. తరువాత జయాబచ్చన్ తన కుమారుడు అభిషేక్ బచ్చన్ జె.పి.దత్తా దర్శకత్వంలో నటిస్తున్న "ఆఖరీ ముఘల్" అనే సినిమాలో నటింపజేయడానికి బిపాషాను ఒప్పించింది. [11] అయితే దత్తా మరో స్క్రిప్టుతో అభిషేక్ బచ్చన్, కరీనా కపూర్‌లతో రెఫ్యుజీ అనే సినిమా నిర్మాణం చేపట్టడంతో ఆఖరీ ముఘల్ సినిమా రద్దయింది.[12] రెఫ్యుజీ చిత్రంలో సునీల్ శెట్టి సరసన నటించడానికి ఈమెను సంప్రదించారు కానీ ఈమె తిరస్కరించింది.[8]

చివరకు 2001లో అక్షయ్ కుమార్ హీరోగా అబ్బాస్ మస్తాన్ దర్శకత్వంలో వెలువడిన "అజ్నబీ" అనే సినిమాతో సినిమారంగంలో అడుగుపెట్టింది. ఈ సినిమాలో ఈమె నటించిన దుష్టపాత్రకు విమర్శకులనుండి ప్రశంసలతో పాటు ఫిలింఫేర్ ఉత్తమ నూతననటి అవార్డు లభించింది.[8]

2002లో రాజ్ సినిమాతో ఈమెకు ప్రధాన పాత్రలు లభించడం మొదలయ్యింది.[13]

2017 హెల్త్ మ్యాగజైన్‌పై బిపాషా ముఖచిత్రం.

ఈమె జాన్ అబ్రహాం, బాబీ డియోల్, మహేష్ బాబు, సైఫ్ అలీ ఖాన్, అక్షయ్ కుమార్, పరేష్ రావెల్, కరణ్ సింగ్ గ్రోవర్ వంటి నటుల సరసన నటించింది. విక్రం భట్, సంజయ్ గద్వీ, డేవిడ్ ధావన్, రామ్ గోపాల్ వర్మ, జయంత్ సి పరాన్జీ, కె. విజయ భాస్కర్, అమిత్ సక్సేనా, రోహిత్ శెట్టి, మహేష్ మంజ్రేకర్, విశాల్ భరద్వాజ్, ఆదిత్య చోప్రా, ఋతుపర్ణ ఘోష్, భూషణ్ పటేల్ వంటి దర్శకుల సినిమాలలో నటించింది. ఈమె చిత్రపరిశ్రమలో 15 సంవత్సారాలకు పైగా నిలదొక్కుకున్న అతికొద్ది మంది నటీమణులలో ఒకరు.

ఈమె సినిమాలలో నటించడంతో పాటు 2010 నుండి "లవ్ యువర్ సెల్ఫ్", "బ్రేక్ ఫ్రీ", "అన్లీష్" అనే ఫిట్‌నెస్ డివిడిలను విడుదల చేసింది. వీటిలో శారీరక దృఢత్వం, ఆరోగ్యం, బరువు తగ్గుదల మొదలైన అంశాలపై శిక్షణ ఇచ్చింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]
భర్త కరణ్ సింగ్ గ్రోవర్తో బిపాషా

బిపాషా "రాజ్" సినిమాలో తన జోడీ అయిన డినో మోరియాతో 1996 నుండి సంబంధాలను నెరిపింది. 2002లో వారిద్దరూ విడిపోయారు. తరువాత "జిస్మ్" సినిమా నిర్మాణ సమయంలో సహ నటుడు జాన్ అబ్రహాంతో డేటింగ్ ప్రారంభించింది. 2011 ఆరంభం వరకూ వీరిద్దరి మధ్యా సంబంధాలు కొనసాగాయి.[14][15][16] మీడియా ఈ జంటను "సూపర్ కపుల్"గా అభివర్ణించింది.[17]

2014లో ఈమె నటుడు హర్మన్ బవేజాతో సంబంధమున్నట్లు అంగీకరించింది.[18] అదే యేడాది డిసెంబరులో తాము విడిపోయినట్లు ప్రకటించింది.[19] 2015లో "అలోన్" సినిమా సహనటుడైన కరణ్ సింగ్ గ్రోవర్తో డేటింగ్ ప్రారంభించింది. వారిద్దరూ 2016 ఏప్రిల్ 30వ తేదీన వివాహం చేసుకున్నారు.[20]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
విడుదలైన సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు భాష వివరణ
2001 అజ్‌నబీ సోనియా బజాజ్/నీతా హిందీ తొలి సినిమా
2002 టక్కరి దొంగ పనస తెలుగు
2002 రాజ్ సంజనా భరద్వాజ్ హిందీ హీరోయిన్‌గా మొదటి సినిమా
2002 ఆంఖేఁ రైనా హిందీ ప్రత్యేక పాత్ర
2002 మేరే యార్ కీ షాదీ హై రియా హిందీ
2002 చోర్ మచాయే షోర్ రంజిత హిందీ
2002 గునా ప్రభా నారాయణ్ హిందీ
2003 తుఝే మేరీ కసమ్‌ గిరిజ హిందీ ప్రత్యేక పాత్ర
2003 జిస్మ్ సోనియా ఖన్నా హిందీ
2003 ఫుట్‌పాత్ సంజనా శ్రీవాత్సవ్ హిందీ
2003 రూల్స్: ప్యార్ కా సూపర్‌హిట్ ఫార్ములా బిపాషా బసు హిందీ
2003 జమీన్ నందినీ రాయ్ హిందీ
2004 ఇష్క్ హై తుమ్‌ సే ఖుష్బూ హిందీ సూపర్ స్టార్ కృష్ణ దర్శకత్వం వహించిన సినిమా.
2004 ఎయిత్బార్ రియా మల్హోత్రా హిందీ
2004 రుద్రాక్ష్ గాయత్రి హిందీ
2004 రక్త్ దృష్టీ నాయర్ హిందీ
2004 మధోషి అనుపమా కౌల్ హిందీ
2005 చెహరా మేఘ హిందీ
2005 సచిన్ మంజు తమిళం
2005 విరుద్ధ్: ఫ్యామిలీ కమ్స్ ఫస్ట్ - హిందీ ప్రత్యేక పాత్ర
2005 బర్సాత్ అన్నా వీర్వాణి హిందీ
2005 నో ఎంట్రీ బాబీ హిందీ
2005 అపహరణ్ మేఘా బసు హిందీ
2005 శిఖర్ నటాషా హిందీ
2006 హమ్‌ కో దీవానా కర్ గయే సోనియా బెర్రీ హిందీ
2006 డర్‌నా జరూరీ హై వర్ష హిందీ రామ్‌ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం.
2006 ఫిర్ హేరా ఫేరీ అనూరాధ హిందీ
2006 అలగ్ బిపాషా బసు హిందీ ప్రత్యేక పాత్ర
2006 కార్పొరేట్ నిసిగంధ దాస్‌గుప్తా హిందీ
2006 ఓంకార బిల్లో చమన్‌బహార్ హిందీ
2006 జానే హోగా క్యా అదితి హిందీ
2006 ధూమ్-2 సోనాలి బోస్/మోనాలి బోస్ హిందీ
2007 నెహ్లే పె దేహ్లా పూజ హిందీ
2007 నో స్మోకింగ్ - హిందీ
2007 ఓం శాంతి ఓం బిపాషా బసు హిందీ
2007 గోల్ రుమానా హిందీ
2008 రేస్ సోనియా మార్టిన్ హిందీ
2008 బచ్‌నా ఏ హసీనో రాధిక/శ్రేయ రాథోడ్ హిందీ
2008 రబ్ నే బనాదీ జోడీ - హిందీ
2009 ఆ దేఖే జరా సిమీ ఛటర్జీ హిందీ
2009 ఆల్ ద బెస్ట్: ఫన్ బిగిన్స్ జాన్వీ చోప్రా హిందీ
2009 షొబ్ చరిత్రోం కాల్పొనిక్ రాధికా మిత్ర బెంగాలీ
2010 పంఖ్ నందిని హిందీ
2010 లమ్హా అజీజా హిందీ
2010 ఆక్రోష్ గీత హిందీ
2011 దమ్‌ మారో దమ్ జోయీ మెండోంకా హిందీ
2012 ప్లేయర్స్ రియాథాపర్ హిందీ
2012 జోడీ బ్రేకర్స్ సోనాలీ అగ్నిహోత్రి హిందీ
2012 రాజ్-3D శయన శేఖర్ హిందీ
2013 రేస్ - 2 సోనియా మార్టిన్ హిందీ
2013 ఆత్మ మాయా వర్మ హిందీ
2013 ది లవర్స్ తులజ నాయక్ ఇంగ్లీషు
2014 హం షకల్స్ మిస్తీ హిందీ
2014 క్రియేచర్-3D ఆహనా దత్ హిందీ
2015 అలోన్ సంజన/అంజన హిందీ

పురస్కారాలు

[మార్చు]

బిపాషా బసు తన 17 యేళ్ల సినిమా అనుభవంలో ఎన్నో అవార్డులను గెలుపొందింది. మొత్తం 31 అవార్డులను కైవసం చేసుకోగా మరో 46 సందర్భాలలో ఈమె పేరు అవార్డు కొరకు ప్రతిపాదించబడింది.

ఈమె గెలుచుకున్న అవార్డులలో కొన్ని ముఖ్యమైనవి:

  1. 2001లో "అజ్నబీ" చిత్రంలో నటనకు ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నూతననటి అవార్డు.
  2. 2003లో "రాజ్" సినిమాలో డినో మోరియాతో కలిసి జీ సినిమా డైనమిక్ జంట అవార్డు.
  3. 2006లో "కార్పొరేట్" చిత్రంలోని నటనకు ఉత్తమ నటిగా గ్లోబల్ ఇండియన్ ఫిల్మ్ అవార్డు.
  4. 2006లో "కార్పొరేట్" చిత్రంలోని నటనకు ఉత్తమ నటిగా ఆనందబజార్ పత్రిక అవార్డు.
  5. 2010లో "షొబ్ చరిత్రో కాల్పొనిక్" బెంగాలీ చిత్రంలోని నటనకు డర్బన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఉత్తమ నటి (క్రిటిక్స్) అవార్డు.
  6. 2012లో "దమ్‌ మారో దమ్‌" చిత్రంలో నటనకు స్టార్‌డస్ట్ ఉత్తమ నటి (థ్రిల్లర్ సినిమా) అవార్డు.
  7. 2013లో స్టార్‌డస్ట్ స్టైల్ ఐకాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు మొదలైనవి.

మూలాలు

[మార్చు]
  1. Times News Network (TNN) (6 January 2012). "Bipashu Basu to marry by end of 2012?". The Times of India. Retrieved 14 January 2012.
  2. http://www.hindustantimes.com/photos/entertainment/bollywood-stars-and-their-pet-names/photo-euF2SQfRkQ74ulFcUBZE7J.html
  3. "First Pics: Bipasha Basu and Karan Singh Grovers Mehendi". NDTV. Retrieved 29 April 2016.
  4. http://www.dnaindia.com/entertainment/report-bipasha-basu-is-now-bipasha-basu-singh-grover-2222955
  5. "Bipasha Basu, a lady gunda". The Times of India. 22 October 2011. Archived from the original on 7 జనవరి 2014. Retrieved 31 December 2011.
  6. Tiwary, Priti. "'I was Bipasha's lab partner'". Rediff. Retrieved 2016-08-25.
  7. "Bips, the Lady Goonda!". The Times of India. Archived from the original on 2014-01-07. Retrieved 21 June 2012.
  8. 8.0 8.1 8.2 Verma, Sukanya; Bhattacharya, Priyanka (17 May 2002). "Desperately seeking Bipasha". Rediff.com. Retrieved 29 December 2007.
  9. Verma, Sukanya (23 September 1999). "'Once you enter films, your private life becomes a joke'". Rediff.com. Retrieved 29 December 2007.
  10. "Bipasha Basu – Fashion Model – Profile with photos, biography and more on FMD". Fashionmodeldirectory.com. Retrieved 7 March 2012.
  11. India News Feature Service (24 August 2001). "Bipasha's licensed to thrill". rediff.com. Retrieved 21 June 2012.
  12. "Bipasha thanks Bobby, Akshay for career". Hindustan Times. 27 డిసెంబరు 2011. Archived from the original on 8 జనవరి 2012. Retrieved 9 మార్చి 2018.
  13. "Box Office 2002". BoxOfficeIndia.Com. Archived from the original on 21 జూలై 2012. Retrieved 9 మార్చి 2018.
  14. Iyer, Meena (30 August 2009). "Yes, I'm hot & sexy: Bipasha". The Times of India. Archived from the original on 24 డిసెంబరు 2013. Retrieved 3 September 2009.
  15. Udasi, Harshikaa (27 March 2009). "Just come, sizzle". The Hindu. India. Retrieved 3 September 2009.
  16. "Relationship with John over for good: Bipasha". Mid-Day. 25 July 2011. Retrieved 31 December 2011.
  17. "It's London in spring time!". The Times of India. Times News Network. 4 April 2007. Retrieved 3 September 2009.
  18. "Bipasha Basu: Harman and I are a couple". NDTVMovies.com. Archived from the original on 18 నవంబరు 2015. Retrieved 21 November 2014.
  19. "Bipasha Basu - I am not dating Karan". Times of India. Retrieved 16 December 2014.
  20. "Bipasha Basu, Karan Singh Grover announce their marriage to get hitched on April 30". Indian Express. 6 April 2016. Retrieved 8 April 2016.

బయటి లింకులు

[మార్చు]