నరుడా డోనరుడా
నరుడా డోనరుడా | |
---|---|
దర్శకత్వం | మల్లిక్ రామ్ |
రచన | కిట్టూ విస్సాప్రగడ, విద్యాసాగర్ రాచకొండ |
నిర్మాత | సుప్రియ.. జాన్‌సుధీర్ పూదోట |
తారాగణం | సుమంత్ పల్లవి సుభాష్ తనికెళ్ల భరణి |
ఛాయాగ్రహణం | షనీల్ దేవ్ |
సంగీతం | శ్రీ చరణ్ పాకాల |
విడుదల తేదీ | నవంబరు 4, 2016 |
భాష | తెలుగు |
నరుడా డోనరుడా 2016 లో విడుదలైన తెలుగు సినిమా. ఇది హిందీ సినిమా విక్కీ డోనర్ ఆధారంగా తెలుగులో చిత్రీకరించబడిన సినిమా
కథ
[మార్చు]విక్కీ (సుమంత్) ఓ మధ్య తరగతి యువకుడు. క్రికెటర్. అమ్మ (శ్రీలక్ష్మి).. నాయనమ్మలతో సంతోషంగా గడిపేస్తుంటాడు. ఓ బ్యాంకులో పనిచేసే ఆషిమా రాయ్ (పల్లవి సుభాష్) అనే బెంగాలీ అమ్మాయిని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. తానూ మెల్లమెల్లగా విక్కీ ప్రేమలో పడిపోతుంది. అయితే తాను ఇది వరకే ఒకర్ని ప్రేమించి పెళ్ళి చేసుకుని అతనితో విడాకులు తీసుకున్న విషయాన్ని విక్కీకి ముందే చెబుతుంది. విక్కీ మాత్రం ఆషిమా దగ్గర ఓ నిజం దాస్తాడు. అదేంటంటే.. తనో స్పెర్మ్ డోనర్. సంతాన సాఫల్య కేంద్ర నిర్వాహకుడు ఆంజనేయులు (తనికెళ్ల భరణి) బలవంతం చేయడంతో తన వీర్యాన్ని దానం చేయడానికి ఒప్పుకొంటాడు. తన ఖర్చులకు.. అవసరాలకు సరిపడినంత డబ్బు వస్తుండడంతో దానికి అలవాటు పడతాడు. ఈ నిజం దాచి అషిమాని పెళ్ళి చేసుకొంటాడు. అయితే ఓ సందర్భంలో ఈ నిజం అషిమాకు తెలిసిపోతుంది. అప్పుడు ఏం జరిగింది? వీళ్లిద్దరి కథ ఏ మలుపు తిరిగింది? వీళ్ల వైవాహిక జీవితం ఏమైంది? ఈ విషయాలన్నీ మిగిలిన కథలో భాగం.[1]
తారాగణం
[మార్చు]- సుమంత్
- పల్లవి సుభాష్
- తనికెళ్ల భరణి
- శ్రీలక్ష్మి
- సుమన్ శెట్టి
సాంకేతికవర్గం
[మార్చు]- సంగీతం: శ్రీచరణ్ పాకాల
- మాటలు: కిట్టూ విస్సాప్రగడ.. విద్యాసాగర్ రాచకొండ
- చాయాగ్రహణం: షనీల్ దేవ్
- నిర్మాతలు: సుప్రియ.. జాన్‌సుధీర్ పూదోట
- దర్శకత్వం: మల్లిక్ రామ్
- సంస్థ: అన్నపూర్ణ స్టూడియోస్
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-11-07. Retrieved 2016-11-05.