ప్రభు చౌహన్
స్వరూపం
ప్రభు చౌహన్ | |||
పశు సంవర్ధక శాఖ
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 20 ఆగష్టు 2019 | |||
ముందు | వెంకటరావు నాడగౌడ | ||
---|---|---|---|
హజ్, వక్ఫ్ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 27 సెప్టెంబర్ 2019 – 21 జనవరి 2021 | |||
తరువాత | ఆనంద్ సింగ్ | ||
మైనారిటీ సంక్షేమ శాఖ
| |||
పదవీ కాలం 27 సెప్టెంబర్ 2019 – 10 ఫిబ్రవరి 2020 | |||
ముందు | బి.జెడ్. జమీర్ అహ్మద్ ఖాన్ | ||
తరువాత | శ్రీమంత్ పాటిల్ | ||
శాసనసభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 25 May 2008 | |||
ముందు | గురుపాడప్ప నాగమరాపల్లి | ||
నియోజకవర్గం | ఔరాద్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | గంసుబాయ్ తండా (బొంతి), ఔరాద్ తాలూకా, బీదర్ జిల్లా, మైసూరు రాష్ట్రం, భారతదేశం (ప్రస్తుతం - కర్ణాటక)) | 1969 జూలై 6||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | స్వాతి ప్రభు చౌహన్ | ||
సంతానం |
| ||
నివాసం | ఔరాద్, బెంగుళూరు | ||
వృత్తి | రాజకీయ నాయకుడు | ||
వృత్తి | వ్యవసాయదారుడు |
ప్రభు చౌహన్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఔరాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ప్రస్తుతం బసవరాజు బొమ్మై మంత్రివర్గంలో పశుసంవర్ధక శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తున్నాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]ప్రభు చౌహన్ బీజేపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఔరాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి నుండి పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2013లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి వరుసగా ఎమ్మెల్యేగా గెలిచాడు.
ప్రభు చౌహన్ 2018లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మూడోసారి వరుసగా గెలిచి బి.ఎస్.యడ్యూరప్ప మంత్రివర్గంలో హజ్, వక్ఫ్, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రిగా పనిచేసి ఆ తరువాత బసవరాజు బొమ్మై మంత్రివర్గంలో పశు సంవర్ధక శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[2]
మూలాలు
[మార్చు]- ↑ Mint (4 August 2021). "Karnataka Cabinet: 29 ministers inducted, no deputy CM this time" (in ఇంగ్లీష్). Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.
- ↑ Andhra Jyothy (7 August 2021). "బొమ్మై చేతిలోనే ఆర్థికం, ఇతర మంత్రుల శాఖలివే..." (in ఇంగ్లీష్). Archived from the original on 10 May 2022. Retrieved 10 May 2022.