బంట్వాల్ వైకుంట బాలిగ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బంట్వాల్ వైకుంట బాలిగ

కర్ణాటక శాసనసభ స్పీకరు

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
జీవిత భాగస్వామి శారద

బంట్వాల్ వైకుంట బాలిగ (1895-1968) కొంకణి న్యాయవాది. అతను భారత పాలనా వ్యవస్థ లోను, రాజకీయాలలోనూ చురుకైన పాత్ర పోషించాడు. స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా పాల్గొన్నాడు. మహాత్మా గాంధీతో అనేకసార్లు పనిచేశాడు. స్వాతంత్ర్యం తరువాత అతను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. తరువాత న్యాయ శాఖ మంత్రిగా, మైసూరు రాష్ట్ర శాసనసభ స్పీకరుగపనిచేసాడు. స్పీకరుగా ఉన్నప్పుడే మరణించాడు. స్పీకరుగా అతని పదవీకాలం 1962 మార్చి నుండి 1968 జూన్ వరకు ఉంది. అతను తన చతురత, శాసన వ్యవహారాల పరిజ్ఞానం పార్లమెంటరీ విధానాల పరిజ్ఞానం లకు గాను ప్రసిద్ధుడు [1] స్పీకర్‌గా ఆయన సభా కార్యక్రమాలను నిర్వహించడంలో చాలా కఠినంగా వ్యవహరించేవాడు.

అతను కర్ణాటక లైబ్రరీ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కూడా. [2]

1957 లో బాలిగ పేరిట వైకుంఠ బాలిగ కాలేజ్ ఆఫ్ లా స్థాపించారు. బంట్వాల్ వైకుంట బాలిగ, న్యాయ శాస్త్రవేత్త, మైసూర్ ప్రభుత్వ న్యాయ మంత్రి. [3]

బాలిగ శారదను వివాహం చేసుకున్నాడు. వారికి అనేకమంది కుమారులు, కుమార్తెలూ ఉన్నారు.

మూలాలు[మార్చు]

  1. "Karnataka Government and Politics". Harish Ramaswamy. 2016. Retrieved 18 June 2016.
  2. "People's Library Movement". R. Raman Nair. 2016. Retrieved 18 June 2016.
  3. "Law education - Vaikunta Baliga College of Law". vbclaw.edu.in. Retrieved 2021-07-21.