Jump to content

అశోక్ గస్తీ

వికీపీడియా నుండి
అశోక్ గస్తీ
అశోక్ గస్తీ


రాజ్యసభ సభ్యుడు
పదవీ కాలం
26 జూన్ 2020 – 17 సెప్టెంబర్ 2020
ముందు ప్రభాకర్ కోరే
తరువాత కే. నారాయణ్
నియోజకవర్గం కర్ణాటక

వ్యక్తిగత వివరాలు

జననం 1965
మరణం (aged 55)
బెంగుళూరు, కర్ణాటక, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ

అశోక్‌ గస్తీ కర్ణాటక రాష్ట్రానికి చెందిన న్యాయవాది, రాజకీయ నాయకుడు. ఆయన 2020 జూన్‌లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కర్ణాటక నుండి బీజేపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

అశోక్ గస్తీ విద్యార్థి దశలోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆరెస్సెస్‌)లో చేరి తరువాత అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తులో సభ్యుడిగా పని చేసి 18 ఏళ్ల వయస్సులోనే భారతీయ జనతా పార్టీలో చేరాడు. ఆయన కర్ణాటక బీసీ కమిషన్‌ చైర్మన్‌గా పని చేసిన తరువాత ఆయన పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా బీజేపీ పార్టీ ఆయనకు రాజ్యసభ ఎంపీ టికెట్ కేటాయించింది.[1] అశోక్ గస్తీ 2020 జూన్‌లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి 2020 జూన్ 26న రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై, జూలై 22న ఎంపీగా ప్రమాణస్వీకారం చేశాడు.

మరణం

[మార్చు]

అశోక్ గస్తీ కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో సెప్టెంబర్ 2న బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చేరి చికిత్స అందుకుంటూ ఆరోగ్యం విషమించడంతో 2020 సెప్టెంబర్ 17న మరణించాడు.[2][3][4]

మూలాలు

[మార్చు]
  1. India Today (8 June 2020). "BJP fields Eranna Kadadi, Ashok Gasti as candidates for Rajya Sabha polls" (in ఇంగ్లీష్). Archived from the original on 24 February 2022. Retrieved 24 February 2022.
  2. The Hindu (17 September 2020). "Ashok Gasti, Rajya Sabha member, succumbs to COVID-19" (in Indian English). Archived from the original on 24 February 2022. Retrieved 24 February 2022.
  3. Eenadu (18 September 2020). "కరోనాతో ఎంపీ అశోక్‌ గస్తీ మృతి". EENADU. Archived from the original on 24 February 2022. Retrieved 24 February 2022.
  4. Zee News Telugu (18 September 2020). "కరోనాతో నూతన ఎంపీ కన్నుమూత". Archived from the original on 24 February 2022. Retrieved 24 February 2022.