కె.హెచ్.మునియప్ప

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
K.H. Muniyappa
K.h.muniyappa mp kolar.jpg
K. H. Muniyappa Union Minister of State for Railways
Union Minister of State(Independent charge), Minister of Micro, Small and Medium Enterprises
Incumbent
Assumed office
28 October 2012
అంతకు ముందువారు Vayalar Ravi
వ్యక్తిగత వివరాలు
జననం (1948-03-07) 7 మార్చి 1948 (వయస్సు: 70  సంవత్సరాలు)
Kolar, కర్నాటక
రాజకీయ పార్టీ INC
భాగస్వామి M. Nagarathnamma
సంతానం 1 son and 4 daughters
నివాసం Bangalore
మతం Hinduism
వెబ్‌సైటు www.khmuniyappa.com
As of September 25, 2006
Source: [1]

కె.హెచ్.మునియప్ప కర్ణాటాక రాష్ట్రమునకు చెందిన రాజకీయ నాయకుడు. 10, 11, 12, 13, 14, 15 మరియు 16 వ లోక్‌సభ సభ్యుడు. ఇతను కర్నాటక లోని కోలార్ (ఎస్.సి) పార్లమెంటు నియోజిక వర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరుపున్ గెలిచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

బాల్యం[మార్చు]

మునియప్ప 7 మార్చి 1948 వ సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రంలో కోలార్ జిల్లా కంబద హళ్ళిలో జన్మించాడు. ఇతడి తల్లి దండ్రులు: శ్రీమతి వెంకట్మ ., శ్రీ హనుమప్ప.

విద్యభ్యాసము[మార్చు]

ఇతడు బెంగళూరు విశ్వ విద్యాలయం నుండి బి.ఎ. ఎల్.ఎల్.బి పట్టా పొందాడు. కొంతకాలము న్యాయవాద వృత్తిని స్వీకరించాడు., సామాజిక కార్యకర్తగా పనిచేశాడు.

కుటుంబము[మార్చు]

మునియప్ప 22 జూన్ నెల 1978 వ సంవత్సరంలో నాగరత్నమ్మను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు కలరు.

రాజకీయ ప్రస్తానం[మార్చు]

ఇతడు 1991 లో 10 వ లోక్ సభకు కాంగ్రెస్ పార్టీతరపున లోక్ సభలో సభ్యుడయ్యాడు. 1994 లో అఖిల భారత కాంగ్రెస్ కు జాయింట్ సెక్రట్రెటరీగా వ్యవహరించాడు. 1996 లో తిరిగి 11 వ లోక్ సభకు ఎన్నికయ్యాడు. 1998 లో 12 వ లోక్ సభకు ఎన్నియ్యాడు. 13 వ లోక్ సభకు కూడా వరుసగా నాలుగవ సారి కూడా ఎన్నికయ్యాడు. 2004 లో కూడా 14 వ లోక్ సభకు ఎన్నికయి కేంద్రంలో నౌకా రవాణ మంత్రిగా పనిచేశాడు. 2009 లో 15 వ లోక్ సభకు ఎన్నికయి కేంద్రంలో రైల్వే శాఖా మంత్రిగా పనిచేశాడు[1].

మూలాలు[మార్చు]

  1. "Ministers of State (as on 15.11.2010)". Government of India. Retrieved 11 December 2010. 

ఇతర లింకులు[మార్చు]