ధర్మకీర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ధర్మకీర్తి
Dharmakirti
ధర్మకీర్తి
వ్యక్తిగతం
మతంబౌద్ధమతం
Flourishedసా.శ. 7 వ శతాబ్దం
ప్రముఖ కృషిప్రమాణవార్తిక

సా.శ. 7 వ శతాబ్దానికి చెందిన ధర్మకీర్తి అత్యంత ప్రతిభావంతుడైన బౌద్ధ తత్వవేత్త, తర్క శాస్త్ర దార్శనికుడు. నలందా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడు. ఇతను బౌద్ధంలో యోగాచారం, సౌత్రాంతిక శాఖలకు చెందినవాడు. బౌద్ధ తత్వశాస్త్రంలో జ్ఞాన మీమాంస (ప్రమాణం) లో సాధికార తర్కవేత్త అయిన ఇతని రచనలు మీమాంస, న్యాయ, శైవ శాఖలకు చెందిన సనాతన ధర్మ పండితులనే కాక, జైన పండితులను సైతం ప్రభావితం చేసాయి. ఇతని ప్రమాణ వార్తిక అతి ముఖ్యమైన గ్రంథం. సరైన జ్ఞాన సాధనా ప్రమాణాలపై (valid knowledge instruments) రాయబడిన ఈ గ్రంథం భారతదేశం, టిబెట్ లలో సాధికార రచనగా గుర్తింపు పొందింది. అనేక మంది ఈ గ్రంథంపై వ్యాఖ్యలు రచించారు. రాహుల్ సాంకృత్యాయాన్, రష్యాదేశపు తత్వవేత్త స్టెర్‌బాట్స్కీ ధర్మకీర్తిని భారతదేశపు కాంటు (Kant of India) గా ప్రశంసించారు. బౌద్ధధర్మంలో ఆరు ఆభరణాలుగా (Six Ornaments) ఖ్యాతి పొందిన ఆరుగురు గొప్ప వ్యాఖ్యాతలలో (Six Great Commentators) ధర్మకీర్తి ఒకడు.[1]

ప్రారంభ జీవితం

[మార్చు]

ధర్మకీర్తి జీవిత విశేషాలు గురించి చాలా కొద్దిగానే తెలుస్తున్నాయి. అయితే ధర్మకీర్తి జీవించిన కాల విషయాలు గురించి టిబెటిన్, చైనా గ్రంథాలలో కథనాలు పరస్పరం వేర్వేరుగా ఉన్నాయి. చీనా యాత్రికుడు ఇత్సింగ్ ధర్మకీర్తిని గురించి వ్రాసాడు. ఇతను సా.శ. 6వ లేదా 7 వ శతాబ్దాలకు చెంది ఉంటాడని భావించారు. అయితే పెక్కు మంది పండితుల అభిప్రాయం ప్రకారం ధర్మకీర్తి సా.శ. 600 -660 మధ్యన జీవించి ఉండవచ్చు. కొద్దిమంది మాత్రం అతనిని ఇంకొద్ది కాలం ముందుగానే జీవించిన వానిగా భావిస్తారు.

టిబెటిన్ మహాత్ముల చరిత్ర ప్రకారం ధర్మకీర్తి దక్షిణ భారతదేశంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఇతని జన్మస్థలం చోళ దేశానికి చెందిన తిరుమలై (నేటి ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి). ఒక సంప్రదాయం ప్రకారం, ధర్మకీర్తి ప్రముఖ మీమాంసకారుడు కుమారిల భట్టు యొక్క మేనల్లుడు. అయితే తదనంతరకాలంలో ధర్మకీర్తి కుమారిలుని సిద్ధాంతాన్ని, కుమారిలుడు ధర్మకీర్తి సిద్ధాంతాన్ని ఖండించిన విషయం చూస్తే ఇరువురు సమకాలికులై వుంటారు. వేదవేదాంగాలను అభ్యసించిన తరువాత ధర్మకీర్తి బౌద్ధం మత ప్రభావానికి లోనైనాడు. బౌద్ధంలో చేరిన పిదప తొలుత ఈశ్వరసేన వద్ద విద్యాభ్యాసం చేసాడు. తరువాత నలందా విశ్వవిద్యాలయంలో వెళ్లి అక్కడి పీఠస్థవిరుడు, ఆచార్య ధర్మపాలుని వద్ద బౌద్ధ దర్శనాన్ని, బౌద్ధ తర్కాన్ని అభ్యసించాడు. ఆ తరువాత బౌద్ధ బిక్షువయ్యాడు. అయితే ధర్మ ప్రసాదిత సన్యాసి వలె కాక ఒక సాధారణ బౌద్ధుడిగానే జీవించాడు. దిజ్ఞాగుని తర్కం, బౌద్ధుల విజ్ఞానవాదం ఇతన్ని అమితంగా ప్రభావితం చేసాయి.

ప్రధాన రచనలు

[మార్చు]

ప్రమాణ శాస్త్రంలో ధర్మకీర్తి నిష్ణాతుడు. ఇతను చేసిన రచనలు

 • ప్రమాణవార్తిక
 • ప్రమాణవార్తిక కారిక (Commentary on Dignaga's 'Compendium of Valid Cognition')
 • ప్రమాణనిశ్చయ (Ascertainment of Valid Cognition)
 • న్యాయబిందు (Drop of Logic)
 • హేతుబిందు (Drop of Reason)
 • సంబంధ పరీక్ష (Analysis of Relations)
 • సంబంద పరీక్షా వృత్తి
 • వాదన్యాయం (Reasoning for Debate)
 • సంతానంతరసిద్ధి (Proof of Others' Mindstreams)

వీటిలో ప్రమాణవార్తిక ధర్మకీర్తి యొక్క రచనలలో కెల్లా మహత్తర రచనగా (Magnum Opus) భావించబడింది.[2]

ప్రమాణనిశ్చయ (Ascertainment of Valid Cognition) : ఇది 1340 శ్లోకాలతో ఉంది.[3] మూల సంస్కృత రచన అలభ్యం.

న్యాయబిందు (Drop of Logic) : ఇది సూత్ర రూపంలో వున్న బౌద్ధ న్యాయ సంబందమైన ప్రసిద్ధ గ్రంథం. దీనిపై ఆచార్య ధర్మోత్తర టీకా రచించాడు. ఈ గ్రంథంలో మూడు అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయంలో ప్రమాణ లక్షణాలు, ప్రత్యక్ష భేదాలు గురించి ఉంది. రెండవ అధ్యాయంలో రెండు రకాలైన అనుమానాలు (inferences) - స్వార్దానుమానము, పరార్దానుమానం లను గురించిన సమీక్ష, హేత్వాభాసం గురించిన పరిశీలన ఉంది. మూడవ అధ్యాయంలో పరార్ధానుమానం తత్సంబందమైన విషయాలు వివరించబడ్డాయి.[3]

ఇవి కూడా చూడండి

[మార్చు]

ప్రమాణవార్తిక

రిఫరెన్సులు

[మార్చు]
 • Dreyfus, Georges (1997). Recognizing Reality: Dharmakirti's Philosophy and Its Tibetan Interpretations. New York: State University of New York Press. ISBN 978-0-7914-3098-9. extensive discussion of the Dharmakirti's Tibetan reception
 • Dunne, John D. (2004). Foundations of Dharmakirti's Philosophy. Somerville, Mass.: Wisdom Publications. ISBN 978-0-86171-184-0.[permanent dead link]
 • Eltschinger, Vincent (2010). "Dharmakīrti: Revue internationale de philosophie". Buddhist Philosophy. 2010.3 (253): 397–440.
 • Pecchia, C. (ed., with the assistance of Pierce P.). (2015). Dharmakīrti on the Cessation of Suffering. A Critical Edition with Translation and Comments of Manorathanandinʼs Vṛtti and Vibhūticandraʼs Glosses on Pramāṇavārttika II.190-216. Leiden, Brill.
 • Fyodor Shcherbatskoy|Shcherbatskoy, Fyodor (1932) Buddhist Logic', introduced the West to Buddhist logic, and more specifically to Dignaga. Although pioneering, this work is now regarded as outdated by some Buddhist scholars. — David Loy complains about viewing Buddhist philosophy "through the categories of another system – Stcherbatsky's Kant, Murti's Vedanta, Gudmundsen's Ludwig Wittgenstein – which (as with earlier interpretations of Nirvana) reveals more about the interpreter than the interpreted." (Loy, David (1984). "How not to criticize Nāgārjuna". Philosophy East and West. 34 (4): 437–445. doi:10.2307/1399177.).
 • Tillemans T. J. F. (1999). Scripture, Logic, Language: Essays on Dharmakirti and His Tibetan Successors. Somerville, Mass.: Wisdom Publications. ISBN 978-0-86171-156-7.

మూలాలు

[మార్చు]
 1. "Dignaga". Rigpa Shedra. Archived from the original on 27 జూన్ 2017. Retrieved 23 June 2017.
 2. Tilleman's, Tom JF; Dharmakirti's Pramanavarttika: An annotated Translation of the fourth chapter (parathanumana), Volum (Bilingual)
 3. 3.0 3.1 Pandita Baladevopadyaya. బౌద్ధ వాజ్మయ సర్వస్వం (తెలుగు అనువాదం) (2006 ed.). Hyderabad: భోదిశ్రీ నాగార్జునాచార్య విజ్ఞాన కేంద్రం. p. 214.