ధర్మోత్తర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ధర్మోత్తర (టిబెటియన్: chos mchog) క్రీ. శ. 8 వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ బౌద్ధ పండితుడు. తత్వవేత్త. వ్యాఖ్యాత.[1] తార్కికుడైన ఇతను జ్ఞానమీమాంసకు (epistemology) సంబంధించిన బౌద్ధ ప్రమాణాలపై ముఖ్యమైన గ్రంథాలను రాసాడు.

రచనలు[మార్చు]

బౌద్ధ ప్రమాణాలపై ప్రామాణిక గ్రంథాలను రాసిన ధర్మోత్తర, ఆచార్య ధర్మకీర్తి రచనలపై అనేక వ్యాఖ్యానాలు రాసాడు. అయితే అతని గ్రంథాలలో న్యాయబిందుటీకా ఒక్కటి మాత్రమే సంస్కృత భాషలో లభించింది. మిగిలిన గ్రంథాలన్నీ టిబెటియన్ అనువాదాలుగానే దొరుకుతున్నాయి.[2][3] ఇతని రచనలు

  • అపోహనామప్రకరణం
  • క్షణభంగసిద్ధి
  • పరలోకసిద్ధి
  • ప్రమాణ పరీక్ష
  • ప్రమాణవినిశ్చయటీకా
  • న్యాయబిందుటీకా

వీటిలో న్యాయబిందుటీకా అనేది, బౌద్ధ న్యాయంపై ఆచార్య ధర్మకీర్తి రాసిన 'న్యాయబిందు' (Drop of Logic) అనే ప్రసిద్ధ గ్రంథానికి రాయబడిన వ్యాఖ్య. అలాగే ప్రమాణవినిశ్చయటీకా అనేది, ధర్మకీర్తి మరో కృతి అయిన 'ప్రమాణనిశ్చయ'కు రాయబడిన వ్యాఖ్య.

మూలాలు[మార్చు]

  1. "Indian philosophy". britannica.com. Encyclopedia Britannica. Retrieved 4 October 2017.
  2. Lal Mani Joshi, Studies in the Buddhistic Culture of India During the 7th and 8th Centuries A.D., page 165.
  3. "Dharmottara (740-800)". Epistemology and Argumentation in South Asia and Tibet. Archived from the original on 19 జూన్ 2015. Retrieved 18 January 2016.