చక్రధర్ బెహరా
చక్రధర్ బెహరా | |
---|---|
మొదటి సభ్యుడు: ఒడిశా శాసనసభ (స్వాతంత్ర్యంకి ముందు) | |
In office 1937–1946 | |
అంతకు ముందు వారు | పదవి ప్రారంభం |
నియోజకవర్గం | తూర్పు భద్రక్ |
మొదటి సభ్యుడు: ఒడిశా శాసనసభ (స్వాతంత్ర్యం తరువాత) | |
In office 1952–1957 | |
అంతకు ముందు వారు | పదవి ప్రారంభం |
తరువాత వారు | నంద కిషోర్ జేనా |
నియోజకవర్గం | చందాబలి[1] |
వ్యక్తిగత వివరాలు | |
జననం | చక్రధర్ బెహరా 1894 జూలై 16 అంకపాడు గ్రామం, భద్రక్ జిల్లా, ఒడిశా |
మరణం | 1973 జనవరి 1 | (వయసు 78)
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
వృత్తి | స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు |
చక్రధర్ బెహరా (1894-1973), ఒడిశా రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు. బిప్లాబీ (తిరుగుబాటుదారుడు) గా ప్రసిద్ధి చెందాడు. కనికా ఎస్టేట్ రాజుకు వ్యతిరేకంగా రైతుల తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు.[2] ఒడిషా రాష్ట్రం నుండి భారత జాతీయ కాంగ్రెస్ రాజకీయ నాయకుడుగా రాజకీయాలలో కీలకపాత్ర పోషించాడు.[3][4]
తొలి జీవితం
[మార్చు]చక్రధర్ బెహరా 1894, జూలై 16న ఒడిశా రాష్ట్రం, భద్రక్ జిల్లాలోని అంకపాడు గ్రామంలో ఒడియా హిందూ గోపాల్ (యాదవ్) కుటుంబంలో జన్మించాడు. 1918లో భద్రక్ హైస్కూల్ నుండి మెట్రిక్యులేషన్ పూర్తిచేసి, తరువాత కనికా ఎస్టేట్ రాజు దగ్గర అకౌంటెంట్‌గా నియమించబడ్డాడు.[5]
కనికా ఉద్యమ నాయకత్వం
[మార్చు]1921, డిసెంబరు నాటికి కనికా రాజా రెవెన్యూ కలెక్షన్ల కొత్త అక్రమ సెటిల్మెంట్ చేపట్టాలని నిర్ణయించుకోవడంతో రాజకు, అద్దెదారుల మధ్య నిరంతరం గొడవలు జరుగుతుండేవి. చక్రధర్ రాజుకు అకౌంటెంట్‌గా పనిచేసిన సమయంలో, తన పదవికి రాజీనామా చేసి, అద్దెదారుల హక్కులను కాపాడటానికి రాజాకు వ్యతిరేకంగా ఆందోళనను నిర్వహించాడు. 1922లో చక్రధర్ నాయకత్వంలో ఒక సమావేశం నిర్వహించబడింది. అద్దెదారులను అణచివేయడంలో కనికా రాజా, బ్రిటిష్ అధికారులు ఒకరికొకరు సహకరించుకున్నారు. 1930, జూన్ 29న నో టాక్స్ ప్రచారంలో నాయకత్వం వహించినందుకు చక్రధర్ ను హైకోర్టు అరెస్టు చేసింది.
1922 నుండి స్వాతంత్ర్యం వరకు చక్రధర్ నాయకత్వంలో ఇరవై ఐదు సంవత్సరాలకు పైగా ఈ ఉద్యమం కొనసాగింది. సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా, భూస్వామ్య వ్యతిరేకత, సామ్రాజ్యవాద వ్యతిరేకత రెండూ ఉన్నాయి.[6][7]
మరణం
[మార్చు]చక్రధర్ తన 78 ఏళ్ళ వయసులో 1973, జనవరి 1న మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ "MLA Chakradhar Behera Profile | CHANDABALI Constituency". odishahelpline.com. Archived from the original on 2019-04-11. Retrieved 2021-09-29.
- ↑ "Kanika Peasants Movement leader Chakradhar Behera remembered on his 126th Birth Anniversary". India News Diary. Retrieved 2021-09-29.
- ↑ Chandi Prasad Nanda (1 October 2008). Vocalizing Silence: Political Protests in Orissa, 1930-42. SAGE Publications. pp. 73–. ISBN 978-81-321-0006-5.
- ↑ "Chakradhar Behera". Odisha Legislative Assembly. Retrieved 2021-09-29.
- ↑ "www.onlinejournal.in" (PDF). Archived from the original (PDF) on 2017-03-27. Retrieved 2021-09-29.
- ↑ "magazines.odisha.gov.in" (PDF). Archived from the original (PDF) on 2021-09-29. Retrieved 2021-09-29.
- ↑ "shodhganga.inflibnet.ac.in" (PDF). Retrieved 2021-09-29.