అర్మ కొండ
Appearance
అర్మ కొండ | |
---|---|
సీతమ్మ కొండ, జిందగడ | |
అత్యంత ఎత్తైన బిందువు | |
ఎత్తు | 1,680 మీటర్లు (5,512 అ.)[1] |
టోపోగ్రాఫిక్ ప్రామినెన్స్ | 1,290 మీటర్లు (4,232 అ.)[1] |
టోపోగ్రాఫిక్ ఐసొలేషన్ | 907 కిలోమీటర్లు (564 మై.)[1] |
నిర్దేశాంకాలు | 18°13′41″N 82°43′23″E / 18.228°N 82.723°E[2] |
భౌగోళికం | |
స్థానం | ఆంధ్రప్రదేశ్, అల్లూరి సీతారామరాజు జిల్లా లోని, డుంబ్రిగుడ మండలం, హుకుంపేట మండలాల సరిహద్దులో |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అల్లూరి సీతారామరాజు |
పర్వత శ్రేణి | తూర్పు కనుమలు |
అధిరోహణం | |
సులువుగా ఎక్కే మార్గం | నడక / కాళ్ళూ చేతులతో ఎక్కడం |
అర్మకొండ, తూర్పు కనుమల ఉత్తర భాగంలో ఉన్న పర్వత శిఖరం. ఇది గోదావరి నది పరీవాహక ప్రాంతంలో ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని పాడేరు గ్రామానికి ఉత్తరాన మాడుగుల కొండ ఉప-శ్రేణిలో ఉంది. దీన్ని సీతమ్మ కొండ అని, జిందగడ కూడా అంటారు.[3][4]
తూర్పు కనుమలలో ఎత్తైన శిఖరం
[మార్చు]సముద్రమట్టం నుండి 1,680 మీటర్లు (5,510 అ.) ఎత్తున్న ఆర్మ కొండ, తూర్పు కనుమలలో కెల్లా ఎత్తైన శిఖరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అలాగే గోదావరి నది పరీవాహక ప్రాంతంలో కూడా ఎత్తైన పర్వత శిఖరం ఇదే. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌లలో ఈ శిఖరానికి సీతమ్మ కొండ అని పేరు పెట్టారు. [5]
ఆర్మ కొండ టోపోగ్రాఫిక్ ఐసోలేషను [గమనిక 1] పరంగా భారతదేశంలో అనముడి తర్వాత రెండవ స్థానంలో ఉంది. అర్మకొండ ఐసొలేషను 907 కిలోమీటర్లు (564 మై.). [6]
మాడుగుల కొండ శ్రేణిలో ఉన్న ఇతర శిఖరాలు - గాలి కొండ (1,643 m), సింక్రం గుట్ట (1,620 m). [4]
ఇవి కూడా చూడండి
[మార్చు]- ఆంధ్రప్రదేశ్ భౌగోళికం
- భారతదేశం లోని పర్వతాల జాబితా
గమనికలు
[మార్చు]- ↑ ఓ పర్వత/కొండ శిఖరం నుండి, దాని అంత ఎత్తు లేదా దాని కంటే ఎక్కువ ఎత్తున్న మరో శిఖరం ఎంత దూరంలో ఉందో సూచించేందుకు వాడే పదం - "టోపోగ్రాఫిక్ ఐసొలేషను". ఓ పర్వత/కొండ శిఖరం దాని చుట్టూ ఉన్న అత్యంత లోతైన కాంటూరు లైను - దీనికంటే ఎత్తైన శిఖరం ఉండరాదు - కంటే ఎంత ఎత్తున ఉందో సూచించే పదాన్ని "టోపోగ్రాఫిక్ ప్రామినెన్స్" అంటారు. దీన్ని రిలెటివ్ హైట్ అని కూడా అంటారు.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 "Arma Konda, India". Peak Bagger. Retrieved 2017-11-13.
- ↑ Arma Konda / Sitamma Konda (1680m)
- ↑ The Eastern Ghats
- ↑ 4.0 4.1 Nipuna. "దేశంలో మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్? ( ఇండియన్ జాగ్రఫీ)". Archived from the original on 2023-01-05. Retrieved 2023-01-05.
- ↑ 5 Hill Ranges of Indian Peninsular Plateau
- ↑ "World Peaks with 300 km of Isolation". Peak Bagger. Retrieved 2017-11-13.