Coordinates: 11°46′46″N 78°12′12″E / 11.7794°N 78.2034°E / 11.7794; 78.2034

యేర్కాడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  ?యేర్కాడ్
తమిళనాడు • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 11°46′46″N 78°12′12″E / 11.7794°N 78.2034°E / 11.7794; 78.2034
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 1,500 మీ (4,921 అడుగులు)


యేర్కాడ్ (Yercaud) తమిళనాడు రాష్ట్రంలో తూర్పు కనుమలలోని హిల్ స్టేషను. తమిళంలో 'యేరి' అంటే సరస్సు, 'కాడు' అంటే అడవి అని అర్ధం. ఇది బ్రిటిష్ వారి వేసవి విడుదుల్లో ఒకటి. ఇది సేలం జిల్లా లో సేలం పట్టణం నుండి 31 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇది సముద్ర మట్టానికి 1,500 మీటర్లు (4,920 అడుగులు) ఎత్తులో సర్వారాయన్ కొండల్లో దట్టమైన అడవీ ప్రాంతంలో ఉన్నది.

ఈ ప్రాంతపు అత్యున్నత ప్రదేశం సర్వారాయుని గుడి సుమారు 5,326 అడుగుల ఎత్తులో ఉన్నది. దీని పేరు మీద ఈ కొండ ప్రాంతాన్ని సర్వారాయుని కొండలు అన్నారు.

చూడవలసిన ప్రదేశాలు[మార్చు]

  • యేర్కాడ్ సరస్సు: ఇది సుమారు 380 చ.కి.మీ. విస్తరించిన విశాలమైన మంచి నీటి సరస్సు. దీనిలో అన్ని రకాల బోటు షికార్ సౌకర్యం కలదు. సమీప కొండ చరియల్లో కాఫీ తోటలు, కమలా పండ్లు, పనస, జామ తోటలు ఉన్నాయి. చందనం, టేకు, ఏలకులు, మిరియాలు కూడా పెంచుతారు. ఇక్కడి కాఫీ తోటలు 1820 లో మొదటిసారిగా బ్రిటిష్ కలక్టర్ యం.డి.కాక్ బర్న్ ఆఫ్రికా నుండి తెచ్చి పెంచారట.
A wooded path among the original forests of Yercaud.
  • బొటానికల్ గార్డెన్: దీనిలో కొన్ని వందల రకాల మొక్కలు ఉన్నాయి. ఇందులోనే ఆర్కిడేరియమ్ కూడా ఏర్పాటుచేశారు. కలకత్తా, షిల్లాంగ్ తర్వాత మన దేశంలోని అతిపెద్ద ఆర్కిడేరియమ్ ఇది. పన్నెండేళ్ళకోసారి పుష్పించే అరుదైన కురింజి పూలు తో సహా అనేక రకాల పూలు ఇక్కడ కనిపిస్తాయి.
  • కావేరీ అమ్మవారి సహిత సర్వారాయుని గుడి: ఇది స్థానిక కొండజాతివారికి చాలా పవిత్రమైనది. ప్రతి సంవత్సరం ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది. ఇది కొండ గుహలో ఉంటుంది ఇక్కడనుండి వున్న సొరంగం 500 కి.మీ.దూరం వెళ్ళి కర్ణాటకలో బయల్పడుతుంది

విద్యాసంస్థలు[మార్చు]

  • మౌంట్ ఫోర్ట్ పాఠశాల
  • సేక్రెడ్ హార్ట్ పాఠశాల
  • క్రిష్టియన్ రిట్రీట్

రాజకీయాలు[మార్చు]

యేర్కాడ్ శాసనసభా నియోజకవర్గం (ST) సేలం లోక్‌సభ నియోజకవర్గంలోని భాగము.[1]

మూలాలు[మార్చు]

  1. "List of Parliamentary and Assembly Constituencies" (PDF). Tamil Nadu. Election Commission of India. Archived from the original (PDF) on 2008-10-31. Retrieved 2008-10-09.
  • డా.సుచరితా కొసరాజు రచించిన ఈనాడు ఆదివారం 18 జనవరి 2009 ప్రచురించబడిన వ్యాసం ఆధారంగా....
"https://te.wikipedia.org/w/index.php?title=యేర్కాడ్&oldid=2889498" నుండి వెలికితీశారు