Jump to content

ద్వారం వెంకటస్వామి నాయుడు

వికీపీడియా నుండి
ద్వారం వెంకటస్వామి నాయుడు

ద్వారం వెంకటస్వామి నాయుడు
జన్మ నామంద్వారం వెంకటస్వామి నాయుడు
జననం (1893-11-08)1893 నవంబరు 8
India బెంగళూరు, భారతదేశం
మరణం 1964 నవంబర్ 25(1964-11-25) (వయసు: 71)

ద్వారం వెంకటస్వామి నాయుడు (1893 నవంబరు 8 - 1964 నవంబరు 25) వయొలిన్ విద్వాంసుడు. మద్రాసు సంగీత అకాడమీ 1941 లో ఇతనికి సంగీత కళానిధి పురస్కారం ప్రదానం చేసింది. భారత ప్రభుత్వం 1957 లో పద్మశ్రీ పురస్కారం అందించింది.

వెంకటస్వామి నాయుడు బెంగళూరులో జన్మించాడు. ఆయన తండ్రి వెంకటరాయుడు సైనిక దళంలో కమీషన్డ్ ఆఫీసరుగా పనిచేసారు.[1]విశాఖపట్నంలో పెరిగాడు. 26 యేళ్ళ ప్రాయంలోనే విజయనగరం లోని మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో వయొలిన్ ఆచార్యునిగా నియమితుడయ్యాడు. 1936 లో అదే కాలేజీకి ప్రిన్సిపాల్ అయ్యాడు.

వయొలిన్ వాయిద్యం ఒంటరి కచేరీలు (solo concerts, అంటే వయొలినే ప్రధాన సాధనంగా) ఇవ్వడం ఇతనే ఆరంభించాడు. మొదటి కచేరి 1938లో వెల్లూరులో జరిగింది. 1952లో అంధుల సంక్షేమ నిధి కోసం ఢిల్లీ లోని జాతీయ భౌతికశాస్త్ర పరిశోధనాశాల ఆడిటోరియంలో ఇతని కచేరి జరిగింది. ప్రపంచ ప్రఖ్యాత వయొలిన్ కళాకారుడు యెహుదీ మెనుహిన్ ఇతని వయొలిన్ సంగీతాన్ని జస్టిస్ పి.వి.రాజమన్నార్ ఇంటిలో విని ఎంతో ప్రశంసించాడు.

ద్వారం వెంకటస్వామి నాయుడు వయొలిన్ వాదనలో సున్నితత్వానికి అందె వేసిన చేయి. కర్ణాటక సంగీతం వయొలిన్‌పై నైపుణ్యంతో పలికించగలిగిన వ్యక్తులలో ఈయన ఒకడు. సంగీతం గురించి ఎన్నో వ్యాసాలు కూడా వ్రాశాడు. "తంబూరా విశిష్ట లక్షణాలు" అలాంటి వ్యాసాలలో ఒకటి. సంగీతం "వివిపించే తపస్సు" అనీ, ఒక్కరోజు కూడా సాధనను విస్మరించకూడదనీ ఇతను శిష్యులకు చెప్పేవాడు. - ఒకరోజు సాధన మానితే మీ సంగీతంలోని తప్పులు మీకు తెలుస్తాయి. రెండు రోజులు మానితే మీ సంగీతంలోని తప్పులు శ్రోతలకు తెలుస్తాయి - అని చెప్పేవాడు.

చెన్నైలో "శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు స్మారక ట్రస్టు", విశాఖపట్నంలో "ద్వారం వెంకటస్వామి నాయుడు కళాక్షేత్రం" లను స్థాపించారు. ఈ రెండు నగరాలలోనూ ఈ కళాతపస్వి విగ్రహాలను ప్రతిష్ఠించారు.

పురస్కారాలు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. A titan among violin wizards
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-08-16. Retrieved 2020-01-07.
  3. http://www.india.gov.in/myindia/images/ps_awards.pdf

బయటి లింకులు

[మార్చు]