ద్వారం భావనారాయణ రావు
స్వరూపం
ద్వారం భావనారాయణ రావు | |
---|---|
జననం | ద్వారం భావనారాయణ రావు 15 జూన్, 1924 బాపట్ల |
మరణం | జూలై 24, 2000 విశాఖపట్నం |
మరణ కారణం | గుండెనొప్పి |
వృత్తి | విజయనగరంలోని మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్ గా 1962 నుండి 1973 వరకు |
ప్రసిద్ధి | ప్రముఖ వయొలిన్ విద్వాంసుడు |
మతం | హిందూ మతము |
పిల్లలు | ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు |
తండ్రి | ద్వారం వెంకటస్వామి నాయుడు |
తల్లి | వెంకట జగ్గాయమ్మ |
ద్వారం భావనారాయణ రావు (జూన్ 15, 1924 - జూలై 24, 2000) ప్రముఖ వయొలిన్ విద్వాంసుడు, ద్వారం వెంకటస్వామి నాయుడు గారి కుమారుడు.[1]
ఇతడు ద్వారం వెంకటస్వామి, జగ్గయ్యమ్మ దంపతులకు 1924 జూన్ 15 తేదీన బాపట్లలో జన్మించాడు. చెన్నైలో విద్యాభ్యాసం చేసిన తర్వాత తండ్రి వద్ద, ప్రొ.పి.సాంబమూర్తి వద్ద సంగీతంలో శిక్షణ పొందాడు.
ఇతడు విజయనగరంలోని మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్ గా 1962 నుండి 1973 వరకు, తర్వాత విజయవాడ లోని ప్రభుత్వ సంగీత కళాశాలలోను పనిచేశాడు.
ఇతడు మాతంగముని రచించిన బృహద్దేశి, పండిత వెంకటమఖి రచించిన చతుర్దండి ప్రకాశిక, దత్తిలముని రచించిన దత్తిళమును తెలుగులోకి అనువదించి ప్రచురించారు.[2]
ఇతడు విశాఖపట్నంలో 2000 జూలై 24 తేదీన గుండెనొప్పితో అకస్మాత్తుగా పరమపదించాడు. ఈయనకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.[3]
పురస్కారాలు
[మార్చు]- ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ పురస్కారం.
- ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి సంగీత కళాప్రపూర్ణ
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Bhavanarayana Rao Dwaram, Luminaries of 20th Century, Part I, Potti Sriramulu Telugu University, Hyderabad, 2005, pp: 401-2.
- ↑ "Treeatise on music in The Hindu". Archived from the original on 2007-11-28. Retrieved 2013-05-07.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ Dwaram Bhavanarayana Rao dead in The Hindu.[permanent dead link]
వర్గాలు:
- All articles with dead external links
- ద్వారం వారి వంశవృక్షం
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- 1924 జననాలు
- 2000 మరణాలు
- కళాప్రపూర్ణ గ్రహీతలు
- సంగీతకారులు
- తెలుగువారిలో సంగీతకారులు
- వాయులీన విద్వాంసులు
- మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రధానాధ్యాపకులు
- మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల పూర్వ విద్యార్థులు
- గుంటూరు జిల్లా సంగీత విద్వాంసులు