Jump to content

ద్వారం అనంత వెంకటస్వామి

వికీపీడియా నుండి

ద్వారం అనంత వెంకటస్వామి కర్ణాటక సంగిత విద్వాంసుడు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన ప్రముఖ సంగీతకారుడు, గాంధర్వ విద్యాభూషణ, సంగీత కళా ప్రపూర్ణ ద్వారం భావనారాయణ రావు, వరదమ్మ దంపతులకు జన్మిచారు. ఆయన ప్రముఖ వాయులీన విద్వాంసుడు, సంగీత కళానిధి అయిన ద్వారం వెంకటస్వామి నాయుడు యొక్క మనుమడు. సంగీత ప్రపంచంలో "ద్వారం" యింటిపేరు ప్రసిద్ధి చెందినది. అదే కోవలో ఆయన, ఆయన సహోదరులు సంగీత జ్ఞానాన్ని వారసత్వ సంపదగా పొందారు. స్వామి తన బాల్యంలో తన తల్లిదండ్రుల వద్ద సంగీత శిక్షనను పొందారు. ఆయన కర్ణాటక సంగీతంలో అనేక కార్యక్రమాలను నిర్వహించారు. ఆయన తన ప్రియమైన తండ్రిగారైన భావనారాయణ రావు వద్ద నుండి వాయులీన సంగీతం అభ్యసించారు. ఆయన తన పాఠశాలలో అనేక సంగిత పోటీలను నిర్వహించి విజేతలకు అనేక పతకాలను యిచ్చేవారు. ఆయన సోదరి ద్వారం లక్ష్మి ప్రముఖ సంగీత విద్వాంసురాలు. ఆమె దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోలలో జాతీయ సమైక్యతపై ప్రత్యేక కార్యక్రమాలలో ప్రసిద్ధి పొందిన గాయని. ఆయన తన సోదరితో కలసి పాటలు పాడారు.[1]

కెరీర్

[మార్చు]

ఆయన గీతం కళాశాల నుండి సివిల్ ఇంజనీరింగు డిగ్రీని పొందారు. అదే విధంగా పబ్లిక్ రిలేషన్స్ లో అదనంగా వేరొక డిగ్రీని పొందారు. ఆయన ప్రస్తుతం విశాఖపట్నం లోని స్టీలు ప్లాంటిలో జూనియర్ డివిజినల్ ఇంజనీరుగా 1990 నుండి పనిచేస్తున్నారు. అచట 1995 నుండి అచట కార్పొరేట్ కమ్యూనికేషన్స్ విభాగంలో పనిచేస్తున్నారు. ప్రవృత్తి పరంగా పాటలు వివిధ కార్యక్రమాలలో పాడుతుంటారు.[1]

పురస్కారాలు

[మార్చు]

ఆయనకు "జవహర్లాల్ నెహ్రు" అవార్డును విశాఖపట్నం స్టీలు ప్లాంటు వారిచే అందుకున్నారు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆయన మణిశ్రీని వివాహం చేసుకున్నారు. ఆమె శ్రీసత్యసాయి విద్యావిహార్ లో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. వారికి ఒక కుమార్తె (ద్వారం శ్రీమెహర్ భావన), ఒక కుమారుడు (ద్వారం శ్రీ సాయి ఈశ్వర్)

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "Personality Profile". vizagcityonline.com/. Archived from the original on 28 సెప్టెంబరు 2018. Retrieved 8 May 2016.

ఇతర లింకులు

[మార్చు]