Jump to content

ద్వారం నరసింగరావు నాయుడు

వికీపీడియా నుండి
ద్వారం నరసింగరావు నాయుడు
జననంద్వారం నరసింగరావు నాయుడు
సెప్టెంబరు 5 1908
బాపట్ల
మరణంమార్చి 10 1960
విజయవాడ
వృత్తివిజయనగరంలోని మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్
ప్రసిద్ధివయొలిన్ విద్వాంసుడు
మతంహిందూ మతము
పిల్లలుఇద్దరు కుమారులు , ఒక కుమార్తెలు
తండ్రిద్వారం వెంకటకృష్ణ నాయుడు
తల్లిలక్ష్మీనారాయణమ్మ

ద్వారం నరసింగరావు నాయుడు కర్ణాటక సంగీత విద్వాంసుడు.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన సంగీత విద్వాంసుడు ద్వారం వెంకటకృష్ణ నాయుడు కుమారుడు. ఆయన పినతండ్రి వాయులీన విద్వాంసుడు, సంగీత కళానిథి బిరుదాంకితుడు అయిన ద్వారం వెంకటస్వామి నాయుడు ఆయన బాల్యం నుండి తన తండ్రి వద్ద సంగీతంలో శిక్షణ పొందాడు. ఆయన శిష్యులు కూడా సంగీత ప్రపంచంలో పేరొందారు. వారిలో నేదునూరి కృష్ణమూర్తి ఒకరు.

ఆయన గాంధర్వ విద్యాభూషణ గాన కళానిథి బిరుదాంకితులు. ఆయన సెప్టెంబరు 5 1908లో ద్వారం వెంకటకృష్ణ నాయుడు, లక్ష్మీనారాయణమ్మ దంపతులకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో జన్మించారు. ఆయన తన తండ్రి, పినతండ్రి ద్వారం వెంకటస్వామి నాయుడు వద్ద సంగీతాన్ని అభ్యసించారు. ఆయన విజయవాడ లోని రైల్వే విభాగంలో పనిచేసారు. ఆయన అనేక కచేరీలను రాష్ట్ర వ్యాప్తంగా చేసి వయొలిన్ సోలో విద్వాంసునిగా వినుతికెక్కాడు. ఆయన 1936లో విజయనగరం లోని మహారాజా సంగీత కళాశాలలో వాయులీన విభాగంలో ప్రొఫెసరుగా పనిచేసారు. ఆయన పనిచేసిన కాలంలో ఆయన పెదతండ్రి ద్వారం వెంకటస్వామి నాయుడు అచ్చట ప్రిన్సిపాల్ గా యున్నారు.[1]

వాయులీన విద్వాంసుడు

[మార్చు]

ఆయన వాయులీన విద్వాంసునిగా పేరొందారు. ఆయన వాయులీన ప్రక్రియలో అనేక శైలులను అభివృద్ధి చేసారు. ఆయన ద్వారం వెంకటస్వామి నాయుడుతో కలసి దక్షిణ భారతదేశంలో అనెక కచేరీలలో పాల్గొన్నారు. ఆయన సుప్రసిద్ధ సంగీతకారులైన పారుపల్లి రామకృష్ణయ్య పంతులు, మునిగంటి వెంకటరావు పంతులు, డా. శ్రీపాద పినాకపాణి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ. చెంబై వైద్యనాథ భాగవతార్, టి.ఆర్.మహాలింగం, మహావాది వెంకటప్పయ్య శాస్త్రి, క్రోవి సత్యనారాయణ శాస్త్రి, సత్తూర్ శఠగోపన్ వంటి వారితో కలసి కచేరీలను చేసారు. ఆయన తన శిష్యుడైన నేదునూరి కృష్ణమూర్తితో కూడా కలసి కచేరీలనిచ్చారు.

నరసింగరావు నాయుడు మార్చి 10 1960 న తన 52 యేండ్ల వయస్సులో మరణించారు. ఆయన పిల్లలు మంచి వాయులీన విద్వాంసులు. వారు దుర్గాప్రసాదరావు (మహారాజా సంగీత కళాశాల, విజయనగరం, విశ్రాంత ప్రిన్సిపాల్), సత్యనారాయణ (ప్రస్తుతం ఆల్ ఇండియా రేడియో, హైదరాబాదులో పనిచేస్తున్నారు), పూసర్ల మనోరమ (భక్తరామదాసు సంగీత కళాశాల, హైదరాబాదు, విశ్రాంత ప్రిన్సిపాల్)

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Dwaram Narasinga Rao Naidu". bhogarao.com/. శ్రీ మానాప్రగడ శేషశాయి. Archived from the original on 6 ఫిబ్రవరి 2016. Retrieved 8 May 2016. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)

ఇతర లింకులు

[మార్చు]