టి.ఆర్.మహాలింగం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిరువిదైమరుదూర్ రామస్వామి మహాలింగం
వ్యక్తిగత సమాచారం
జననం(1926-11-06)1926 నవంబరు 6
మూలంతిరువిదైమరుదూర్, తమిళనాడు, భారతదేశం
మరణం1986 మే 31(1986-05-31) (వయసు 59)
సంగీత శైలికర్ణాటక సంగీతం
వృత్తికర్ణాటక వాద్య కళాకారుడు
వాయిద్యాలువేణువు
క్రియాశీల కాలం1938–1986

తిరువిదైమరుదూర్ రామస్వామి మహాలింగం (6 నవంబరు 1926 – 31 మే 1986) కర్ణాటక సంగీత వేణుగాన విద్వాంసుడు. మాలిఅని అందరిచే అభిమానంగా పిలువబడే మహాలింగం వేణూవాదనలో కొత్త శైలిని సృష్టించాడు.

ఆరంభ జీవితం[మార్చు]

ఇతడు తమిళనాడు, తంజావూరు జిల్లా తిరువిదైమరుదూర్ గ్రామంలో రామస్వామి అయ్యర్, బృహదాంబాళ్ దంపతులకు 1926, నవంబరు 6వ తేదీన జన్మించాడు.[1] ఇతని తల్లిదండ్రులు స్థానిక దేవాలయపు మహాలింగేశ్వరస్వామి పేరును ఇతనికి పెట్టారు.[2] ఇతడు తన అక్క దేవకితో కలిసి తన మేనమామ జల్ర గోపాల అయ్యర్ వద్ద సంగీతం నేర్చుకున్నాడు. ఇతడు తన ఐదేళ్ళ వయసులోనే వేణువులో విరిబోణి వర్ణాన్ని భైరవి రాగంలో మూడు వేర్వేరు గతులలో పాడటం నేర్చుకున్నాడు.[3]ఇతడు ఏ పాటనైనా ఒక సారి విని వెంటనే దానిని వేణువులో పలికించగలిగేవాడు.[2]

విశేషాలు[మార్చు]

ఇతడు కర్ణాటక సంగీతంలో వేణువాదనలో కొత్త శైలిని కనిపెట్టాడు. ఇతనికి ముందు శరభశాస్త్రి శైలి ప్రచారంలో ఉండేది. పల్లడం సంజీవరావు మొదలైన వారు శరభశాస్త్రి శైలిని బహుళ ప్రచారంలోకి తెచ్చారు. మాలి కనిపెట్టిన శైలిలో గమకాలు గాత్ర సంగీతానికి అనుకూలంగా వేణువును పలికించడానికి వీలయ్యింది.[3] మాలి శైలిని ప్రచారంలో తెచ్చినవారిలో దిండిగుల్ ఎస్.పి.నటరాజన్, టి.ఎస్.శంకరన్, ఎన్.రమణి, బి.ఎన్.సురేష్, ఎన్.కేశి, ప్రపంచం సీతారాం, ఎల్.సుందరాచారి, బి.జి.శ్రీనివాస, ఎస్.ఎం.మధురానాథ్, బి.శంకర్ రావు, బి.ఎం.సుందరరావు మొదలైన వారున్నారు. ఇతని శైలి వాద్యపరికరంలో మార్పులకు దారి తీసింది. ఇంతకు ముందు కంటే భిన్నంగా వేణువును మందమైన వెదురుతోను, ఎనిమిది చిన్న రంధ్రాలతోను తయారు చేశారు.[2]

ఇతడు తన తొలి ప్రదర్శన 1933లో మైలాపూరు త్యాగరాజ ఆరాధనోత్సవాలలో తన 7వ యేట ఇచ్చాడు.[1][4]ఆ సమయంలో ప్రేక్షకులలో ఉన్న ఇద్దరు సంగీత దిగ్గజాలు పరూరు సుందరం అయ్యర్, ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్ ఇతని ప్రదర్శన చూసి ఎంతో సంతోషించి ఇతడికి శాలువాలు కప్పి సన్మానించారు. ఇతడు తిరుమకూడలు చౌడయ్య, పాపా వెంకటరామయ్య, కుంభకోణం అళగియనంబి పిళ్ళై, తంజావూరు వైద్యనాథ అయ్యర్, పాల్గాట్ మణి అయ్యర్, పళని సుబ్రమణియం పిళ్ళై, చెంబై వైద్యనాథ భాగవతార్ వంటి కళాకారులకు వేణువాద్య సహకారాన్ని అందించాడు.[2]

పురస్కారాలు[మార్చు]

ఇతడికి అనేక పురస్కారాలు లభించాయి.

  • 1965లో కేంద్ర సంగీత నాటక అకాడమీ వారి అవార్డు లభించింది.
  • 1970లో భారతప్రభుత్వం ఇతనికి పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చింది.
  • 1986లో భారత ప్రభుత్వం ఇతనికి పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. కానీ ఇతడు దానిని తిరస్కరించాడు.

మరణం[మార్చు]

1955లో ఇతడు బెంగళూరుకు మకాం మార్చాడు. 1980లో అమెరికా విద్యార్థిని ఎలెన్ చాడ్విక్‌ను వివాహం చేసుకుని 1985 వరకు అమెరికాలో నివసించాడు. 1985లో ఇతడు భారత దేశానికి తిరిగి వచ్చి బెంగళూరులో నివసించసాగాడు. తరువాత కొద్ది కాలానికే 1986 మే 31న తన 59వ యేట మెదడులో రక్తస్రావం అయ్యి మరణించాడు.[3]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 Musical Nirvana biography, archived from the original on 9 February 2008
  2. 2.0 2.1 2.2 2.3 2.4 "Sriram, V. (2004), "T.R. Mahalingam", ' 'Carnatic Summer-Lives of twenty great exponents' ' , 260 (273) .
  3. 3.0 3.1 3.2 3.3 Bombay S Jayashri; T M Krishna; Mythili Chandrasekar (2007), Voices Within Carnatic Music: Passing on an Inheritance, Mātṛkā, ISBN 978-81-7525-555-5
  4. http://www.saigan.com/heritage/music/garlandm.htm
  5. Alison Arnold (2000), "Karnatak vocal and instrumental music", The Garland Encyclopedia of World Music, Taylor and Francis, p. 234, ISBN 978-0-8240-4946-1
  6. Anita Nair, 1986. God at One’s Fingertips Archived 2011-07-23 at the Wayback Machine, a profile of T R Mahalingam
  7. S. Shiva Kumar, Breath of the Almighty Archived 2008-04-21 at the Wayback Machine, The Hindu
  8. Ludwig Pesch, Of Bamboo And Magic – A Flautist At Eighty[permanent dead link]
  9. G.S. Rajan, Indian Bamboo Flute

బయటిలింకులు[మార్చు]