ఎన్.రమణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎన్.రమణి
ముంబైలో జరిగిన ఒక కచేరీలో ఎన్.రాజం, టి.ఎస్.నందకుమార్‌లతో ఎన్.రమణి
వ్యక్తిగత సమాచారం
జననం(1934-10-15)1934 అక్టోబరు 15
తిరువరూర్, తమిళనాడు, భారతదేశం
మరణం2015 అక్టోబరు 9(2015-10-09) (వయసు 80)
మైలాపూర్, చెన్నై, India
సంగీత శైలికర్ణాటక సంగీతం
వృత్తికర్ణాటక వాద్య కళాకారుడు
వాయిద్యాలువేణువు
క్రియాశీల కాలం1939–2015

ఎన్.రమణి లేదా ఫ్లూట్ రమణి అని పిలువ బడే నటేశన్ రమణి (15 అక్టోబరు 1934 – 9 అక్టోబరు 2015) ఒక కర్ణాటక సంగీత వేణుగాన కళాకారుడు. ఇతడు కర్ణాటక సంగీతంలో పొడుగైన వేణువును ప్రవేశపెట్టాడు.[1]

ఆరంభ జీవితం, నేపథ్యం[మార్చు]

ఇతడు తమిళనాడు లోని తిరువారూర్ నగరంలో సంగీత కళాకారుల కుటుంబంలో జన్మించాడు.[1] తిరువారూర్ నగరం కర్ణాటక సంగీత త్రిమూర్తులకు పుట్టినిల్లు.[2] ఇతడు మొదట తన తాత, వేణుగాన విద్వాంసుడు అయిన అళియూర్ నారాయణస్వామి అయ్యర్ వద్ద తన ఐదవ యేటి నుండే సంగీతం నేర్చుకున్నాడు.[2][3]

ఇతడు తన మొదటి కచేరీ 8వ యేట ఇచ్చాడు.[1] తన మేనమామ టి.ఆర్.మహాలింగం దృష్టిలో పడి అతని శిష్యుడిగా మారడం ఇతని జీవితంలో ఒక గొప్ప మలుపు.[2]

వృత్తి[మార్చు]

ఇతడు 1945లో ఆకాశవాణిలో మొదటి కచేరీ చేడాడు.[1] 1956లో మద్రాసు సంగీత అకాడమీలో తొలి ప్రదర్శన ఇచ్చాడు.[2] ఇతడు తన 22వ యేటికే అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించాడు.[1]

శిష్యులు[మార్చు]

ఇతడు "రమణి అకాడమీ ఆఫ్ ఫ్లూట్"ను స్థాపించి[1] వందలాది మంది శిష్యులకు శిక్షణను ఇచ్చాడు. ఇతని శిష్యులలో ఎ.ఎన్.భాగ్యలక్ష్మి, చిత్తూరు రాఘవరామన్, చిత్తూరు శ్రీనివాసన్, గోపి గణేష్ సోదరులు, వి.కార్తికేయన్, కె.కార్తికేయన్, ఎల్.వి.ముకుంద్, నందిని హరీష్, బి.రామకృష్ణ, వి.రంగరాజన్ మొదలైన వారున్నారు.[1]

పర్యటనలు[మార్చు]

ఇతడు దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలలోని సంగీత సభలు, ఇతర ప్రదేశాలలో ప్రదర్శన్లు ఇచ్చాడు. అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండు, శ్రీలంక వంటి ప్రపంచదేశాలలో పర్యటించి ముప్పైకి పైగా కచేరీలు నిర్వహించాడు.[1]

కర్ణాటక ఫ్లూట్ ఆవిర్భావం[మార్చు]

19వ శతాబ్దపు చివరి వరకు దక్షిణ భారతపు 8 రంధ్రాల వెదురుతో చేసిన వేణువు/మురళి/పిల్లనగ్రోవి లేదా ఉత్తర భారతదేశపు 6 రంధ్రాల "బాన్సురి" కర్ణాటక సంగీత కచేరీలలో ఉపయోగించేవారు కాదు. శరభశాస్త్రి అనేక ప్రయోగాల తరువాత వేణువును కచేరీలలో ఒక వాద్యపరికరంగా వినియోగించడం ఆరంభించాడు. శరభశాస్త్రి బాణీని అతని శిష్యుడు పల్లడం సంజీవరావు కొనసాగించాడు. కానీ ఈ "కర్ణాటక వేణువాద్యం"లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చి ప్రచారంలోనికి తెచ్చి, జాతీయ అంతర్జాతీయ ఖ్యాతిని ఆపాదించింది మాలి, అతని శిష్యుడు ఎన్.రమణి.[4]

పురస్కారాలు, ప్రశంసలు[మార్చు]

ఆకాశవాణిలో ఇతని ప్రదర్శనలకు అనేక హిందుస్తానీ, కర్ణాటక సంగీత విద్వాంసుల నుండి ప్రశంసలు లభించాయి.

ఇతనికి లభించిన పురస్కారాలలో కొన్ని:

మరణం[మార్చు]

నటేశన్ రమణి తన చివరి దశలో గొంతు క్యాన్సర్‌ బారిన పడి కచేరీలకు దూరంగా ఉన్నాడు. ఇతడు 2015, అక్టోబర్ 9వ తేదీన చెన్నైలోని మైలాపూర్‌లో మరణించాడు.[5][6] ఇతనికి నలుగు సంతానం ఉన్నారు.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 Parthasarathy, T. S. (1997). "The Sadas". The Journal of the Music Academy, Madras. LXVIII. Music Academy: 54.
  2. 2.0 2.1 2.2 2.3 Parthasarathy, T. S. (1997). "The 70th Madras Music Conference". The Journal of the Music Academy, Madras. LXVIII. Music Academy: 2.
  3. Aruna Chandaraju (23 June 2006). "The Hindu : Friday Review Hyderabad / Interview : Notes from various masters". The Hindu. Archived from the original on 2 నవంబరు 2012. Retrieved 16 May 2008.
  4. Dr. N. Ramani Interview about Mali
  5. Flute Ramani dies aged 81
  6. "Flautist N. Ramani passes away". The Hindu. 9 October 2015. Retrieved 9 October 2015.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఎన్.రమణి&oldid=3902600" నుండి వెలికితీశారు