పల్లడం సంజీవరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పల్లడం సంజీవరావు
వ్యక్తిగత సమాచారం
జననం(1882-10-18)1882 అక్టోబరు 18 </ref>
పల్లడం, తమిళనాడు, భారతదేశం
మరణం1962 జూలై 11(1962-07-11) (వయసు 79)
సంగీత శైలివేణువు

పల్లడం సంజీవరావు (1882–1962) తమిళనాడు కు చెందిన భారతీయ వేణుగాన విద్వాంసుడు, కర్ణాటక సంగీతకారుడు.

విశేషాలు

[మార్చు]

సంజీవరావు 1882లో కొయంబత్తూరు సమీపంలోని పల్లడం అనే గ్రామంలో ఒక తంజావూరు మరాఠీ కుటుంబంలో జన్మించాడు. ఇతడు షట్కాల నరసయ్య, శీర్కాళి నారాయణస్వామి వద్ద సంగీతం నేర్చుకున్నాడు.పన్నెండు సంవత్సరాల వయసు నాటికే ఇతడు సంగీతంలో మెళకువలన్నీ నేర్చుకున్నాడు. ఆ తర్వాత శరభశాస్త్రి వద్ద ఏడు సంవత్సరాలు వేణుగానం నేర్చుకున్నాడు.

మద్రాసు సంగీత అకాడమీ భారత శాస్త్రీయ సంగీతంలో ఇతని సేవలను గుర్తించి 1943లో సంగీత కళానిధి పురస్కారాన్ని ప్రకటించింది. అదే సంవత్సరం ది ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ, చెన్నై నుండి "సంగీత కళాశిఖామణి" పురస్కారాన్ని ఇతడు పొందాడు. 1954వ సంవత్సరంలో కేంద్ర సంగీత నాటక అకాడమీ ఇతనికి అవార్డును ప్రదానం చేసింది[1]. ఇతనికి వేణుగాన శిరోమణిఅనే బిరుదుకూడా లభించింది.

మూలాలు

[మార్చు]
  1. [permanent dead link] సంగీత నాటక అకాడమీ అవార్డు సైటేషన్]
  • "The Past Instrumentalists - Palladam Sanjeeva Rao". carnatica.net.
  • http://www.thehindu.com/features/friday-review/music/article65614.ece
  • http://www.hindu.com/thehindu/mp/2006/05/13/stories/2006051300520100.htm Archived 2006-09-19 at the Wayback Machine
  • M. Vinayak (January 15, 2000). "Struggle for survival". The Hindu. Archived from the original on 2012-01-20. Retrieved 2021-02-08.