ద్వారం మంగతాయారు

వికీపీడియా నుండి
(ద్వారం మంగతాయరు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ద్వారం మంగతాయారు వయొలిన్ (వాయులీనం) విద్వాంసురాలు.

జీవిత విశేషాలు

[మార్చు]

మంగతాయారు ప్రముఖ వాయులీన విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు కుమార్తె.[1] ఆమె బాల్యమంతా విజయనగరంలోనే గడిచింది. తండ్రి వద్ద వయోలిన్ నేర్చుకుంది. విజయనగరంలోని సంగీత కళాశాలలో డిప్లొమా చేసింది. ఆమె విజయనగరం లోని మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో 1973లో ప్రొఫెసర్ గా చేరింది. రెండు సంవత్సరాల తరువాత ఆమె చెన్నై వెళ్ళి ఆలిండియా రేడియో లో ఎ-గ్రేడు కళాకారిణిగా చేరి 16 సంవత్సరాల పాటు సేవలనందించింది.[1] అదే సమయంలో ఎన్నో కచేరీల్లో పాల్గొంది. ఎమ్మెస్ సుబ్బలక్ష్మి, డి.కె.పట్టమ్మాళ్, వేదవల్లి, ఎమ్మెల్ వసంతకుమారి వంటి కళాకారుల కచేరీల్లో వాద్య సహకారం అందించింది. ఆమె పెళ్ళి చేసుకోలేదు.

పురస్కారాలు

[మార్చు]
  • వంశీ సంగీత అకాడమీ నుంచి జీవిత సాఫల్య పురస్కారం [2]
  • 2012 లో ఆమెకు "సంగీత విద్యానిథి" పురస్కారం.[3]
  • ఆమెకు 2015 మన్మధ నామ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కళారత్న పురస్కారం లభించింది.[4]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Footprints in the sands of time". RANEE KUMAR. The Hindu. April 14, 2011. Retrieved 7 January 2016.
  2. "మణులొద్దు.. మాన్యాలొద్దు." త్రిగుళ్ల నాగరాజు. sakshi. February 25, 2015. Archived from the original on 13 డిసెంబరు 2015. Retrieved 7 January 2016.
  3. "Mangatayaru, Umaramarao feted". correspondent. The Hindu. February 9, 2012. Retrieved 7 January 2016.
  4. "ఉగాది పురస్కార విజేతలను ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - Published On:20-03-2015, సాక్షి". Archived from the original on 2016-03-04. Retrieved 2016-01-10.

ఇతర లింకులు

[మార్చు]