గరివిడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గరివిడి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విజయనగరం జిల్లా గరివిడి మండలం లోని గ్రామం.[1]

సమీప నగరాలు[మార్చు]

విజయనగరం,రాజాం,బొబ్బిలి,శ్రీకాకుళం దగ్గరి నగరాలు

జనాభా[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం ఈ మండలంలో  68,289 జనాభాను కలిగి ఉంది. ఇక్కడ అక్షరాస్యత సగటున 50% పైబడి కలిగి ఉంది. అలాగే విజయనగరం  జిల్లాలో పురుషులు 63%, స్త్రీలు 40% అక్షరాస్యత సగటు కలిగి వున్నా ఏకైక మండలం గరివిడి మాత్రమే. ఈ మండలం చీపురుపల్లి నియోజకవర్గంనకు, విజయనగరం పార్లమెంట్ తో  కలిసి  ఉంది.

చెప్పుకోదగినవి[మార్చు]

  • గరివిడి రైల్వే స్టేషన్ హౌరా-చెన్నై ప్రధాన రైలు మర్గాన కలిగి ఉంది.
  • విజయనగరం జిల్లాలో మూడు CBSE  స్కూల్స్ మాత్రమే కలిగి వున్నాయి . అందులో ఒకటి గరివిడిలో శ్రీమతి గోదావరి సరాఫ్ CBSE  స్కూల్ ను కలిగి ఉంది.ఇది అత్యుత్తమ ప్రమాణాలతో విద్యను విద్యార్థులకు అందిస్తుంది.
  • ఈ మండలంలో లభించే ముఖ్యమైన ఖనిజాలు మాంగనీస్, కంకర, మరియు లైమ్ స్టోన్ వున్నాయి . ఈ ఖనిజాలతో ఫేకర్ (FACOR[2] ) గ్రూప్  సంస్థ ఏర్పడింది. ఈ సంస్థ ఇక్కడి ప్రజలకు దేవాలయాలను, విద్య సంస్థలను, ఆసుపత్రులను మరియు వ్యాయమశాలలను అందించింది. సంస్థలోని ఉద్యోగస్తులకు ఉచిత వసతి గృహాలను, నీటి, విద్యుత్ మొదలగు సదుపాయాలను అందించింది. ఇక్కడ వివిధ రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివిసిస్తున్నారు.

ఫేకర్ గ్రూప్  సంస్థ[మార్చు]

ఈ సంస్థ 1955 లో క్రీ. శే. ఉమ శంకర్ అగర్వాల్ గరివిడిలో స్థాపించారు మరియు మేనేజింగ్ డైరెక్టర్ లేట్ శ్రీ దుర్గా ప్రసాద్ సరాఫ్ చే విస్తరించబడింది. ఫెర్రో మాంగనీస్ ఉత్పత్తిలో శ్రీరాంనగర్ ఒక ఫెర్రో మాంగనీస్ ప్లాంట్ తో దాని ప్రయాణం ప్రారంభించారు. ఫెర్రో అల్లాయ్స్ కార్పొరేషన్ లిమిటెడ్, విస్తృతంగా FACOR[2] గ్రూప్ అని పిలవబడే, నేడు ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో అతిపెద్ద మరియు స్థిరపడిన నిర్మాతలు మరియు హై కార్బన్ ఫెర్రో క్రోమ్ / ఛార్జ్ క్రోమ్ యొక్క ఎగుమతిదారులలో ఒకటిగా, ఉక్కు మరియు స్టెయిన్లెస్ స్టీల్ తయారీకి ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. FACOR గ్రూప్, ఆంధ్ర ప్రదేశ్, ఫెర్రో అల్లాయ్స్ వివిధ రకాలుగా విస్తరించింది.  తర్వాత, ఒరిస్సా రాష్ట్రం భద్రక్ లో ఒక పెద్ద క్రోమ్ సంక్లిష్ట ఒరే మైనింగ్ సంస్థను ప్రారంభించారు. ఆ తర్వాత నాగపూర్ (మహారాష్ట్ర) కు వ్యాపించడం జరిగింది.

సమీప మండలాలు[3][మార్చు]

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

  • Sds Autonomous College Of Arts & Science

Address : Sriramnagar A; Garividi—535101; Vizianagar Aam Dist.

  • St.theressa Institute Of Engineering & Technology

Address : Garividi—535101; Chipurupalli; Vizianagar Aam Dis

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

గరివిడిలో రైల్వే స్టేషను ఉంది.R.T.C.బస్టాండు ఉంది.

బ్యాంకులు[మార్చు]

  • State Bank Of India, Garividi ( Ifsc Code : SBIN0004827, micrCode: 535002023)
  • Central Bank Of India, Garividi ( Ifsc Code : CBIN0284185, micrCode: NON-MICR)

మండలంలోని పట్టణాలు[మార్చు]

మండలంలోని గ్రామాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 68,289 - పురుషులు 34,217 - స్త్రీలు 34,072

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". మూలం నుండి 2016-03-10 న ఆర్కైవు చేసారు. Retrieved 2015-09-14. Cite web requires |website= (help)
  2. 2.0 2.1 http://www.facorgroup.in/
  3. "Garividi Mandal". www.onefivenine.com. http://www.onefivenine.com/india/villag/Vizianagaram/Garividi. Retrieved 2015-03-31. 

వెలుపలి లంకెలు[మార్చు]


"https://te.wikipedia.org/w/index.php?title=గరివిడి&oldid=2801475" నుండి వెలికితీశారు