పప్పు వేణుగోపాలరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పప్పు వేణుగోపాలరావు
పప్పు వేణుగోపాలరావు
వ్యక్తిగత సమాచారం
జననం (1948-06-30) 1948 జూన్ 30 (వయసు 75)
మూలంవిజయనగరం, ఆంధ్రప్రదేశ్
మరణం2024 ఏప్రిల్ 7
సంగీత శైలిసంగీత విద్వాంసుడు
వృత్తిమ్యూజికాలజిస్ట్, రచయిత

డాక్టర్ పప్పు వేణుగోపాలరావు సంగీత విద్వాంసుడు, రచయిత, తెలుగు అధ్యాపకుడు.

విశేషాలు

[మార్చు]

పప్పు వేణుగోపాలరావు విజయనగరం జిల్లా, బొబ్బిలిలో 1948, జూన్ 30వ తేదీన జన్మించాడు.[1] విజయనగరంలోని మహారాజా కళాశాల నుండి తెలుగు, ఇంగ్లీషు, సంస్కృత భాషలలో స్నాతకోత్తర పట్టాలను పొందాడు. తరువాత తెలుగు, సంస్కృతభాషలలో పి.హెచ్.డి. చేశాడు. విశాఖపట్నంలోని ఎ.వి.ఎన్.కళాశాలలో తెలుగు అధ్యాపకునిగా పనిచేశాడు. 1980లో అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ స్టడీస్ సంస్థలో చేరి 2008లో దక్షిణ భారత ప్రాంతానికి అసోసియేట్ డైరెక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేశాడు.[1]

ఇతడు పట్రాయని సంగీతరావు వద్ద వీణ మూడు సంవత్సరాలు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ వద్ద గాత్రం కొంతకాలం నేర్చుకున్నాడు.

ఇతడు ఆంగ్ల దినపత్రిక ది హిందూలో అనేక పుస్తక సమీక్షలు చేశాడు. కర్ణాటక సంగీతం, కూచిపూడి నృత్యాలపై వెంపటి చినసత్యంతో కలిసి దేశవిదేశాలలో అనేక ఉపన్యాస ప్రదర్శనలు ఇచ్చాడు. తెలుగు, సంస్కృత అవధానాలలో పృచ్ఛకునిగా పాల్గొన్నాడు. మద్రాస్ మ్యూజిక్ అకాడమీకి కార్యదర్శిగా 2008లో పనిచేశాడు.[2] ఆ సమయంలో సుబ్బరామదీక్షితులు రచించిన 1200ల పుటల "సంగీత సంప్రదాయ ప్రదర్శని"ని ఆంగ్ల భాషలో ఐదు సంపుటాలలో అనువదించి ప్రచురించాడు. భారతీయ శాస్త్రీయ నృత్యంపై వెలువడే నర్తనం అనే త్రైమాస పత్రికకు, శృతి అనే సంగీత ప్రధాన మాసపత్రికకు సంపాదకవర్గ సభ్యుడిగా వ్యవహరించాడు.

రచనలు

[మార్చు]
 • పద పరిమళం
 • నిత్యార్చన
 • నృత్యభారతి
 • సంస్కృతాంధ్ర భారత భాగవతములు
 • Nritya ratnavali (జాయప సేనాని సంస్కృతంలో వ్రాసిన నృత్యరత్నావళికి ఆంగ్లానువాదం)
 • Flowers at his feet
 • Smiles of the muse

బిరుదులు

[మార్చు]

ఇతనికి ఈ క్రింది బిరుదులున్నాయి.[2]

 • "సంగీత సామ్రాట్"
 • "సంగీతశాస్త్ర విశారద"
 • "నాట్య కళాసాగర"
 • "నాట్య కళావిశారద"
 • "కళా విపంచి"

మరణం

[మార్చు]

ఇతడు తన 75వ యేట 2024, ఏప్రిల్ 7వ తేదీ ఆదివారం నాడు చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించాడు. ఇతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు.[1]

మూలాలు

[మార్చు]
 1. 1.0 1.1 1.2 న్యూస్ టుడే (10 April 2024). "ప్రముఖ సంగీత విద్వాంసుడు డాక్టర్ పప్పు వేణుగోపాలరావు కన్నుమూత". ఈనాడు దినపత్రిక. Retrieved 14 April 2024.
 2. 2.0 2.1 వెబ్ మాస్టర్. "పప్పు వేణుగోపాలరావు, డి.లిట్". యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర. Retrieved 14 April 2024.