కాసు వెంకట కృష్ణారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కాసు వెంకట కృష్ణారెడ్డి

ఎమ్మెల్యే
ముందు కోడెల శివప్రసాదరావు
తరువాత గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి
నియోజకవర్గం నరసరావుపేట నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 28 సెప్టెంబర్ 1947
బిక్కవోలు, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం [1]
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ Indian Election Symbol Ceiling Fan.svg వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు కాసు వెంగల్ రెడ్డి
జీవిత భాగస్వామి సంధ్యా
బంధువులు కాసు బ్రహ్మానందరెడ్డి
సంతానం కాసు మహేష్ రెడ్డి,ఉమామహేశ్వర రెడ్డి
నివాసం నరసరావుపేట, గుంటూరు జిల్లా

కాసు వెంకట కృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు పర్యాయాలు నరసరావుపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పని చేశాడు.

రాజకీయ జీవితం[మార్చు]

కాసు వెంకట కృష్ణారెడ్డి రాజకీయ నేపధ్యమున్న కుటుంబం నుండి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1971 నుండి 1975 వరకు గుంటూరు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేశాడు. ఆయన 1978లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి నరసరావుపేట నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన తరువాత గుంటూరు జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పని చేశాడు. కాసు వెంకట కృష్ణారెడ్డి 1989,1991లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి నరసరావుపేట లోకసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యాడు.

కాసు వెంకట కృష్ణారెడ్డి 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి నరసరావుపేట నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయి తిరిగి 2004, 2009లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో రాష్ట్ర సహకారశాఖ మంత్రిగా పని చేశాడు.[2]

మూలాలు[మార్చు]

  1. Lok Sabha (2021). "Members Bioprofile". Archived from the original on 2 December 2021. Retrieved 2 December 2021.
  2. Sakshi (13 November 2013). "ఆంటోని కమిటీ ఏమైంది?: మంత్రి కాసు కృష్ణారెడ్డి". Archived from the original on 3 December 2021. Retrieved 3 December 2021.