Jump to content

కాటూరి నారాయణ స్వామి

వికీపీడియా నుండి
కాటూరి నారాయణ స్వామి
జననం1922
ప్రకాశం జిల్లా పొదిలి మండలం కాటూరి వారిపాలెం
మరణం29 ఆగస్టు 2010
పదవి పేరు8వ లోక సభ సభ్యులు
రాజకీయ పార్టీతెలుగు దేశం పార్టీ
మతంహిందువు
భార్య / భర్తశ్రీమతి లక్ష్మీ నరసమ్మ
పిల్లలుఇద్దరు కుమారులు ఒక కుమార్తె
తల్లిదండ్రులుకాటూరి వెంకట నరసప్ప నాయుడు, చెన్నమ్మ
శాసన సభ్యులు - 1962 - 1978 , 1983-84

కాటూరి నారాయణ స్వామి (1922 - 2010) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యులుగా, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఏనిదోవ లోకసభలో సభ్యునిగా. రైతు నాయకుడుగా సేవలు అందించారు.

జననం

[మార్చు]

కాటూరి నారాయణ స్వామి ప్రకాశం జిల్లా పొదిలి మండలం కాటూరి వారిపాలెం గ్రామంలో ఒక సంపన్న రైతు కుటుంబంలో వెంకట నరసప్ప నాయుడు, చెన్నమ్మ దంపతులకు 1922లో జన్మించారు. వీరి వివాహం లక్ష్మీ నరసమ్మతో జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

కాటూరి నారాయణ స్వామి 1955లో ఆచార్య ఎన్.జి. రంగా గారి ప్రోత్సాహంతో రాజకీయ రంగప్రవేశం చేసారు. ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన తొలి శాసనసభకు పొదిలి నియోజకవర్గం నుండి కృషికార్ లోక్ పార్టీ అభ్యర్ధిగా పోటి చేసి పరాజయం చెందారు. 1956లో పొదిలి గ్రామ సర్పంచిగా పనిచేశారు. భూ తనఖా బ్యాంకు అధ్యక్షునిగా, జిల్లా పరిషత్ సభ్యునిగా పనిచేసారు. ప్రకాశం జిల్లాలో ఒక ప్రముఖ నాయకుడిగా గుర్తింపు పొందాడు.

1962, 1967 లలో కాంగ్రెస్ అభ్యర్దిగా పొదిలి శాసనసభ నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యునిగా ఎన్నికైనారు.

మరలా 1972 లో ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పొదిలి నియోజకవర్గం నుండి రాష్ట్ర శాసనసభకు ఎన్నికైనారు. 1978 ఎన్నికలలో కాంగ్రెస్ (ఆర్) అభ్యర్దిగా పోటి చేసి పరాజయం చెందారు. ఆ తరువాత 1982లో ఎన్.టి. రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ లో చేరారు.

1983 లలో దర్శి శాసనసభా నియాజకవర్గం నుండి తెలుగు దేశం పార్టీ అభ్యర్ధిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభకు ఎన్నికై ప్రోటెం స్పీకరుగా ఎన్.టి.రామారావు తో శాసన సభ్యునిగా పదవీ స్వీకారం చేయించారు. ఎన్. టి రామారావు గారి మంత్రివర్గంలో కొద్దికాలం నీటిపారుదల శాఖా మంత్రిగా పనిచేశారు.

1984లో నరసరావుపేట లోక్ సభకు జరిగిన ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ అభ్యర్దిగా పోటి చేసి కాసు బ్రహ్మానందరెడ్డిపై గెలుపొందినారు[2]

మరణం

[మార్చు]

నిడంబర నిస్వార్ధ ప్రజా సేవకుడిగా విశేష అభిమానాన్ని పొందిన కాటూరి నారాయణ స్వామి 29 ఆగస్టు 2010 న మరణించారు.

మూలాలు

[మార్చు]
  1. "8th Lok Sabha Members Bioprofile". Retrieved 10 September 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "Members Biographical Sketches Eighth Lok Sabha". Parliament of India LOK SABHA. Retrieved 10 September 2021.{{cite web}}: CS1 maint: url-status (link)