Jump to content

భారతీ తీర్థ

వికీపీడియా నుండి
(భారతీ తీర్థ మహాస్వామి నుండి దారిమార్పు చెందింది)
శ్రీ భారతీ తీర్థ మహాస్వామి
ಜಗದ್ಗುರು ಶ್ರೀ ಭಾರತೀ ತೀರ್ಥ ಮಹಾಸ್ವಾಮಿನ:
జననంతంగిరాల సీతారామాంజనేయులు
(1951-04-11) 1951 ఏప్రిల్ 11 (వయసు 73)
మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం చెన్నై, భారత దేశం)
బిరుదులు/గౌరవాలు36th and present Jagadguru of శృంగేరి శారదా పీఠం
గురువుశ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి
తత్వంAdvaita
Smartism
ప్రముఖ శిష్యు(లు)డుSri Vidhushekhara Bharati mahaswamigal
ఉల్లేఖనभारती करुणापात्रं भारती पदभूषणम् । भारती पदमारूढं भारती तीर्थमाश्रये ॥

భారతీ తీర్థ మహాస్వామి, శృంగేరి శారదా పీఠం 36వ పరమాచార్యులు.

జీవిత విశేషాలు

[మార్చు]

భారతీ తీర్థ మహాస్వామి జన్మస్థలం గుంటూరు జిల్లా, పల్నాడు ప్రాంతంలో నాగులేరు నదీ తీరాన ఉన్న అలుగు మల్లిపాడు గ్రామం.ఇక్కడ తంగిరాల వారిది వైదికాచార కుటుంబం. అతని తల్లిదండ్రులు తంగిరాల వేంకటేశ్వరావధాని, అనంతలక్ష్మమ్మ.వీరు కృష్ణయజుఃశాఖీయులు, ఆపస్తంబసూత్రులు, కుత్సస గోత్రులు.వీరు నలుగురు కుమార్తెల తరువాత పుత్రుడు కలగాలని శివారాధన చేయగా 1951 ఏప్రిల్ 11న స్వామివారు కలిగారు.తల్లిదండ్రులు సీతారామాంజనేయులు అని పేరుపెట్టారు.

స్వామివారు చిన్నప్పటి నుండే భక్తిభావాలను ప్రదర్శించేవారు.వేదాధ్యయనం తండ్రిగారి వద్ద ప్రారంభించి, తరువాతి కాలంలో ప్రతాపగిరి శివరామశాస్త్రి వద్ద సంస్కృతాంధ్రాల్ని నేర్చుకున్నాడు. చిన్నతనంలోనే సంస్కృతంలో మంచి ప్రావీణ్యం గడించి విద్వాంసుల మన్ననలు పొందారు.సంహితా, బ్రాహ్మణ, ఆరణ్యకంలను అభ్యసించి జిల్లా వేద ప్రవర్థక విద్వత్పరిషత్తు వారి వేద పరీక్షలో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యాడు. ఇతను ఏకసంథాగ్రాహి.

1960వ సంవత్సరంలో శృంగేరి పీఠాధీశ్వరులు శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు విజయయాత్రలో భాగంగా నరసారావుపేట వేంచేశారు.అవధాని తన కుమారుని వెంటబెట్టుకొని జగద్గురువులకు పాదాభివందనం చేసారు. గురువుల దర్శనం ద్వారా సీతారామాంజనేయులు అనిర్వచనీయమైన అనుభూతిని పొందాడు. వేద పండితులతో పాటు జరిగిన వేదమంత్ర పఠనంలో అతని మంత్రోచ్ఛారణం చూచి శ్రీచరణులు ముగ్ధులైనాడు. 1961 సంవత్సరంలో మహాస్వాముల వారి పునర్దర్శన సమయంలో భారతీ తీర్థ సంస్కృత భాషను తిలకించి విశిష్ట పురస్కారం ఇచ్చాడు. మహాస్వామి వారు ఉజ్జయినిలో, చాతుర్మాస్య వ్రతం జరుపుచుండగా అక్కడకు చేరిన సీతారామాంజనేయులు తనను శిష్యునిగా స్వీకరించమని ప్రార్థించాడు.మహాస్వామి అనుగ్రహంతో స్వామివారి శిష్యునిగా ఏడెనిమిది సంవత్సరంలలో కృష్ణయజుర్వేదాలు, న్యాయ, వ్యాకరణ, పూర్వోత్తర, మీమాంసాది శాస్త్రాలలో పరిపూర్ణ పాండిత్యం గడించారు.

చాలా సంవత్సరాలు శారదా పీఠంలో అతి సన్నిహితంగా ఆ బ్రహ్మచారి మేధాశక్తిని, సత్ప్రవర్తనను, శాస్త్ర పాండిత్యంలను పరీక్షించుచున్న పీఠాధిపతులు అతనిమీద వాత్సల్యం కలిగి శ్రీ శారదాదేవి అనుమతితో శ్రీ శృంగేరి శంకర పీఠానికి ఉత్తరాధిపతిగా నియమించవలెనని ఆనంద నామ సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ ద్వాదశి 1974 నవంబరు 11న) నాడు నిర్ణయించాడు.ఆనాడు వేలాది భక్తుల సమక్షంలో వారికి సన్యాసాశ్రమం అనుగ్రహించి "శ్రీ భారతీ తీర్థ" అనే ఆశ్రమ నామధేయం ఇచ్చారు.స్వామివారి శాస్త్ర పాండిత్యం, సంభాషణా చాతుర్యంలు నిరుపమానమైంది.అతని సంస్కృతం, తెలుగు, కన్నడం, తమిళం, హిందీ భాషలలో అనర్గళంగా ఉపన్యాసాలు ఇస్తారు. సన్యాసాశ్రమంలో గురువుతోను, తరువాత ఒక్కరే భారతదేశమంతా విజయయాత్రలు జరిపారు.అభినవ విద్యాతీర్థ మహాస్వామివారు 1989 సెప్టెంబరు 21న బ్రాహ్మీభావంను పొందారు. ఆ తరువాత భారతీ తీర్థ మహాస్వామి శుక్ల నామ సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ పంచమి గురువారం 1989 అక్టోబరు 19న 36 వ జగద్గురు శంకరాచార్యగా అతీంద్రియ జ్ఞానం యొక్క సింహాసనం అధిరోహణతో పట్టాభిషిక్తులై శృంగేరి శారద పీఠాధిపత్యంను వహించాడు.[1]శ్రీ భారతి తీర్థ మహాస్వామిజీ అప్పటి నుండి అసంఖ్యాక ఆధ్యాత్మిక ఆకాంక్షల వెనుక మార్గదర్శక స్ఫూర్తిగా నిలిచాడు.శ్రీచరణులు పీఠాధిరోహణం చేసిన తర్వాత గురువులు చూపిన మార్గంలో ధర్మరాజ్యపాలనం చేయుచూ, భక్తుల అభ్యర్ధనలను మన్నించి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాలలో విజయయాత్ర జరిపి భక్తులను అనుగ్రహించారు.

రచనలు

[మార్చు]

మహాస్వామి గరుడ గమన తవ అనే మహావిష్ణు స్తోత్రాన్ని రచించారు.[2]

నరసరావుపేటలో నడయాడిన భారతీ తీర్థ

[మార్చు]

భారతీ తీర్థ మహాస్వామికి సంవత్సరం వయసు నిండీ,నిండకముందే నరసరావుపేటలో తంగిరాల కుటుంబం స్థిర నివాసం ఏర్పరచుకొని స్థానిక రామిరెడ్డిపేటలో నివశించినట్లుగా తెలుస్తుంది.[3]

మూలాలు

[మార్చు]
  1. "Sri Bharati Tirtha Mahaswamiji - Sringeri Sharada Peetham". web.archive.org. 2019-10-22. Archived from the original on 2019-10-22. Retrieved 2019-10-22.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. గరుడ గమన తవ సాహిత్యం జీనియస్.కాం లో[permanent dead link]
  3. "భారతీ తీర్థుని పుట్టిల్లు..నరసరావుపేట". web.archive.org. 2019-10-22. Archived from the original on 2019-10-22. Retrieved 2019-10-22.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

బయటి లింకులు

[మార్చు]