Jump to content

నాగులేరు

వికీపీడియా నుండి
పల్నాడు జిల్లా, గురజాల మండలం గోగులపాడు వద్ద నాగులేరు నది

నాగులేరు నది, వినుకొండ శ్రేణిలో నాయకురాలి కనుమ దగ్గర నల్లమల కొండలలో పుట్టి, కారెంపూడి ప్రక్కగా ప్రవహించి ఉత్తరదిశగా మాచర్ల పర్వతశ్రేణులలో 32 కి. మీ. దూరం ప్రవహించి రామపురం దగ్గర కృష్ణాలో కలుస్తుంది. ఒకప్పుడు స్వచ్ఛమైన మంచినీటి వనరుగా ఉన్న నాగులేరు స్థానిక వాగుగా ఉండేది, తాగు, సాగునీటికి నాగులేరు వాగు ప్రధాన ఆధారం. దాచేపల్లి, కారంపూడి, నల్లమల అటవీ ప్రాంతంలో 2,800 ఎకరాల్లో నాగులేరు విస్తరించి ఉంది. ఇది కృష్ణానదికి ఉపనది, ఇది వినుకొండ పరిధిలోని నాయకురాలు కనుమ సమీపంలో నల్లమల అటవీ ప్రాంతంలో పుట్టి, మాచర్ల ప్రాంతం మీదుగా ఉత్తరం వైపు ప్రవహించి దాచేపల్లి మండలం రామాపురం సమీపంలో కృష్ణానదిలో కలుస్తుంది. ఒకప్పుడు దీనిని నాగేశ్వరి నది అనేవారని, కృష్ణా నదికి ఉపనది అయిన ఈ నదిని ఇప్పుడు నాగులేరు అని పిలుస్తారు.[1]

చరిత్ర

[మార్చు]

సా. శ. 1182 లో కారంపూడి గ్రామం వద్ద నాగులేరు వాగు ఒడ్డున ఇద్దరు సోదరులు నలగామ రాజు, మలిదేవ రాజు మధ్య జరిగిన ప్రసిద్ధ పల్నాటి యుద్ధం (పల్నాడు యుద్ధం) నాగులేరు నది ఒడ్డున జరిగిందని చరిత్ర చెపుతుంది. ఈ యుద్దం గురించి తెలుగు ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారు. అప్పటి నుండి, యోధుల వంశస్థులు ప్రతి సంవత్సరం కారంపూడిలో పలనాటి వీరారాధన ఉత్సవాలు, పల్నాటి యుద్ధం ఫలితాన్ని నిర్ణయించే కోడిపందాలను నిర్వహిస్తారు. కారంపూడి లోని నాగులేరు ఒడ్డున ప్రతి సంవత్సరం యోధుల వారసులు కోడిపందాలు నిర్వహిస్తారు. ప్రధానంగా పల్నాడు ప్రాంతంలోని కారంపూడి, చింతపల్లి, పెద కొదమగొండ్ల, చిన కొదమగొండ్ల, దాచేపల్లి, కేసనపల్లి, తక్కెళ్లపాడు, అలుగుమల్లిపాడు తదితర గ్రామ ప్రాంతాలద్వారా నాగులేరు ప్రవహిస్తుతుంది.[2]

ప్రస్తుత పరిస్థితి

[మార్చు]

ఒకప్పుడు స్వచ్ఛమైన మంచినీటి వనరుగా ఉన్న నాగులేరు స్థానిక వాగు ఇప్పుడు పల్నాడు ప్రాంతంలోని దాచేపల్లి, కారంపూడి గ్రామీణ ప్రాంతాలకు అనుకూలమైన డంప్ యార్డ్‌గా మారింది. తాగు, సాగునీటికి నాగులేరు వాగు ప్రధాన ఆధారం కాగా ప్రస్తుతం వాగుకు ఇరువైపులా అనధికారికంగా ఆక్రమణలు చేయడంతో అది కుంచించుకుపోతోంది. కొన్నేళ్లుగా వ్యాపారులు స్థానిక వాగులోకి చెత్తను వేస్తుండడంతో దుర్వాసన వెదజల్లడంతో పాటు నీరు కలుషితం కావడంతో ప్రజలకు ముప్పు వాటిల్లుతుందని ప్రజలు ఆందోళనచెందుతున్నారు.[3]

మూలాలు

[మార్చు]
  1. Ramana, K. V. (2020-03-01). "With Naguleru stream dying, water crisis a major concern for Palnadu region in Andhra Pradesh". The New Indian Express. Retrieved 2024-01-31.
  2. Ramana, K. V. (2020-03-01). "With Naguleru stream dying, water crisis a major concern for Palnadu region in Andhra Pradesh". The New Indian Express. Retrieved 2024-01-31.
  3. "With Naguleru stream dying, water crisis a major concern for Palnadu region in Andhra Pradesh". web.archive.org. 2024-01-31. Archived from the original on 2024-01-31. Retrieved 2024-01-31.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=నాగులేరు&oldid=4282214" నుండి వెలికితీశారు