జె.ఎస్.ఆర్.అన్నమయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అన్నమయ్య జెఎస్ఆర్, స్వస్థలం పల్నాడు జిల్లా ముఖ్య పట్టణం నరసరావుపేట.[1] ఇతను 1995 సెప్టెంబరు 30న నరసరావుపేటలో జన్మించాడు.ఇతని తల్లిదండ్రులు జొన్నలగడ్డ శ్రీరామమూర్తి, లక్ష్మీకాంతమ్మ. తిరుమల ఇంజినీరింగ్ కళాశాల, నరసరావుపేటలో బి.టెక్., (ఎలక్ట్రికల్., ఎలక్ట్రానిక్స్) ఇంజనీరింగు శాఖలో గోల్డ్  మెడల్ సాధించాడు.బి.టెక్. చదివేటప్పడే క్యాంపస్ ఎంపికలో మొదట యాక్సెంచర్ కంపెనీలో 2016 సెప్టెంబరు 9న సాప్ట్వేర్ ఇంజనీరుగా చేరాడు.అ కంపెనీలో 2019 ఫిబ్రవరి 4 వరకు విధులు నిర్వహించాడు.దానినుండి విప్రోలో క్వాలిటీ టీమ్ లీడరుగా వెంటనే చేరాడు. విప్రోలో 2020 సెప్టెంబరు వరకు పనిచేసాడు.ఇతను సమాజ మంచి కోసం ముఖ్యంగా యువత భవిష్యత్తు, పర్యావరణ హితం, అవాంతర అంటువ్యాదులు నివారణలో ప్రజలను అప్రమత్తం చేయుటలో నిత్యం అలోచించే మంచి యోచనాాపరుడు.

విద్య, వృత్తి[మార్చు]

అన్నమయ్య 1 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు సెయింట్ ఆన్స్ ఉన్నత పాఠశాలలో చదివాడు, పాఠశాలలో చదివేటప్పుడు జిల్లా స్థాయి విజ్ఞాన ప్రదర్శనలో డీశాలినేషన్ ద్వారా స్వచ్చ జలతయారీ , నిల్వ మీద ప్రదర్శన ద్వారా మొదటి బహుమతి అందుకున్నాడు. ఇంటర్ మీడియట్, భావన జూనియర్ కళాశాల (2011-2012)లో చదివి, తరువాత తిరుమల ఇంజనీరింగ్ కళాశాలలో బి.ఇ., (ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్)- 2016 లో పూర్తి చేశాడు. బి.టెకె., ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ శాఖలో గోల్డ్  మెడల్ సాధించాడు. బి.టెక్. చదివేటప్పడే అన్నమయ్య30కి పైగా సౌరశక్తి, సోలార్ ట్రీ రూపకల్పన అంశంపై అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ 30 ఇంజనీరింగు కళాశాలలో పత్ర సమర్పణ చేసి, చేసిన ప్రతి కళాశాలలో అవార్డులు పొందాడు.ఈ విషయం పై ఈనాడు దినపత్రికలో పూర్వ గుంటూరు జిల్లా ఎడిషన్ 2016 ఫిబ్రవరి 19 నందు "అన్నమయ్య అందిరిందయ్యా " అనేశీర్షికతో వార్త ప్రచురించారు. క్యాంపస్ ఎంపికలో యాక్సెంచర్ కంపెనీ, హైదరాబాదు నందు 2016 సెప్టెంబరు 9న సాప్ట్వేర్ ఇంజనీరుగా చేరి, స్పెషల్ ప్రొడక్షన్ ఏరియా లీడ్ పదోన్నతి పొంది, అ కంపెనీలో 2019 ఫిబ్రవరి 4 వరకు విధులు నిర్వహించాడు.దానికి రాజీనామా ఇచ్చి, విప్రో కంపెనీ, హైద్రాబాదు నందు క్వాలిటీ టీమ్ లీడరుగా వెంటనే చేరాడు. విప్రోలో 2020 సెప్టెంబరు వరకు పనిచేసాడు.

జీవితంపై ప్రభావం చూపిన సన్నివేశం[మార్చు]

అన్నమయ్య నిరుపేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు వారికి ఉద్యోగాలు కల్పించేందుకు అవసరమైన నైపుణ్యాలను నేర్పించే లక్ష్యంతో యాక్షన్ బిఫోర్ కాన్సెప్ట్ (ఎబిసి) (ABC-Action Before Concep) అనే కొత్త బోధనా సాంకేతికతను అభివృద్ధి చేశాడు. దీని ద్వారా ఉపాధ్యాయులు సాధారణ వస్తువులను ఉపయోగించి మరింత ఆచరణాత్మక ఉదాహరణలను చేర్చడం ద్వారా విద్యార్థులకు ఆసక్తికరమైన భావనలను అందించవచ్చు. అతని లక్ష్యంలో భాగంగా దృశ్యమానత, రూపకల్పనపై ఆలోచనా భావం కలిగించటానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 500 ప్రభుత్వ పాఠశాలలు, 100 కళాశాలలను సందర్శించాడు. కెరీర్ డెవలప్‌మెంట్ కు అవసరమైన అంశాలు స్వీయ ప్రేరణ, విమర్శనాత్మక ఆలోచన, భావన పై 50,000 మంది విద్యార్థులకు ఉచిత శిక్షణా సమావేశాలు నిర్వహించాడు.[2] [3]

అన్నమయ్య నరసరావుపేట స్థానిక కళాశాలలో బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్‌లోని విప్రో సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశాడు. స్కిల్ ట్రైనర్‌గా అతని ప్రయాణం బస్సులో ఒక విద్యార్థితో సంభాషణ సమయంలో ప్రారంభమైంది.అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ ఉద్యోగం పొందటానికి తగిన అవసరాలను తీర్చలేకపోతున్నారని  అ బాలుడు అన్నమయ్యకు వివరించాడు. దానిమీదట అన్నమయ్య కొన్ని స్థానిక పాఠశాలలను క్షుణ్ణంగా పరిశీలించి, వాటిమీద సరైన ఆలోచనతో పరిశోధన చేసిన తర్వాత, ఇంటర్నెట్ సౌకర్యాలు, డిజిటల్ తరగతి గదులు, లైబ్రరీలు ఉన్నప్పటికీ, చాలా పాఠశాలలు అనుసరిస్తున్న పాత బోధనా పద్ధతుల వల్ల విద్యార్థులు వాటితో మమేకం కాలేకపోతున్నారని గమనించాడు.దీనిని అధిగమించటానికి అన్నమయ్య అభివృద్ధి చేసిన 'ABC-Action Before Concept'  బోధనా సాంకేతికత ద్వారా ఉపాధ్యాయులు సాధారణ వస్తువులను ఉపయోగించి మరింత ఆచరణాత్మక ఉదాహరణలను చేర్చడం ద్వారా విద్యార్థులకు ఆసక్తికరమైన భావనలను అందించవచ్చు అని కొన్ని శిక్షణా తరగతులు తర్వాత, విశ్లేశించినప్పుడు ఎబిసి కాన్సెప్ట్ ఫలితాలు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మరింత ఫలవంతమయ్యాయి.[2]

చెక్ కొవిడ్ నౌ వెబ్ యాప్ సృష్టి[మార్చు]

జె.ఎస్.ఆర్.అన్నమయ్య తన హోదాగా ‘మనిషి’ని ప్రస్తావించినప్పుడు, అతను సాధారణానికి మించిన పనిని చేస్తున్నాడని స్పష్టమవుతుంది. భారతదేశంలో కరోనావైరస్ వ్యాప్తి ప్రారంభదశలో వచ్చిన వార్తలు గురించి అతను విన్న రాత్రి అతను నిద్రలేకుండా అలోచించాడు. కొవిడ్ టెస్టులో  పాజిటివ్ అని నిర్థారణ అయ్యేంతవరకు కొవిడ్-19 తేలికపాటి లక్షణం ఉన్నప్పటికీ ఎవరూ భయపడకూడదని, వారు నిశ్చింతగా ఉండాలని, దీనికి ఏదైనా పరిష్కారమార్గం కనుగొనాలని ఆరాత్రి అతను నిర్ణయించుకున్నాడు.దానికి పరిష్కారమార్గంగా ఒక వెబ్ యాప్‌ను రూపొందించాలని నిర్ణయించుకున్నాడు. అతను తక్షణమే అతని స్నేహితులు విజయ్ పున్నారావు, కృష్ణ కొవ్విడి (సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్) లను, తమ సాంకేతిక నైపుణ్యాన్ని సామాజిక ప్రయోజనం కోసం ఉపయోగించాలని సంప్రదించాడు. ముగ్గురి బృందం “చెక్‌కోవిడ్‌ నౌ” అనే వెబ్ యాప్ ను రూపొందించడంలో సమయాన్ని వృథా చేయలేదు.దాని ద్వారా 30 సెకన్లులలో కొవిడ్ కేసులను గుర్తించడానికి సుళువైన మార్గం ఏర్పండింది.[4][5]

కొవిడ్ 19లో అన్నమయ్య వెబ్ యాప్ సేవలు[మార్చు]

ఇదే కాకుండా, కోవిడ్-19 సమయంలో, అతను మరో ఇద్దరి స్నేహితులతో కలిసి www.checkcovidnow.com అనే వెబ్ అప్లికేషన్‌ను రూపొందించాడు. ఇది నిర్దిష్ట ప్రాంతంలో పాజిటివ్ కేసులను కనుగొనటంలో ప్రభుత్వాలకు బాగా సహాయపడింది. మొదటి  రెండవ కోవిడ్ తరంగాల సమయంలో అనేక కేసులను కనుగొనడంలో గుంటూరు నగరపాలక సంస్థ అధికారులకు ఈ వెబ్ అప్లికేషన్ బాగా సహాయపడింది. తరువాత, స్థానిక సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి, గ్రౌండ్-లెవల్‌లో సానుకూల మార్పులు తీసుకురావడానికి గుంటూరు నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన ఐఇసి (ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్) ఇన్‌ఛార్జ్‌గా నియమితుడయ్యాడు. కొవిడ్ సమయంలో సమాజానికి అన్నమయ్య చేసిన సేవలను గుర్తించి, జాతీయ మానవ హక్కుల కమిషన్ 2018-19 సంవత్సరానికి జాతీయ యువజన అవార్డును అందజేసింది.[6]

అవార్టులు[మార్చు]

  • నేషనల్ యూత్ పార్లమెంట్ 2022 ఢిల్లీ ద్వారా నేషనల్ యూత్ ఐకాన్ అవార్డు -2022.
  • జాతీయ మానవ హక్కుల కమిషన్ 2021 న్యూఢిల్లీ ద్వారా ఇండియన్ స్టార్ ఐకాన్ అవార్డు.

మూలాలు[మార్చు]

  1. https://www.newindianexpress.com/cities/hyderabad/2020/apr/18/checkcovidnow-a-web-app-to-spot-coronavirus-cases-in-telangana-2131600.html
  2. 2.0 2.1 https://web.archive.org/web/20230115110839/https://www.newindianexpress.com/good-news/2022/jan/23/28-year-old-on-a-mission-to-provide-quality-education-to-underprivileged-2410296.html
  3. "28-year-old on a mission to provide quality education to underprivileged- The New Indian Express". web.archive.org. 2023-01-15. Archived from the original on 2023-01-15. Retrieved 2023-01-15.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "CheckCovidNow: A web app to spot coronavirus cases in Telangana-The New Indian Express". web.archive.org. 2023-01-15. Archived from the original on 2023-01-15. Retrieved 2023-01-16.
  5. "CheckCovidNow: A web app to spot coronavirus cases in Telangana". The New Indian Express. Retrieved 2023-01-16.
  6. https://www.newindianexpress.com/good-news/2022/jan/23/28-year-old-on-a-mission-to-provide-quality-education-to-underprivileged-2410296.html

వెలుపలి లంకెలు[మార్చు]