కపిలవాయి కాశీ రామారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కపిలవాయి కాశీ రామారావు ప్రముఖ దాత, వ్యాపార దక్షుడు.

రామారావు గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని పెదగార్లపాడు గ్రామంలో 1921లో జన్మించాడు. తల్లిదండ్రులు నరసయ్య మరియు లక్ష్మీనరసమ్మ. 1939 లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చేరి వివిధ స్థాయిలలో పదవులు నిర్వహించాడు. మూఢ నమ్మకాలు తొలగనిదే సంఘం అభివృద్ధి చెందదని నమ్మేవాడు. పరోపకారం కోసం చేసిన వాగ్దానాలను నిలుపుకొనేవాడు. సహకార రంగంలో పాలుపంచుకొని, దాని అభివృద్ధికి తోడ్పడ్డాడు. గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, గుంటూరు జిల్లా మార్కెటింగ్ సొసైటీ అభివృద్ధికి కృషిచేశారు. శ్రీశైలం మరియు కోటప్ప కొండ దేవాలయాల ట్రస్టు బోర్డు సభ్యులుగా పనిచేశాడు.