బెల్లంకొండ సుబ్బారావు
బెల్లంకొండ సుబ్బారావు | |
---|---|
బెల్లంకొండ సుబ్బారావు | |
జననం | బెల్లంకొండ సుబ్బారావు 1902 కారంపూడి, ![]() |
మరణం | 1952 నవంబరు 21 |
ప్రసిద్ధి | రంగస్థల నటుడు, న్యాయవాది |
మతం | హిందూ |
బెల్లంకొండ సుబ్బారావు (1902 - నవంబర్ 21, 1952) ప్రముఖ రంగస్థల నటుడు, న్యాయవాది.
జననం[మార్చు]
ఈయన 1902లో కారంపూడిలో జన్మించాడు. కానీ పెరిగింది నరసరావుపేట పట్టణం
రంగప్థల ప్రస్థానం[మార్చు]
ఇతని మొదటి వేషం గయోపాఖ్యానంలో శ్రీకృష్ణుడు. పాండవోద్యోగ విజయాలులో శ్రీకృష్ణ పాత్రధారణలో ఇతని నటన తారాస్థాయినందుకుంది.చక్కగా పద్యం విడమరిచి పాడడం, నాభి దగ్గరనుండి నాదాన్ని తీసుకురావడం, పద్యంలోని ముఖ్య పాదాన్ని తిరిగి తిరిగి చదవడం ఇతని ప్రత్యేకత.కృష్ణుడు వేషంమీద మీసాలు పెట్టుకుందిఇతనొక్కడే.అందుకనే ఇతనిని మీసాల కృష్ణుడు అనేవారు. శ్రీకృష్ణుని పాత్రకు మీసాలు పెట్టవచ్చా, పెట్టకూడదా అనే సమస్యపై అంధ్రదేశంలో తర్జన భర్జనలకు గురికావడానికి ఇతని మీసాలే కారణం. కృష్ణపాత్రకు అంకితమైపోయిన నటుడు.
నటించిన పాత్రలు[మార్చు]
శ్రీకృష్ణుడు, రాజరాజు, నలబాహుకులు, హరిశ్చంద్రుడు, విజయరామరాజు, పఠాన్ రుస్తుం వంటి పాత్రలు.
మరణం[మార్చు]
1952 నవంబర్ 21న పరమపదించారు.
మూలాలు[మార్చు]
- బెల్లంకొండ సుబ్బారావు, నాటక విజ్ఞాన సర్వస్వం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట. 660.