లావు శ్రీకృష్ణ దేవరాయలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లావు శ్రీకృష్ణ దేవరాయలు

లోకసభ సభ్యుడు
పదవీ కాలం
23 మే 2019 – ప్రస్తుతం
ముందు రాయపాటి సాంబశివరావు
నియోజకవర్గం నరసరావుపేట

వ్యక్తిగత వివరాలు

జననం (1983-04-29) 1983 ఏప్రిల్ 29 (వయస్సు 39)
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు లావు రత్తయ్య, నిర్మల [1]
జీవిత భాగస్వామి మేఘన లావు
సంతానం రతన్ లావు
పూర్వ విద్యార్థి లా ట్రోబ్ యూనివర్సిటీ
వెబ్‌సైటు https://www.krishnalavu.com

లావు శ్రీకృష్ణ దేవరాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నరసరావుపేట నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచాడు.[2]

జననం, విద్యాభాస్యం[మార్చు]

లావు శ్రీకృష్ణ దేవరాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు లో డాక్టర్‌ లావు రత్తయ్య, నిర్మల దంపతులకు 1983 ఏప్రిల్ 29న జన్మించాడు. ఆయన ఆస్ట్రేలియాలోని లా ట్రోబ్ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ (మీడియా స్టడీస్‌) పూర్తి చేశాడు. లావు శ్రీకృష్ణ లావు ఎడ్యుకేషనల్‌ సొసైటీ వైస్‌ చైర్మన్‌గా, శ్రీ సోమనాథ ఎడ్యుకేషనల్‌ సొసైటీ పేరుతో ఏలూరులో సీబీఎస్‌ఇ సీల్‌బస్‌తో నడుస్తున్న స్కూల్‌కి అధ్యక్షుడిగా, ఈఎస్‌ఎస్‌ వీఇఇ ఏఏఆర్‌ కే ఎడ్యుకేషనల్‌ సొసైటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌(ఏలూరు)డైరక్టర్‌గా ఉన్నాడు. [3]

రాజకీయ జీవితం[మార్చు]

లావు శ్రీకృష్ణ రాజకీయాలపై ఆసక్తితో 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయన 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నరసరావుపేట నియోజకవర్గం నుండి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు పై ఓట్ల 153978 మెజారిటీతో గెలిచి తొలిసారి ఎంపీగా పార్లమెంట్ కు ఎన్నికయ్యాడు. లావు శ్రీకృష్ణ 2019లో ఐఐటీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) లకు సంబంధించిన కౌన్సిల్ కమిటీ సభ్యుడిగా నియమితుడయ్యాడు.[4]

మూలాలు[మార్చు]

  1. Sakshi (31 May 2019). "వారసులొచ్చారు." Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022. {{cite news}}: Check date values in: |archivedate= (help)
  2. Sakshi. "Narasaraopet Constituency Winner List in AP Elections 2019". Archived from the original on 23 ఆగస్టు 2021. Retrieved 23 August 2021. {{cite news}}: Check date values in: |archivedate= (help)
  3. Sakshi (18 March 2019). "వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థుల ప్రొఫైల్స్‌". Archived from the original on 23 ఆగస్టు 2021. Retrieved 23 August 2021. {{cite news}}: Check date values in: |archivedate= (help)
  4. News18 Telugu (17 December 2019). "నరసరావుపేట వైసీపీ ఎంపీకి కీలక పదవి... ఆ కమిటీలో..." Archived from the original on 23 ఆగస్టు 2021. Retrieved 23 August 2021. {{cite news}}: Check date values in: |archivedate= (help)