కొమెర అంకారావు (జాజి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొమెర అంకారావు
కొమెర అంకారావు పల్నాడు జిల్లా, కారెంపూడి గ్రామానికి చెందిన పర్యావరణవేత్త.
జననంఅంకారావు
1983
భారతదేశం- భారతదేశం
నివాస ప్రాంతంకారెంపూడి ,
(గ్రామం, మండలం)
పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఇతర పేర్లుజాజి (ముద్దుపేరు)
వృత్తిపర్యావరణ పరిరక్షణ
ప్రసిద్ధిపర్యావరణ యోధుడు,
మతంహిందూ
తండ్రిరాములు
తల్లిఏడుకొండలు

కొమెర అంకారావు, ఇతను ప్రకృతిని ఆస్వాదిస్తూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు, అడవులు సంరక్షణ, పెంపకం, వృద్ధి కోసం నడుముకట్టి, గత రెండు దశాబ్దాలుగా పైగా అలుపెరుగనిపోరాటం చేస్తూ, నల్లమల అడవిలో ప్లాస్టిక్ నిర్మూలన చేస్తూ, సమాజాన్ని చైతన్య పరుస్తూ సరికొత్త హరిత అడవులు సృష్టిస్తున్న, భారతీయ పర్యావరణ యోధుడు, పర్యావరణ వేత్త, నల్లమల అడవితల్లి బిడ్డగా గుర్తింపు పొందిన యువకుడు.[1] అంకారావు తండ్రి రాములు, తల్లి ఏడుకొండలు. అంకారావు ముద్దు పేరు జాజి. ఇతను 1983లో పల్నాడు జిల్లా, కారెంపూడి గ్రామంలో జన్మించాడు. ఇతను విద్యాభ్యాసం 10వ తరగతి వరకు కారెంపూడిలో సాగింది. ఆ తరువాత కొంతకాలానికి దూరవిద్యలో డిగ్రీ, పిజీ పూర్తిచేసారు.

అంకారావు దినచర్య

[మార్చు]

అంకారావు దినచర్య సూర్యుడు దినచర్యలాంటింది. అతనికి రోజువారీ ఇతర కార్యక్రమాలంటూ వేరే ఏమీ ఉండవు. రోజూ ఒకే కోవకు చెందిన దినచర్య. అతని జీవిత దినచర్య గత రెండు దశాబ్దాలపై నుండి నల్లమల అడవి సంరక్షణతో ముడిపడిఉంది. ప్రతిరోజు తెల్లవారుజామున 6 గంటలకల్లా కాలకృత్యాలు ముగించుకుని, అతనికున్నస్క్కూటీ బైక్‌పై, ఖాళీ గోతాలతో అడవిలోకి వెళ్లతాడు.[2] ఆ రకంగా దట్టమైన నల్లమల అడవి లోకి ప్రతిరోజు 10 కి.మీ నుండి 20 కి.మీ ప్రాంతం అడవి లోపలకు చొచ్చుకునిపోయి, తను అనుకున్న లక్ష్యంకోసం అన్వేషణ కొనసాగిస్తారు. కొన్నిసార్లు 30కిమీ లోపలి వరకు, అతను గంటల తరబడి అన్వేషిస్తాడు. అడవులలో నిత్యం తిరుగుతూ పక్షులు, జంతువుల వేట జరగకుండా, చెట్లును నిర్మూలించకుండా వాటికి కాపాలాగా ఉంటాడు.

అడవిలో వినోదకులు, పర్యాటకులు వదిలిపెట్టిన పనికిరాని వస్తువులు-ప్లాస్టిక్ గ్లాసులు, పేపర్ ప్లేట్లు, బీరు సీసాలు, పాలిథిన్ కవర్లు ఇలా అనేక రకాల వ్యర్థ వస్తువులు సేకరించి ఒకచోటుకు ప్రోగుచేస్తాడు. అలా ప్రోగుచేసిన వ్యర్థాలు, అతను తెచ్చుకున్న గోతాలలో నింపి, వాటిని అతని బండిద్వారా అడవికి దూరంగా ఉన్న డంపింగ్ గ్రౌండ్‌కు తీసుకువెళ్లి,  పర్వావరణానికి ఎటువంటి హాని జరుగకుండా భూమిలో మట్టితో కప్పిపెడతాడు. ఇతను ఆ రకంగా సూర్యుడు అస్తమించేవరకు ప్రతిరోజు అదే దినచర్య. ఒకరకంగా చెప్పాలంటే ప్రకృతికి నేస్తం లాంటివాడు. దీని వలన గతంలో కన్నా అడవిలో పర్యావరణ పరిరక్షణ వలన, ఎన్నో ప్రాణులు చనిపోకుండా పరోక్షంగా ఇతనివలన వాటికి లభ్థి చేకూరుతుంది. ఇది ఒక ప్లాస్టిక్ నిర్మూలన ఉద్యమంగా మారి సమాజంలో పెనుమార్పు వచ్చింది. దాని ఫలితంగా అడవులలో ప్లాస్టిక్ నిర్మూలన పూర్తిగా తగ్గి, అడవులువృద్ధి చెందుతున్నాయి. ఇతను ఇంటి దగ్గర నుండి భోజనం తీసుకువెళ్లకుండా, అడవిలో ప్రకృతి ప్రసాదించే కాయలు, పండ్లు అతని ఆహారంగా అలవాటు చేసుకున్నాడు.

అంకారావు పర్యావరణ ఆరంగ్రేట్రం

[మార్చు]

ఇతనికి పర్యావరణంపై ఆసక్తి కలగటానికి అతను నివశించే ఇంటికి సమీపంలోనే నల్లమల అటవీ ప్రాంతం కలిగి ఉండటం ఒక కారణం. అతనికి 14 ఏళ్ల వయసులోనే అడవితో అతని ప్రయత్నం ప్రారంభమైంది.[3] ఒక రోజు అంకారావు తన ఇంటికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలోకి వెళ్లాడు. ఆరకంగా అతను నిత్యం అడవిలోకి వెళ్లేవాడు. దానిమీద కాలక్రమంలో, అతనికి అడవిలోని పక్షులతో అసాధారణమైన స్నేహం ఏర్పడింది. దానితో పర్యావరణం పరిరక్షణపై మరింత ఆసక్తి ఏర్పరుచుకున్నాడు. పక్షులు, జంతువులు, ఇతర రకరకాలు ప్రాణలు చేసే వాటి శబ్దాలు, కదలికలతో వాటిమీద, పర్యావరణం పరిరక్షించే కార్యక్రమంపై మంచి మమకారం పెంపుదించుకున్నాడు. ఆ రకంగా అతను అటవీసంరక్షణ మహాయాగం ప్రారంభమైంది.[4] అడవులలో ఔషధ మొక్కలు, వనమూలికలును గుర్తించి సంరక్షిస్తాడు. మండువేసవిలో కాలుతున్న అడవిలో మంటలను అదుపుచేస్తాడు. [5]ఈ చర్యవలన పక్షులు, జంతువులు, వాటి స్థావరాలు, గూళ్లు కాలిపోకుండా కాపాడతాడు.

తొలకరిలో విత్తన బంతులు వెదజల్లటం

[మార్చు]

అడవులలో ఖాళీ ప్రదేశాలు ఉండకుండా ఎల్లప్పుడూ పచ్చగా చూడాలనేది అంకారావు ద్యేయం. అందుకోసం అతను తొలకరి జల్లుల సమయంలో ఎత్తైన కొండలు, గుట్టలు, మైదాన ప్రాంతాలు, కుంటల చుట్టు ప్రక్కల ప్రాంతాలలోని ఖాళీ ప్రదేశాలలో సీడ్ బాల్స్ (విత్తన బంతులు) వెదజల్లటం అనే ఒక బృహత్తర కార్యక్రమాన్ని ఎంచుకున్నాడు. ప్రతి సంవత్సరం కోటి విత్తన బంతులు చల్లటం ఇతని ప్రత్వేకత. ఆరకంగా కోటికిపైగా కొత్త మొక్కలు అడవిలో అభివృద్ధిచెందటానికి కారకుడు అయ్యాడు.[6]

ప్రతి సంవత్సరం వర్షాకాలంలో అవసరమైన మొక్కలు సేకరించి, వాటిని అడవిలో నాటడం ఓ పెద్ద ఉద్యమంలాగా తీసుకున్నాడు. దీనివలన పలచని అటవీ ప్రదేశంలో మొక్కలు మరింత అభివృద్ధి చెందాయి.ఇది అటవీశాఖవారి మరింత గుర్తింపుకు కారణమైంది. ఇతనిపై ఈనాడులో ప్రత్వేక వ్యాసం ప్రచురించింది.[7] అడవులు ప్రపంచానికే గండెకాయలాంటిదని, అలాంటి అడవులు సంరక్షణ కాపాడుకోకపోతే, ప్రపంచమానవాళి మనుగడకే మరింత ప్రమాదమని, భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోనవలసి వస్తుందని ఈటీవి వార్కి ఇచ్చిన ఒక ఇంటర్యూలో తన ఆవేదన వెలిబుచ్చాడు.[8]

ప్రకృతి ప్రియుడు కొమెర అంకారావు (జాజి) ఒకేసారి కోటి విత్తనబంతులు చల్లే కార్యక్రమం 2023 జులై 9న కారెంపూడిలోని మంత్రాలయం గుడికి సమీపంలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో నిర్వహించాడు. ఈ కార్యక్రమానికి అప్పటి జిల్లా కలెక్టరు ఎల్.శివశంకర్, ఇతర అటవీశాఖాధికారులు హాజరయ్యారు. ఒకేసారి కోటి విత్తనాలు నాటడం అనే కార్యక్రమం ఎంతో కష్టమైందే అయినా అంకారావు కృషితో అది సాధ్యమైందని కలెక్టరు ఎల్.శివశంకర్ కొనియాడారు.[9]

2024లో కూడా కోటి విత్తన బంతుల కార్యక్రమం చేపట్టాడు. దీనికి సంబంధించి సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం పూర్తి చేశాడు. జూన్ నుండి సెప్టెంబర్ వరకు నాలుగు నెలల్లో కోటి విత్తన బంతులు చల్లి, కోట్ల కొత్త మొక్కలు వృద్ధిచేయటమే అతని లక్ష్యంగా పని చేస్తున్నారు.[10]

ఔషధ మొక్కల అధ్యయనం

[మార్చు]

అతని బాల్యంలో తండ్రి రాములు అడవిలోని ఔషధ మొక్కలు గురించి చెప్పిన విషయాలు బాగా ఆకలింపుచేసుకున్నాడు. వాటిని గుర్తించి అవి దేనికి పనికివస్తాయో అధ్యయనం చేసాడు. తనకు తెలియని మొక్కల ఆకులను తీసుకొచ్చి, గ్రామంలోని పెద్దవారిని కలసి వాటిని చూపించి, ఆ మొక్కలు పేర్లు తెలుసుకుని, అవి ఏకరం చికిత్సకు పనికివస్తుందో తెలుసుకునేవాడు. ఇంకా తెలియని మొక్కల పేర్లు, వాటి ఉపయోగాలు కొన్ని పూర్వ గ్రంధాల ద్వారా తెలుసుకున్నాడు. అడవిలో ఉండే ప్రతి మొక్క ఏదో ఒక ఔషధ గుణం కలిగి ఉంటుందని, ఒకానొక సందర్బంలో చెప్పారు.[11] ప్రజలకు తెలియని విషయాలను తెలుసుకొని భావితరాలకు మొక్కల గురించి చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఈ అరుదైన కార్యక్రమం చేపట్టాడు.

ప్రకృతి పాఠాల అధ్యాపకుడుగా అంకారావు

[మార్చు]

అతను గడిచిన రెండు దశాబ్దాలపైనుండి అడవుల పరిరక్షణ, పర్యావరణ కాపాడటం, ఔషధ మొక్కల గుర్తింపు, అడవిలోని పలచని ప్రదేశాలలో ఎలా మొక్కలు నాటాలి, వాటిని ఎలా అభివృద్ధి చేయాలి అనేదానిపై పూర్తిగా అవగాహన ఉంది. దానిని తనతోనే ఉంచుకొనకుండా రాబోవు తరాలవార్కి అవగాహన కల్పించాలనే సంకల్పం కలిగింది. దానికి విద్యార్థులను భాగస్వామ్యం చేసే కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలలోని లక్షలాది పాఠశాల విద్యార్థులకు అధ్యాపకుడుగా మారి,[12] ముఖ్యమైన మొక్కలు, వృక్షాలను ఎలా గుర్తించాలో, అడవి శ్రేయస్సుకు పక్షులు, జంతువులు ఎలా దోహదపడతాయో, వారిలో ప్రకృతిపై ప్రేమని, అడవిని కాపాడుకోవాల్సిన బాధ్యతను బోధించి, విద్యార్థులలో చైతన్యం తీసుకొచ్చారు. అలాగే ప్రతి వర్షాకాలంలో విద్యార్థులతో ‘‘సీడ్‌ బాల్స్‌’’ తయారు చేయించి, అడవికి తీసుకెళ్లి, వారితోనే చల్లిస్తారు.[13] అవి అతని నిరంతర కార్యక్రమాలుగా అలవర్చుకున్నాడు. ఇతనిని స్పూర్తిగా తీసుకుని, ఎంతోమంది వారి పాఠశాల ఆవరణలలో, గ్రామాలలోని ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటుతూ పచ్చదనం కల్పిస్తున్నారు.

రాజ్‌భవన్‌లో తేనీటి విందుకు ఆహ్వానం

[మార్చు]

2024 జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్బంగా రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఇచ్చిన తేనీటి విందుకు అహ్వానంతో అతిథిగా వెళ్లారు.[14]

ప్రశంసలు, అవార్డులు

[మార్చు]

అంకారావు అడవిపై చూపిస్తున్న స్వచ్ఛమైన ప్రేమను చూసి, జిల్లా అటవీశాఖ అధికారులు పలుసందర్బాలలో ఎలాంటి లాభాపేక్ష లేకుండా అడవిని కాపాడుచున్నాడని, అంకారావు, తమకంటే ఎక్కువ సేవ చేస్తున్నారని ప్రశంసించారు. అతను చేస్తున్న సేవలను గుర్తించి, సత్కారం చేశారు.[15]

  • ఎక్సెలెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ (ఇండివిడ్యువల్) - 2022లో సాక్షి ఎక్సెలెన్స్ అవార్డు.[16]
  • కాలిఫోర్నియాకు చెందిన లైవ్ టచ్ ఫౌండేషన్ "టాల్ హీరో" అవార్డు అందజేశారు.[14]
  • సుచిరిండియా, హైదరాబాదు వారు 2021లో హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరిగిన ఒక కార్యక్రమంలో "సంకల్పతార" అవార్డు అందజేశారు.[14]
  • దయానంద సరస్వతి  సంస్థ, కొచ్చెర్ల, గ్రామం. ఈపూరు మండలం, పల్నాటి జిల్లా వారి నుంచి 2022లో "వృక్ష మిత్ర" అవార్డును ప్రధానం చేసారు.[17]
  • 2023 ఆగష్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా నరసరావుపేటలో జరిగిన కార్యక్రమంలో అప్పటి జిల్లా కలెక్టరు లోతేటి శివశంకర్ అంకారావును "పర్యావరణ వేత్త" గా అభివర్ణించి, ప్రశంసాపత్రం అందజేసారు.
  • 2024 జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్బంగా నరసరావుపేటలో జరిగిన కార్యక్రమంలో అప్పటి జిల్లా కలెక్టరు లోతేటి శివశంకర్ "పర్యావరణ పరిరక్షకుడు" గా అభివర్ణించి, ప్రశంసాపత్రం అందజేసారు.
  • 2023 నవంబరులో పల్నాటి జిల్లా అటవీ శాఖాధికారి ఎన్.రామచంద్రరావు నల్లమల అడవిని దర్శించి, అంకారావు చేస్తున్న అడవుల అభివృద్ధి కార్యక్రమాన్ని చూసి ప్రశంసాపత్రం అందజేసారు.[18]
  • 2021 డిసెంబరులో పల్లెసృజన, గ్రామీణ సృజనాశక్తి వెలుగుదారుల వేదిక సంస్థ, హైదరాబాదు వారి మాస పత్రికలో అంకారావుపై "ప్రకృతిపుత్రుడు"గా అభివర్ణిస్తూ ప్రత్వేక వ్యాసం ప్రచురించారు.[19] (2022 నవంబరు -డిసెంబరు సంచిక 11 పేజీ)

మూలాల

[మార్చు]
  1. "కొమెర జాజి: నల్లమల అడవిలో పార్టీలు చేసుకునే కుర్రాళ్లకు ఆయన ఎందుకు క్లాసు తీసుకుంటారు? - BBC News తెలుగు". web.archive.org. 2024-08-06. Archived from the original on 2024-08-06. Retrieved 2024-08-06.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Komera Jaji: అడవి తల్లి ఒడిలోనే ఆనందం వెతుక్కుంటున్న వన ప్రేమికుడు | komera jaji from palnadu teaches lessons on nature". web.archive.org. 2024-08-17. Archived from the original on 2024-08-17. Retrieved 2024-08-17.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. https://web.archive.org/web/20240816050204/https://www.sakshi.com/telugu-news/family/palnadu-komera-ankarao-saves-forest-inspirational-journey-telugu-1509127
  4. "Anka Rao has dedicated his life to conserving Nallamala forest - The Week". web.archive.org. 2024-08-07. Archived from the original on 2024-08-07. Retrieved 2024-08-07.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. https://web.archive.org/web/20240817154814/https://www.sakshi.com/telugu-news/palnadu/1537343
  6. "ఏకంగా అడవినే దత్తత తీసుకున్నాడు.. ప్రతిరోజూ అడవి స్వచ్ఛత కోసం పరితపిస్తాడు – లోకహితం". 2024-07-29. Retrieved 2024-08-17.
  7. "Nature Lover: 'ది వీక్‌' మ్యాగజైన్‌లో అడవి బిడ్డ 'కొమెర అంకారావు'పై వ్యాసం | komera ankarao alias jaji turned as nature lover aims to conserve nallamala forest". web.archive.org. 2024-08-08. Archived from the original on 2024-08-08. Retrieved 2024-08-08.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  8. "అడవుల సంరక్షణే ముఖ్యం - ఏటా కోటి విత్తన బంతులే కొమెర అంకారావు లక్ష్యం - Nature Lover Komera Ankarao". web.archive.org. 2024-08-08. Archived from the original on 2024-08-08. Retrieved 2024-08-08.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  9. https://archives.prajasakti.com/kaaaraempaudai-adavailaoo-kaootai-vaitatanaaalau
  10. Bharat, E. T. V. (2024-05-28). "అడవుల సంరక్షణే ముఖ్యం - ఏటా కోటి విత్తన బంతులే కొమెర అంకారావు లక్ష్యం - Nature Lover Komera Ankarao". ETV Bharat News. Retrieved 2024-08-12.
  11. "కారెంపూడి అడవిలో కోటి విత్తనాలు". Prajasakti (in ఇంగ్లీష్). Retrieved 2024-08-12.
  12. "ఏకంగా అడవినే దత్తత తీసుకున్నాడు.. ప్రతిరోజూ అడవి స్వచ్ఛత కోసం పరితపిస్తాడు – లోకహితం". web.archive.org. 2024-08-17. Archived from the original on 2024-08-17. Retrieved 2024-08-17.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  13. "ఏకంగా అడవినే దత్తత తీసుకున్నాడు.. ప్రతిరోజూ అడవి స్వచ్ఛత కోసం పరితపిస్తాడు – లోకహితం". web.archive.org. 2024-08-12. Archived from the original on 2024-08-12. Retrieved 2024-08-12.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  14. 14.0 14.1 14.2 https://www.etvbharat.com/te/!state/nature-lover-komera-ankarao-alias-jaji-conserving-forests-aps24052806250
  15. "Anka Rao has dedicated his life to conserving Nallamala forest". The Week (in ఇంగ్లీష్). Retrieved 2024-08-12.
  16. "విన్నెర్స్ - 2022 - ప్రధాన అవార్డులు". www.sakshiexcellenceawards.com. Retrieved 2024-08-12.
  17. "పల్నాడులోని నల్లమల అడవుల్లో విరబూసిన…. 'జాజి' – CAPITAL VOICE TELUGU". web.archive.org. 2024-08-12. Archived from the original on 2024-08-12. Retrieved 2024-08-12.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  18. "అటవీ సంరక్షణ అందరి బాధ్యత | - | Sakshi". www.sakshi.com. Retrieved 2024-08-21.
  19. https://www.pallesrujana.org/2023/PS_Web_Nov_Dec%20-%202022.pdf