తుమృకోట

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
తుమృకోట
—  రెవిన్యూ గ్రామం  —
తుమృకోట is located in ఆంధ్ర ప్రదేశ్
తుమృకోట
అక్షాంశరేఖాంశాలు: 16°35′08″N 79°29′24″E / 16.585527°N 79.490089°E / 16.585527; 79.490089
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం రెంటచింతల
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 5,926
 - పురుషుల సంఖ్య 2,905
 - స్త్రీల సంఖ్య 3,021
 - గృహాల సంఖ్య 1,557
పిన్ కోడ్ 522 421
ఎస్.టి.డి కోడ్ 08642

తుమృకోట, గుంటూరు జిల్లా, రెంటచింతల మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 421., ఎస్.టి.డి.కోడ్ = 08642.

విషయ సూచిక

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

ఒకప్పుడు తిమ్మరుసు ఈ గ్రామాన్ని పాలించాడు. ఆయన పేరు మీద ఊరికి తిమ్మరుసు కోట అని పేరు వచ్చింది. అయితే కాలక్రమంలో ఆ పేరు తుమ్మర్కోడు, తుమ్మూరుకోట, తుమృకోటగా పరిణామం చెందింది.

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప మండలాలు[మార్చు]

తూర్పున గురజాల మండలం, దక్షణాన దుర్గి మండలం, పశ్చిమాన మాచెర్ల మండలం, తూర్పున దాచేపల్లి మండలం.

గ్రామనికి రవాణా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల, ఎస్.సి.కాలనీ.

గ్రామములో మౌలిక వసతులు[మార్చు]

బ్యాంకులు[మార్చు]

ఆంధ్రా బ్యాంకు. ఫోన్ నం.08642/255025. ఈ బ్యాంకు శాఖ, తుమృకోట గ్రామంతోపాటు, పాలువాయి, పశర్లపాడు, మల్లవరం గ్రామాలకు గూడా తన సేవలందించుచున్నది.

గ్రామంలోని సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

కీ.శే.కొణకంచి నారాయణ:- వీరు 2007 నుండి 2013 వరకు ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా పనిచేసినారు. వీరు 2017,జులై-16న, 82 సంవత్సరాల వయస్సులో, హైదరాబాదులోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుచూ మృతిచెందినారు. [10]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

గ్రామంలో చారిత్రక దేవాలయాలు, మసీదులు, చర్చిలు ఉన్నాయి.

శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో 2016, నవంబరు-27వతేదీ కార్తీకమాసం, ఆదివారంనాడు రెండున్నర లక్షల రూపాయల దాతల ఆర్థిక సహకారంతో, నవగ్రహ విగ్రహ ప్రతిష్ఠ కన్నులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. పెద్దసంఖ్యలో భక్తులు వేకువఝాము నుండియే ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో స్వామివారి కళ్యాణం, అన్నాభిషేకం, హోమం ఏర్పాటు చేసారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. [8]

శ్రీ రామాలయము[మార్చు]

ఈ ఆలయం చాలా పురాతనమైనది.

శ్రీ బ్రహ్మంగారి దేవాలయo[మార్చు]

ఈ ఆలయం నూతనంగా నిర్మించుచున్నారు. [1]

శ్రీ వూర ముత్యాలమ్మ తల్లి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో, 2014, ఆగస్టు-23, శ్రావణమాసం, శనివారం నాడు, అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. వర్షాలు లేక అల్లాడుతున్న అన్నదాతలు, వరుణదేవుడు కరుణించి, పాడిపంటలతో సంతోషంగా గడపాలని గ్రామస్థులు మొక్కుకున్నారు. శనివారం ఉదయం బోనాలు, రాత్రికి కుంకుమబండ్లు అత్యంత భక్తిశ్రద్ధలతో ఏర్పాటుచేసి, గ్రామ వీధులలో ఊరేగించారు. అనంతరం ముత్యాలమ్మ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. ఆదివారం రాత్రికి బలి కార్యక్రమం ఏర్పాటుచేసారు. [4]

శ్రీ జనార్ధనస్వామివారి ఆలయం[మార్చు]

దేవాదాయశాఖ పరిధిలోని ఈ ఆలయాన్ని 200 సంవత్సరాల క్రితం నిర్మించారు. అప్పట్లో భక్తులు, స్వామివారికి నిత్య ధూప, దీప, నైవేద్యాలకు, వేడుకలకు, పూజారులకు, చాకిరి మాన్యాలకు 40 ఎకరాలు, దేవాదాయశాఖకు 40 ఎకరాలు విరాళంగా అందజేసినారు. ఆ భూములను 14 సంవత్సరాల క్రితం, ప్రజాసంఘాలు నామమాత్రపు కౌలుకే స్వాధీనం చేసుకున్నవి. ఆ కౌలుగూడా బకాయిలు పేౠకుపోవదంతో, పూజారులు ఆలయంలో వేడుకలు నిర్వహించకుండా పట్టణాలకు వలస పోయినారు. ఆలయం శిథిలావస్థకు చేరడం, భూములు పరాధీనం కావడం, ధూప, దీప, నైవేద్యాలకు కరువవడంతో, గ్రామంలోని భక్తులను కలచివేసింది. 2011లో శ్రీ బండ్ల కృష్ణయ్య ఆధ్వర్యంలో గ్రామస్థులు సమావేశమై, జీర్ణోద్ధరణకు చేరుకున్న ఆలయాన్ని పునర్నిర్మించే సామర్థ్యం దేవాదాయశాఖకు లేనందువలన, భక్తుల విరాళాలతో ఆలయాన్ని పునర్నిర్మించాలని సంకల్పించారు. గ్రామంలో ప్రతి భక్తుడు, ఎకరాలవారీగా విరాళాలు సమర్పించారు. గ్రామ కాయిదా సొమ్ము, ప్రజాప్రతినిధులు ఎన్నికల సమయంలో ఇచ్చే సొమ్ము, తుమృకోటలో జన్మించి ఇతర రాష్ట్రాలలో, దేశాలలో ఉంటున్నవారు, వివిధవర్గాలనుండి విరాళాలు సేకరించాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. వెంటనే ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించారు. వారు ఒక సంవత్సరం తరువాత అనుమతి పత్రం ఇచ్చారు. దేవాదాయశాఖకు రు. 15 లక్షలు డిపాజిట్టు చేసి, ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తెచ్చి, నిర్మాణం చేపట్టేటందుకు అధికారుల అంగీకారం పొందినారు. సుమారు 18 సెంట్ల విస్తీర్ణంలో ఆలయ నిర్మాణపనులు జరుపుచున్నారు. జనార్ధనుడు, వేణుగోపాలస్వామి, గజలక్ష్మి లకు ప్రత్యేకంగా గర్భగుడి నిర్మించారు. 33 అడుగుల వెడల్పు, 15 అడుగుల పొడవుతో మందిర నిర్మాణం గ్రానైటుతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుచునారు. కోటప్పకొండ దగ్గర లభ్యమయ్యే రాయితో రు. 76 లక్షల వ్యయంతో పనులు చేయించుచున్నారు. మాచవరం మండలం లోని జింకలపాలెం నుండి 42 అడుగుల ఎత్తయిన ధ్వజస్తంభాన్ని ఏర్పాటుచేస్తున్నారు. ప్రస్తుతం గోడల నిర్మాణ పనులు పూర్తిచేసారు. ఇంతవరకు ఒక కోటి రూపాయల వ్యయం అయినది. మరియొక 50 లక్షల రూపాయలతో దేవతామూర్తులను భక్తులు దర్శనం చేసుకునే విధంగా తయారు చేసారు. [5]

నూతనంగా నిర్మించిన ఈ ఆలయ పునఃప్రతిష్ఠా మహోత్సవాలు, 2015.జూన్-2వ తేదీ మంగళవారం ప్రారంభించారు. నిత్యం హోమాలు, ప్రత్యేకపూజలు నిర్వహించ్చారు. ఆరవతేదీ శనివారం ఉదయం, గోదాదేవి, జనార్ధనస్వామి, రుక్మిణి, సత్యభామ, వేణుగోపాలస్వామి, ఆంజనేయుడు, గరుత్మంతుడు మొదలగు విగ్రహాలను, ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంతో గ్రామంలో తిరునాళ్ళ వాతావరణం నెలకొన్నది. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని గ్రామములో, 7వ తేదీ ఆదివారంనాడు, రాష్ట్రస్థాయిలో ఎడ్ల బలప్రదర్శన పోటీలు నిర్వహించి, గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేసినారు.[6]&[7]

శ్రీ పంచముఖ ఆంజనేయస్వామివారి ఆలయం[మార్చు]

ఈ గ్రామములో సమరసత, తిరుమల తిరుపతి దేవస్థానం మరియు గ్రామస్థుల సహకారంతో ఈ ఆలయ నిర్మాణానికి, 2017,జూన్-20వతేదీ మంగళవారంనాడు భూమిపూజ నిర్వహించినారు. తుమృకోటకు చెందిన శ్రీ కొణకంచి గురుప్రసాద్, గిరిజన కాలనీలోని ఐదు సెంట్ల స్థలాన్ని ఈ ఆలయ నిర్మాణానికి వితరణగా అందించినారు. [9]

గ్రామములోని ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

ఈ గ్రామంలోని ప్రజల ప్రధాన జీవనాధారము వ్యవసాయం

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామంలోని విశేషాలు[మార్చు]

రెంటచింతల మండలంలోని పెద్ద గ్రామాలలో ఇది ఒకటి.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 5,926 - పురుషుల సంఖ్య 2,905 - స్త్రీల సంఖ్య 3,021 - గృహాల సంఖ్య 1,557

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6,150.[1] ఇందులో పురుషుల సంఖ్య 3,080, స్త్రీల సంఖ్య 3,070, గ్రామంలో నివాస గృహాలు 1,448 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణము 2,121 హెక్టారులు.

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

  • [1] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి

[3] ఈనాడు గుంటూరు రూరల్; 2014,జనవరి-16; 4వపేజీ. [4] ఈనాడు గుంటూరు రూరల్; 2014,ఆగస్టు-24; 5వపేజీ. [5] ఈనాడు గుంటూరు రూరల్; 2014,నవంబరు-3; 3వపేజీ. [6] ఈనాడు గుంటూరు రూరల్; 2015,జూన్-5; 5వపేజీ. [7] ఈనాడు గుంటూరు రూరల్; 2015,జూన్-8; 15వపేజీ. [8] ఈనాడు గుంటూరు రూరల్; 2016,నవంబరు-28; 5వపేజీ. [9] ఈనాడు గుంటూరు రూరల్; 2017,జూన్-21; 4వపేజీ. [10] ఈనాడు గుంటూరు రూరల్; 2017,జులై-18; 4వపేజీ.


"https://te.wikipedia.org/w/index.php?title=తుమృకోట&oldid=2160293" నుండి వెలికితీశారు