మంచికల్లు
మంచికల్లు | |
---|---|
అక్షాంశ రేఖాంశాలు: 16°32′N 79°31′E / 16.533°N 79.517°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పల్నాడు |
మండలం | రెంటచింతల |
విస్తీర్ణం | 13.95 కి.మీ2 (5.39 చ. మై) |
జనాభా (2011) | 3,693 |
• జనసాంద్రత | 260/కి.మీ2 (690/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 1,851 |
• స్త్రీలు | 1,842 |
• లింగ నిష్పత్తి | 995 |
• నివాసాలు | 1,009 |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్‌కోడ్ | 522421 |
2011 జనగణన కోడ్ | 589837 |
మంచికల్లు, పల్నాడు జిల్లా, రెంటచింతల మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన రెంటచింతల నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన మాచర్ల నుండి 10 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1009 ఇళ్లతో, 3693 జనాభాతో 1395 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1851, ఆడవారి సంఖ్య 1842. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 600 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 258. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 589837.[1]
గ్రామ చరిత్ర
[మార్చు]రెంటచింతల నుండి రెండు కిలోమిటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం సమీపంలో కృష్ణానది ఉపనదైన గోలివాగు ప్రవహిస్తున్నది. ఈ గోలివాగు ఒడ్డున బౌద్ధ విహారల అవశేషాలు బయల్పడ్డాయి. ఇక్కడ పల్లవ చక్రవర్తి సింహవర్మ యొక్క ఏకైక శిలాశాసనం లభించింది. ఇతర పల్లవుల ప్రాకృత శాసనాలు కూడా బయల్పడ్డాయి.
సమీప గ్రామాలు
[మార్చు]మాడుగుల 5 కి.మీ, రెంటాల 5 కి.మీ, పాలువాయి 6 కి.మీ, రెంటచింతల 7 కి.మీ, ధర్మవరం 8 కి.మీ.
సమీప మండలాలు
[మార్చు]దక్షణాన దుర్గి మండలం, పశ్చిమాన మాచెర్ల మండలం, తూర్పున గురజాల మండలం, దక్షణాన వెల్దుర్తి మండలం.
విద్యా సౌకర్యాలు
[మార్చు]గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు ఉన్నాయి. సమీప బాలబడి, మాధ్యమిక పాఠశాల రెంటచింతలలో ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల రెంటచింతలలోను, ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్, డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాలలు మాచర్లలోనూ ఉన్నాయి.సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు మాచర్లలోనూ ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం మాచర్లలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరులోనూ ఉన్నాయి.
వైద్య సౌకర్యం
[మార్చు]ప్రభుత్వ వైద్య సౌకర్యం
[మార్చు]మంచికల్లులో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.ఒకపశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
[మార్చు]గ్రామంలో 4 ప్రభుత్వేతర వైద్య సౌకర్యాలున్నాయి. నలుగురు డిగ్రీ లేని డాక్టర్లు ఉన్నారు.
తాగు నీరు
[మార్చు]గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.కాలువ/వాగు/నది ద్వారా గ్రామానికి నీటిపారుదల వసతి ఉంది. చెరువు నీటి సౌకర్యం ఉంది.
పారిశుధ్యం
[మార్చు]గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు.మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు.గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది.సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు.ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు.సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
[మార్చు]మంచికల్లులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది.పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం ఉంది.వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రభుత్వ రవాణా సంస్థ బస్సు సౌకర్యం, ప్రైవేటు బస్సు సౌకర్యం మొదలైన సౌకర్యాలు గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. రైల్వే స్టేషన్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జిల్లా రహదారి గ్రామం నుండి 5 కి.మీ. దూరంలోపు ఉంది.ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి. ల్యాండ్ లైన్ సౌకరం లేదు బీఎస్ఎన్ఎల్ వాళ్ళు వాళ్ళు కూడా కనెక్షన్ ఇవ్వలేను అన్నారు,అందువల్ల ల్యాండ్ లైన్ కనెక్షన్ కుదరలేకపోయింది[2]
మార్కెటింగు, బ్యాంకింగు
[మార్చు]గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకువ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
[మార్చు]గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది.అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.
విద్యుత్తు
[మార్చు]గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 7 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
[మార్చు]మంచికల్లులో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- అడవి: 303 హెక్టార్లు
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 72 హెక్టార్లు
- వ్యవసాయం సాగని, బంజరు భూమి: 21 హెక్టార్లు
- వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 25 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూ క్షేత్రం: 974 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూ క్షేత్రం: 157 హెక్టార్లు
- నీటి వనరుల నుండి నీటి పారుదల లభిస్తున్న భూక్షేత్రం: 817 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
[మార్చు]మంచికల్లులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది
- కాలువలు: 433 హెక్టార్లు
- బావులు/బోరు బావులు: 384 హెక్టార్లు
బుగ్గవాగు జలాశయం
[మార్చు]మంచికల్లు గ్రామం వద్ద, 1.5 టి.ఎం.సి.లు నీటిని నిలువ చేసేటందుకు, బుగ్గవాగు జలాశయం ఉంది. ఇక్కడి నుండి లీకేజీ నీటితో రెంటాల, మంచికల్లు వాసులు మాగాణి భూములు సాగుచేస్తున్నారు. ఈ జలాశయం నిర్మాణదశలోనే ఈ గ్రామ రైతులు వృధా (సీపేజీ) జలంతోనే దశబంధు కాలువను నిర్మించారు. ఆ కాలువలో 365 రోజులూ నాగార్జునసాగర్ జలాలు ప్రవహించుచుంటవి. ఆ నీటితోనే ఈ గ్రామ రైతులు సుమారు నాలుగువేల ఎకరాలలో, ఖరీఫ్‌లోనూ, రబీలోనూ మాగాణి పండించుచున్నారు. వీరు అధికదిగుబడులు (ఎకరానికి 40, 45 బస్తాలు) సాధించడంలోనే గాకుండా అధికథరలకు తమ అమ్ముకొనడంలోనూ ముందున్నారు. మంచికల్లులోని ఈ జలాశయంలోని పూడిక తీసేందుకూ, విస్తీర్ణం పెంచేటందుకూ, వృధానీటిని సద్వినియోగం చేసేటందుకూ ఒక ఎత్తిపోతల పథకం మంజూరయినది. దశబంధు కాలువతోపాటు, గ్రామములో మరియొక చెరువులో గూడా వృధానీరు వచ్చి చేరుచున్నది. ఆ చెరువునీటితో మరియొక 250 ఎకరాలు సాగుచేస్తున్నారు. పాలువాయిగేటు లోని సూర్యునికుంటలో గూడా ప్రతి సంవత్స్రం వర్షపునీరు, సాగర్ జలాలు వచ్చుచున్నవి. ఆ నీటితో గూడా మరి కొంత మాగాణ భూమిని పండించుచున్నారు.
తయారీ
[మార్చు]మంచికల్లులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి:
గ్రామంలో ప్రధాన పంటలు
[మార్చు]గ్రామములో మౌలిక వసతులు
[మార్చు]విద్యుత్తు
[మార్చు]మంచికల్లు గ్రామ పొలిమేరలలోని ఒక కాలనీలో, ఒక దాత ఇచ్చిన స్థలంలో, ఒక కోటి రూపాయల అంచనా వ్యయంతో, ఒక 33/11 కె.వి. విద్యుత్తు ఉపకేంద్రం నిర్మాణం పూర్తి అయినది. దీనిలో ఒక 5 ఎం.వి.ఏ. ట్రాన్సుఫార్మరు గూడా ఏర్పాటు చేసారు. ఈ కేంద్రం ప్రారంభమయినచో, మంచికల్లు, పాలువాయిగేటు, కంభంపాడు, రెంటాల గ్రామాలలో లోవోల్టేజ్ సమస్య తీరిపోనున్నది.
ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం
[మార్చు]గ్రామ పంచాయతీ
[మార్చు]- 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో గోగుల సీతారామరెడ్డి, సర్పంచిగా ఎన్నికైనాడు. ఉప సర్పంచిగా పుల్లారెడ్డ్ ఎన్నికైనాడు.
- సుమారు 12 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని, 2015, సెప్టెంబరు - 24వ తేదీనాడు ప్రారంభించారు.
- ఎన్నికల ఒప్పందంలో భాగంగా సీతారామరెడ్డి తన సర్పంచి పదవికి సెలవు పెట్టగా, జిల్లా పంచాయతీ అధికారి ఉత్తర్వుల మేరకు ఉపసర్పంచిగా ఉనన్న గోగుల పుల్లారెడ్డి, 2016, ఫిబ్రవరి-17న సర్పంచిగా బాధ్యతలు చేపట్టినారు.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయo
[మార్చు]ఈ గ్రామంలో కొలువైయున్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయాన్ని కోటి రూపాయలతో నూతనంగా నిర్మించారు. మార్గశిరమాసం పౌర్ణమి సందర్భంగా అమ్మవారి తిరునాళ్ళు 2013 డిసెంబరు 8 నుండి 19 వరకూ జరుగును. [4]
ఈ ఆలయంలో, మార్గశిర పౌర్ణమి సందర్భంగా, ప్రతి సంవత్సరం నిర్వహించే వార్షిక తిరుణాళ్ళ వివరాలు:- 2014, నవంబరు-30వ తేదీన శక్తిని నిలుపుటతో ప్రారంభమవుతవి. డిసెంబరు-1వ తేదీన శక్తిని సాగనంపుట, 3వ తేదీన బియ్యంకోల, 4వ తేదీన పుట్టబంగారం, శక్తులయాగం, 5వ తేదీన జలబిందెలు, 6వ తేదీ పౌర్ణమి నాడు, శిడిమాను ఊరేగింపు, కోలాటం, 7వ తేదీన కుంకుమబండ్ల ఊరేగింపు, 8వ తేదీన బండారుతో తిరునాళ్ళ ముగింపు జరుగును. ఈ సందర్భంగా ఆలయాన్ని రంగులతో తీర్చిదిద్దినారు.
ఈ ఆలయ ఐదవ వార్షికోత్సవాలు, 2017, జూన్-14వతేదీ బుధవారంనాడు, వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో శివపార్వతుల కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించారు.
శ్రీ సీతారామస్వామి ఆలయం
[మార్చు]శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం
[మార్చు]ఈ ఆలయంలో 2016, ఏప్రిల్-3వ తేదీ ఆదివారంనాడు బ్రహ్మంగారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణం కన్నులపండువగా సాగినది. మద్యాహ్నం భక్తులకు అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం కళ్యాణమూర్తుల గ్రామోత్సవం నయనానందకరంగా నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని, ఆలయాన్ని రంరంగురంగుల విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. [1
గ్రామంలో ప్రధాన పంటలు
[మార్చు]గ్రామములోని ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)
[మార్చు]శ్రీ యరపతినేని శ్రీనివాసరావు ఎం.ఎల్.ఏ.
[మార్చు]ఈ గ్రామం శ్రీ యరపతినేని శ్రీనివాసరావు ఎం.ఎల్.ఏ గారి స్వంతగ్రామం. వీరు ఈ గ్రామానికి పశువైద్యశాలను మంజూరు చేయించారు. భవన నిర్మాణానికి స్థలం విరాళంగా ఇచ్చారు. పాలువాయి గేటు నుండి మంచికల్లు వరకూ తారు రోడ్డు వేయించారు. రెండు చెక్ డ్యాములు నిర్మించి, పొలాలకు సాగునీరు అందేలా కృషి చేశారు. గ్రామానికి నలుదిక్కులా ఉన్న పొలాలకు వెళ్ళే రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. పశర్లపాడు వంతెన, తూము రహదారి, బుగ్గవాగు డ్యాం, రాయవరం, రెంటచింతల, తిరుమలస్వామి రహదార్లకు నిధులు కేటాయించారు.వీరి తాత శ్రీ యరపతినేని తిరుపతయ్య, గ్రామానికి మంచినీటి సౌకర్యం కలుగజేసినారు. వీరి తండ్రి శ్రీ యరపతినేని ల్కష్మయ్య, సాగునీటి కోసం డైవర్షన్ టన్నెల్ తీసికొని వచ్చారు. ఇప్పుడు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు, ఇప్పుడు బుగ్గవాగులో పూడిక తీయించి, పల్నాడు ప్రాంత ప్రగతికి తోడ్పడుచున్నారు.
గ్రామ విశేషాలు
[మార్చు]ఈ గ్రామానికీ చెందిన ధీకొండ అచ్చయ్య, 40 సంవత్సరాల నుండి, ఆసక్తియున్న యువతకు, ప్రాచీనమైన కోలాటం జానపద కళలో శిక్షణనిచ్చుచున్నారు. వీరి వద్ద శిక్షణ తీసుకొన్న వారు, ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో, జాతరలు, తిరునాళ్ళ సందర్భంగా పలు ప్రదర్శనలిచ్చుచూ ఖ్యాతి గడించుచున్నారు. ఈ కళపై నేటి యువత ఆసక్తి చూపడంతో అంతరిచుచున్న ఈ కళ తిరిగి ఊపిరి పోసుకుంటున్నదని నాటి తరంవారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంచికల్లు గ్రామ సత్రం కూడలిలో 1970, మే-19వ తేదీనాడు, మహాత్మా గాంధీ, సుభాస్ చంద్రబోస్, జవహర్ లాల్ నెహ్రూ, పొట్టి శ్రీరాములు మొదలగు జాతీయ నేతల విగ్రహాలను ఏర్పాటుచేసారు. ఈ విగ్రహాలను ఏర్పాటు చేసి 46 సంవత్సరాలయిన సందర్భంగా, ఈ విగ్రహాలకు రంగులు వేసి అందంగా తీర్చిదిద్దినారు. 2016, మే-19న మాజీ సర్పంచి శ్రీ నెమిలి మల్లారెడ్డి, ఈ విగ్రహాలకు దండలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
గణాంకాలు
[మార్చు]2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,629. ఇందులో పురుషుల సంఖ్య 1,818, స్త్రీల సంఖ్య 1,811, గ్రామంలో నివాస గృహాలు 884 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 1,395 హెక్టారులు.