ద్విజాతి సిద్ధాంతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వివిధ జిల్లాల్లో మతాధిక్యతను ప్రతిబింబిస్తూ తయారుచేసిన 1909 నాటి బ్రిటీష్ ఇండియా సామ్రాజ్యపు పటం

ద్విజాతి సిద్ధాంతం (Urdu: دوقومی نظریہదో-ఖ్వామీ నజరియా, Devanagari: दो-क़ौमी नज़रिया, Bengali: দ্বিজাতি তত্ত্বదిజాతి టొట్టో) అనే సిద్ధాంతం ప్రకారం భారత ఉపఖండంలోని ముస్లింను ఏకీకృతం చేసే అంశం, మౌలికమైన గుర్తింపు వారి మతమే తప్ప భాష, జాతి(ఎత్నిసిటీ) కావు, కనుక వారి మధ్య సామ్యాలతో సంబంధం లేకుండా హిందువులు, ముస్లిములు వేర్వేరు జాతీయతలు కలిగివున్న రెండు జాతులు[1][2] ద్విజాతి సిద్ధాంతం పాకిస్తాన్ ఉద్యమానికి, 1947లో జరిగిన భారత విభజనకు మౌలిక సూత్రం. దక్షిణాసియాలో పాకిస్తాన్ ముస్లిం మతరాజ్యంగా ఏర్పడడం వెనుక ఉన్న సిద్ధాంతం ఇది.[3]

భారతీయ ముస్లిములను నిర్వచించడంలో మతం నిర్ణయాత్మకమైన అంశం అన్న సిద్ధాంతాన్ని మహమ్మద్ అలీ జిన్నా స్వీకరించి, అది పాకిస్తాన్ సృజించేందుకు ముస్లిములకు మేల్కొలుపు అంటూ పేర్కొన్నారు. [4] పలు హిందూ జాతీయ సంస్థలకు కూడా ఈ సిద్ధాంతమే మూల ప్రేరణ. ఐతే వారి కారణాలు వేరు, భారతీయ ముస్లిములను విజాతీయులుగా పునర్నిర్వచించడం, దేశంలో చట్టప్రకారం హిందూ రాజ్యాన్ని నెలకొల్పడం, ముస్లిములను దేశం నుంచి పంపడమో, వారిని హిందు మతంలోకి తిరిగి తీసుకురావడం వంటి అనేక అతివాద ఆలోచనలకు దన్నుగా దీన్ని తీసుకున్నారు.[5][6][7][8]

సూత్రీకరించిన రెండు జాతీయతలు ఒకే దేశంలో సహజీవనం చేయగలవా లేదా అన్న ప్రశ్నకు చెప్పే సమాధానాన్ని అనుసరించి, ద్విజాతి సిద్ధాంతానికి పలు విభిన్నమైన వ్యాఖ్యానాలు ఉన్నాయి, వాటి ఇతర సూత్రీకరణలు కూడా చాలా మౌలిక స్థాయిలో విభేదిస్తూంటాయి. ఒక వ్యాఖ్యానం వాదన ప్రకారం భారత ఉపఖండంలోని ముస్లిం జనాధిక్య ప్రాంతాలకు సార్వభౌమాధికారం, స్వయం ప్రతిపత్తిని, విడిపోయేందుకు ఐచ్ఛికాధికారాన్ని ఇచ్చేయాలి కానీ జనాభా బదిలీ చేయరాదు (అంటే హిందువులు, ముస్లిములు కలసే జీవిస్తారు). మరో విభిన్నమైన వ్యాఖ్యానం వాదించినది ఏమంటే - హిందు, ముస్లిములవి రెండు విభిన్నమైన, తరచుగా విరోధించుకునే జీవన మార్గాలు, కనుక ఒకే దేశంలో కలిసి జీవించలేవు.[9] ఈ వెర్షన్ ప్రకారం జనాభా బదిలీ (అంటే ముస్లిం బాహుళ్య ప్రాంతాల నుంచి హిందువులను పూర్తిగా పంపించేయడం, హిందూ సంఖ్యాధిక్యత ఉన్న ప్రదేశాల్లోని  ముస్లిములను పూర్తిగా బదిలీ చేయడం) రెండు ఒకరితో ఒకరికి సరిపడని జాతులను పూర్తిగా విభజించేందుకు ఆశించదగ్గ ప్రయత్నం.[10][11]

ఈ సిద్ధాంతానికి వ్యతిరేకత రెండు కోణాల నుంచి వచ్చింది. మొదటిది హిందువులు, ముస్లిములు అవిభక్త సమూహాలైన ఏకైక భారతీయ జాతి అన్న భావన.[12] ఈ భావన ఆధునిక, అధికారికంగా లౌకిక, గణతంత్రమైన భారతదేశానికి మౌలిక సిద్ధాంతం. పాకిస్తాన్ ఏర్పాటయ్యాకా కూడా హిందూ, ముస్లిములు స్పష్టంగా వేర్వేరు జాతులా, కాదా అన్న చర్చ ఆ దేశంలోనూ కొనసాగింది.[13] రెండవ వ్యతిరేకత భారతదేశం సుస్పష్టమైన జాతి దేశం కాదని, ఉపఖండంలో అటు ముస్లిములు, ఇటు హిందువులు వేరే జాతి కాకపోగా, ఉపఖండంలో ఇంతకన్నా సజాతీయమైన ప్రాంతీయ విభాగాలు నిజమైన జాతులని వాటికి సార్వభౌమత్వం కల్పించాలని వచ్చిన సిద్ధాంతం; ఈ దృక్కోణాన్ని ప్రస్తుతం పాకిస్తాన్లో అంతర్భాగంగా ఉన్న బెలూచ్,[14] సింధీ,[15] పష్తూన్[16] వారు లేవనెత్తారు. 1971లో తూర్పు పాకిస్తాన్ కు  చెందిన బెంగాలీలు తమపై, తమ విశిష్టమైన భాషపై పశ్చిమ పాకిస్తానీలు అణచివేస్తున్నారంటూ ఉద్యమం చేసి బంగ్లాదేశ్ ఏర్పరుచుకోవడం ద్విజాతి సిద్ధాంతానికి ఒకవిధంగా దెబ్బ. ఈ సిద్ధాంత సూత్రీకరణకు వ్యతిరేకంగా మత భావానికి మించి  భాషకు ప్రాధాన్యమిచ్చి వారు విడిపోయారు.

మూలాలు

[మార్చు]
 1. Robin W. Winks, Alaine M. Low (2001), The Oxford history of the British Empire: Historiography, Oxford University Press, ISBN 978-0-19-924680-9, ... At the heart of the two-nation theory was the belief that the Indian Muslims' identity was defined by religion rather than language or ethnicity ...
 2. Liaquat Ali Khan (1940), Pakistan: The Heart of Asia, Thacker & Co. Ltd., ... There is much in the Musalmans which, if they wish, can roll them into a nation. But isn't there enough that is common to both Hindus and Muslims, which if developed, is capable of molding them into one people? Nobody can deny that there are many modes, manners, rites and customs which are common to both. Nobody can deny that there are rites, customs and usages based on religion which do divide Hindus and Muslmans. The question is, which of these should be emphasized ...
 3. "Two-Nation Theory Exists". Pakistan Times. Archived from the original on 2007-11-11. Retrieved 2016-03-27.
 4. Jinnah: "Islam and Hinduism are not religions in the strict sense of the word, but in fact different and distinct social orders, and it is only a dream that the Hindus and Muslims can ever evolve a common nationality.
 5. Economic and political weekly, Volume 14, Part 3, Sameeksha Trust, 1979, ... the Muslims are not Indians but foreigners or temporary guests - without any loyalty to the country or its cultural heritage - and should be driven out of the country ...
 6. M. M. Sankhdher, K. K. Wadhwa (1991), National unity and religious minorities, Gitanjali Publishing House, ISBN 978-81-85060-36-1, ... In their heart of hearts, the Indian Muslims are not Indian citizens, are not Indians: they are citizens of the universal Islamic ummah, of Islamdom ...
 7. Vinayak Damodar Savarkar, Sudhakar Raje (1989), Savarkar commemoration volume, Savarkar Darshan Pratishthan, ... His historic warning against conversion and call for Shuddhi was condensed in the dictum 'Dharmantar is Rashtrantar' (to change one's religion is to change one's nationality) ...
 8. N. Chakravarty (1990), "Mainstream", Mainstream, Volume 28, Issues 32-52, ... 'Dharmantar is Rashtrantar' is one of the old slogans of the VHP ...
 9. Carlo Caldarola (1982), Religions and societies, Asia and the Middle East, Walter de Gruyter, ISBN 978-90-279-3259-4, ... Hindu and Muslim cultures constitute two distinct, and frequently antagonistic, ways of life, and that therefore they cannot coexist in one nation ...
 10. S. Harman (1977), Plight of Muslims in India, DL Publications, ISBN 978-0-9502818-2-7, ... strongly and repeatedly pressed for the transfer of population between India and Pakistan. At the time of partition some of the two-nation theory protagonists proposed that the entire Hindu population should migrate to India and all Muslims should move over to Pakistan, leaving no Hindus in Pakistan and no Muslims in India ...
 11. M. M. Sankhdher (1992), Secularism in India, dilemmas and challenges, Deep & Deep Publication, ... The partition of the country did not take the two-nation theory to its logical conclusion, i.e., complete transfer of populations ...
 12. Rafiq Zakaria (2004), Indian Muslims: where have they gone wrong?, Popular Prakashan, ISBN 978-81-7991-201-0, ... As a Muslim ... Hindus and Muslims are one nation and not two ... two nations has no basis in history ... they shall continue to live together for another thousand years in united India ...
 13. Pakistan Constituent Assembly (1953), Debates: Official report, Volume 1; Volume 16, Government of Pakistan Press, ... say that Hindus and Muslims are one, single nation. It is a very peculiar attitude on the part of the leader of the ppposition. In fact if his point of view was accepted, then the very justification for the existence of Pakistan would disappear ...
 14. Janmahmad (1989), Essays on Baloch national struggle in Pakistan: emergence, dimensions, repercussions, Gosha-e-Adab, ... would be completely extinct as a people without any identity. This proposition is the crux of the matter, shaping the Baloch attitude towards Pakistani politics. For Baloch to accept the British-conceived two-nation theory for the Indian Muslims ... would mean losing their Baloch identity in the process ...
 15. Stephen P. Cohen (2004), The idea of Pakistan, Brookings Institution Press, ISBN 978-0-8157-1502-3, ... and the two-nation theory became a trap for Sindhis — instead of liberating Sindh, it fell under Punjabi-Mohajir domination, and until his death in 1995 he called for a separate Sindhi "nation," implying a separate Sindhi country ...
 16. Ahmad Salim (1991), Pashtun and Baloch history: Punjabi view, Fiction House, ... Attacking the 'two nation theory' in Lower House on December 14, 1947, Ghaus Bux Bizenjo said: "We have a distinct culture like Afghanistan and Iran, and if the mere fact that we are Muslim requires us to amalgamate with Pakistan, then Afghanistan and Iran should also be amalgamated with Pakistan ...