విభజించి పాలించు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంప్రదాయికంగా ఈ సిద్ధాంతం మేసిడోనియా ఫిలిప్ రాజు ప్రారంభించారని భావిస్తారు.

రాజనీతి శాస్త్రం, సామాజిక శాస్త్రాల్లో విభజించు, పాలించు (లేదా విభజించు, ఓడించు, లాటిన్ లో డివైడ్ ఎట్ ఇంపెరా (dīvide et īmpera)) అంటే అతిపెద్ద అధికార కేంద్రాన్ని చిన్న చిన్న విభాగాలుగా విడగొట్టి చిన్న చిన్న విభాగాలు మొత్తం ఏక కేంద్రం కన్నా బలహీనం అయ్యాకా అధికారం, శక్తి సాధించడం, దాన్ని నిలబెట్టుకోవడం. ఈ యుక్తి ప్రస్తుతం  నెలకొన్న  అధికారక్రమాన్ని  విచ్ఛిన్నపరిచి, ప్రత్యేకించి తద్వారా ఏర్పడ్డ చిన్న చిన్న శక్తులు ఒకదానితో మరొకటి కలిసి బలపడకుండా నిరోధించడం, ప్రజలు, గుంపుల మధ్య శత్రుత్వాలు ఏర్పరిచి వారిని విభజించడం వంటివాటిని కలిగివుంటుంది.

ఇటాలియన్ రచయిత ట్రైయనో బొకాలిని లా బిలన్సియా పొలిటికా గ్రంథంలో డివైడ్ ఎట్ ఇంపెరా (విభజించి పాలించు) అన్నది , రాజకీయాల్లో సాధారణ  సూత్రమని  పేర్కొన్నారు. కలసివుంటే  తన  అధికారాన్ని,  పరిపాలనను  ఎదిరించగల  పాలితులు,  ప్రజలు లేదా వివిధ ఆసక్తులు గల విభాగాలను నియంత్రించేందుకు సార్వభౌమాధికారాన్ని బలపరచడం ఈ సూత్రం  ప్రధాన  ఉద్దేశం.  మేకియవెల్లి తన నాలుగో పుస్తకం యుద్ధ కళ (డెల్లార్టె డెల్లా గుయెర్రా)లో దీన్ని పోలిన యుద్ధ తంత్రాన్ని చెప్తారు,[1][2] దాని ప్రకారం సేనాని శత్రువు శక్తిని విడదీసి వేర్వేరు పనుల్లో వ్యస్తమయ్యేలా చేయగల ప్రతి అంశంలోనూ సామర్థ్యం సాధించాలి, తన మనుషులపైనే అతనికి అనుమానాన్ని కలిగించడమో, ఏదో కారణంతో తన సైన్యంలోని భాగాన్ని వేరే వైపుకు పంపించాల్సి రావడమో కావచ్చు, తద్వారా అతను మరింత బలహీనుడవుతాడు.

మాగ్జిం డివైడ్ ఎట్ ఇంపెరా అన్న ఈ సిద్ధాంతానికి మూలపురుషునిగా మాసిడోన్ రెండవ ఫిలప్ రాజును గుర్తించగా, దానితో పాటుగా మాగ్జిం డివైడ్ అట్ రెగ్నెస్ లను రోమన్ పరిపాలకుడు జూలియస్ సీజర్, ఫ్రెంచి చక్రవర్తి నెపోలియన్  బాగా వినియోగించుకున్నారు.

పని స్థలాల్లో[మార్చు]

క్లైవ్ ఆర్. బడీ ప్రకారం విభజించి పాలించు వ్యూహాన్ని కార్పొరేట్ హైయరార్కీపై తమ పట్టును నిలబెట్టుకుంటూ ముందుకు సాగడం కోసం కొందరు కుటిలత్వం కలిగిన ఉద్యోగులు చాలా సాధారణంగా ఆచరణలో పెడుతూంటారు.[3]

చారిత్రక ఉదాహరణలు[మార్చు]

ఆఫ్రికా[మార్చు]

విభజించు పాలించు వ్యూహాన్ని ఆఫ్రికాపై పట్టుసాధించేందుకు వలస పాలక దేశాలు వలస పాలన కాలంలోనూ, వలస పాలన అనంతర కాలంలో కూడా వినియోగించాయి.

  • జర్మనీ, బెల్జియం దేశాలు రువాండా, బెరుండీలను వలసలుగా పరిపాలించాయి. జర్మనీ అప్పటికే ఆధిపత్య వర్గమైన టుట్సీ మైనారిటీ వర్గాన్ని అధికార స్థానాల్లో నియమించడం  ద్వారా విభజించి పాలించే సిద్ధాంతాన్ని అమలుచేసింది. 
  • 1916లో బెల్జియం వలస పాలనను తీసుకున్నాకా వృత్తుల ప్రకారం కాకుండా జాతుల ప్రకారం టుట్సీ, హుటు వర్గాల వారిని పునర్నియమించారు, అంతకుముందు విభజన జాతుల ప్రకారం ఉండేది. బెల్జియం పది ఆవులకన్నా ఎక్కువ గోగణం ఉన్నవారు కానీ పొడవు  ముక్కు ఉన్నవారు కానీ టుట్సి వారని, పది ఆవుల కన్నా తక్కువ ఉన్నా, చప్పిడి ముక్కు ఉన్నా హుటు వారని నిర్వచించారు. టుట్సీలు, హుటుల మధ్య సామాజిక ఆర్థిక విభజన స్వాతంత్ర్యం వచ్చాకా కూడా కొనసాగడమే కాక రువాండా మారణహోమం వెనుక మూలకారణంగా నిలిచింది.
  • నైజీరియాలో 1900 నుంచి 1960 వరకూ కొనసాగిన బ్రిటీష్ పాలన కాలంలో,  వివిధ ప్రాంతాలు పరిపాలన సౌలభ్యం పేరిట తరచు విభజించబడేవి.  ఈ విభజనలు  ల్జబో,  హుసా  వర్గాల మధ్య ఉన్న విభేదాలను వినియోగించుకుని పరిపాలించేందుకు బ్రిటీషర్లు వాడుకున్నారు.[citation needed][4]

ఆసియా[మార్చు]

మంగోలియా సామ్రాజ్యం[మార్చు]

  • మంగోల్ జాతి పాలకులు మధ్య ఆసియాకు చెందిన ముస్లింలను చైనాలో పరిపాలన స్థానాలు నిర్వహించేందుకు పంపి, అదే సమయంలో హాన్ చైనీయులు, ఖైతన్లను మధ్య ఆసియాలోని బుఖారా ప్రాంతానికి పరిపాలన స్థానాల కోసం పంపేవారు. తద్వారా రెండు ప్రాంతాల్లోనూ ఒకరికి విదేశీయులైన మరొకరిని నియమిస్తూ స్థానిక అధికారాలని పరిమితం చేశారు. [5]

భారత ఉపఖండం[మార్చు]

"నేను ఎల్లప్పుడూ నా ఉన్నత శాశ్వత ఆశల్ని మతతత్వ పరిస్థితుల నిరంతరత్వంపైనే పెట్టుకున్నాను"

 —వైశ్రాయ్ కి సెక్రటరీ ఆఫ్ ఇండియా స్టేట్ రాసిన ఉత్తరం, 1925లో జాతీయోద్యమం ప్రజాదరణ పొందుతున్న నేపథ్యంలో హిందూ ముస్లింల వైరుధ్యం గురించిన వ్యాఖ్య[6]

1905లో బెంగాల్ విభజన మొదలుకొని హిందు, ముస్లిం మతస్తుల మధ్య ఉన్న వివాదాలను రగిలించడం ద్వారా జాతీయ వాదాన్ని, స్వాతంత్ర్యాన్ని, ఇతర రాజకీయ ఉద్యమాలను దారిమళ్ళించే ప్రభుత్వం బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం చేసింది.  మతపరమైన  అతివాద  శక్తులను  రెచ్చగొట్టడం,  మతపరమైన  నియోజకవర్గాలను  ఏర్పరచడం  వంటి  ఇతర  ప్రయత్నాలూ  సాగించారు. దీని ఫలితంగా భారత విభజన, స్వాతంత్ర్యం సమయంలో  దారుణమైన  మతపరమైన  హింస  చెలరేగి  సుమారు  పది  లక్షల  మంది  హిందు,  ముస్లిం,  సిక్ఖులు చనిపోయారు.[6]

ఐరోపా[మార్చు]

  • క్రీ.పూ. 168లో రోమన్లు మేసిడోనియాలోకి దక్షిణంగా పెర్సియస్ ఆఫ్ మేసిడోన్ రాజును పైడ్నా యుద్ధంలో చంపి ప్రవేశించారు. మేసిడోనియా  నాలుగు  రిపబ్లిక్  రాజ్యాలుగా  విడగొట్టి,  వాటి మధ్య సంబంధాల విషయంలో తీవ్రమైన  ఆంక్షలు  విధించారు.  రోమన్  వ్యతిరేకులుగా  ఆరోపణలు  వచ్చిన  పౌరులను  తోటి దేశీయులే వ్యతిరేకించి, నిర్దాక్షణ్యంగా దేశ బహిష్కరణ చేశారు.
  • గాలిక్ యుద్ధాల సమయంలో సైనికంగా శక్తిమంతులైన గాల్ జాతీయులను ఓడించేందుకు జూలియస్ సీజర్ విభజించు పాలించు సూత్రాన్ని  ప్రయోగించారు.  అయితే  ఆపైన  గాల్స్ వెర్సింగెటోరిక్స్ నేతృత్వంలో ఏకమైనా అప్పటికి ఆలస్యమై వారి విజయావకాశాలు లేకపోయాయి.[7][8]

విమర్శలు[మార్చు]

విభజించు పాలించు సిద్ధాంతం పలు విధాలుగా విమర్శలకు గురయ్యింది. ప్రధానంగా ఈ సూత్రాలు అమలుపరచడం వల్ల మత, జాతి, వృత్తి పరమైన గుంపుల మధ్య తీవ్రమైన విభేదాలు రాజుకుని నరమేధాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "etext.library.adelaide.edu.au". Archived from the original on 2007-06-25. Retrieved 2016-03-26.
  2. "Dell'arte della guerra: testo - IntraText CT". intratext.com.
  3. Boddy, C. R. Corporate Psychopaths: Organizational Destroyers (2011)
  4. "HISTORY OF NIGERIA". historyworld.net.
  5. BUELL, PAUL D. (1979). "SINO-KHITAN ADMINISTRATION IN MONGOL BUKHARA". Journal of Asian History. Harrassowitz Verlag. pp. 137–8. JSTOR 41930343.
  6. 6.0 6.1 రామచంద్ర, గుహ (డిసెంబరు 2010). "విభజన తార్కికత". గాంధీ అనంతర భారతదేశం (in తెలుగు (అనువాదం) (1 ed.). విజయవాడ: ఎమెస్కో. pp. 26–35. కాకాని చక్రపాణి తెలుగు అనువాదం{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  7. "France: The Roman conquest". Encyclopædia Britannica Online. Encyclopædia Britannica (company). Retrieved April 6, 2015. Because of chronic internal rivalries, Gallic resistance was easily broken, though Vercingetorix's Great Rebellion of 52 bce had notable successes.
  8. "Julius Caesar: The first triumvirate and the conquest of Gaul". Encyclopædia Britannica Online. Encyclopædia Britannica (company). Retrieved February 15, 2015. Indeed, the Gallic cavalry was probably superior to the Roman, horseman for horseman. Rome's military superiority lay in its mastery of strategy, tactics, discipline, and military engineering. In Gaul, Rome also had the advantage of being able to deal separately with dozens of relatively small, independent, and uncooperative states. Caesar conquered these piecemeal, and the concerted attempt made by a number of them in 52 bce to shake off the Roman yoke came too late.