Jump to content

ప్రాచీన భాష

వికీపీడియా నుండి

సంస్కృతం, తమిళం, తెలుగు, కన్నడం, ఒరియా లతో కలిపి దేశంలో ఇప్పటి వరకు ఐదు భాషలకు ప్రాచీన భాష హోదా లభించింది. తెలుగుకి ప్రాచీన భాషా ప్రతిపత్తి కలిగించడంలో తుర్లపాటి కుటుంబరావు కీలకపాత్ర పోషించానని తన ఆత్మకథలో పేర్కొన్నాడు.[1]

ప్రాచీనభాషల భాషా నిపుణులకు అంతర్జాతీయ స్థాయి పురస్కారాలు రావడానికీ, యూజీసీ, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో విశిష్ట విద్యా కేంద్రాలను (సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌) ఏర్పాటు చేసుకోడానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్క భాష అభివృద్ధి కోసం ఏటా 100 కోట్ల రూపాయల నిధులు వస్తాయి. మైసూరులోని కేంద్ర భాషా అధ్యయన సంస్థ లో తెలుగు ఉత్కృష్టత కేంద్రం ప్రారంభించారు. దానిని ఆంధ్రప్రదేశ్ కు మార్చటానికి చర్యలు మొదలైనాయి. హైదరాబాదు విశ్వవిద్యాలయంలోని ప్రాచీన తెలుగు కేంద్రం ఈ బాధ్యతను చేపట్టటానికి ప్రణాళిక నివేదించింది.

ప్రాచీన తెలుగు భాషా కేంద్రం, నెల్లూరు

[మార్చు]

2020 జనవరి 20 నాడు ప్రాచీన తెలుగు భాషా కేంద్రాన్ని నెల్లూరులో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించాడు.[2] దీనికి అనుబంధ కేంద్రం తెలంగాణలో ప్రారంభించాలని, ప్రాచీన మహాకవుల పేరుతో 10 పీఠాలు స్థాపించాలని తెలుగు అకాడమీ మాజీ సంచాలకులు యాదగిరి కోరాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. తుర్లపాటి, కుటుంబరావు (2012-02-01). "Wikisource link to ఆత్మకథ విషయపేజీలు". Wikisource link to నా కలం - నా గళం. వికీసోర్స్. 
  2. "పుట్టినింట తెలుగు వెలుగు". ఈనాడు. 2020-01-21. Archived from the original on 2020-01-21. Retrieved 2020-01-21.
  3. కె యాదగిరి (2020-01-21). "'ప్రాచీన తెలుగు' నిర్వహణా దార్శనికత". ఆంధ్రజ్యోతి. Archived from the original on 2020-01-21. Retrieved 2020-01-21.