రాంబస్
(సమ చతుర్భుజం నుండి దారిమార్పు చెందింది)
ఒక సమాంతర చతుర్భుజంలో అన్ని భుజాలు సమానంగా ఉంటే దానిని సమ చతుర్భుజం లేదా రాంబస్ అంటారు.
లక్షణాలు
[మార్చు]- దీనిలో నాలుగు భుజాలుంటాయి.
- నాలుగు అంతర కోణాల మొత్తము 360 డిగ్రీలు.
- అన్ని భుజాలు సమానంగా, సమాంతరముగా ఉంటాయి.
- ఎదురెదురు కోణాలు సమానంగా ఉంటాయి.
- ఆసన్న కోణాల మొత్తము 180 డిగ్రీలు ఉంటుంది.
- దీనికి రెండు కర్ణాలుంటాయి. ఒక కర్ణం సమ చతుర్భుజాన్ని రెండు సర్వ సమాన త్రిభుజాలుగా విభజిస్తుంది.
- రెండు కర్ణాలు సమ చతుర్భుజాన్ని నాలుగు సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తుంది.
- కర్ణములు పరస్పరం లంబ సమద్విఖండన చేసుకుంటాయి.
- సమ చరుర్భుజ నిర్మాణానికి రెండు స్వతంత్ర కొలతలు కావాలి.
- సమాంతర భుజాల మధ్య గల లంబ దూరాన్ని "ఎత్తు" అంటారు.
- దిగువన గల భుజాన్ని "భూమి" అంటారు.
- దీని వైశాల్యం దాని కర్ణముల లబ్ధంలో సగం ఉండును.
- ప్రతి చతుర్భుజం, ట్రెపీజియం, సమాంతర చతుర్భుజం, రాంబస్ లక్షణాలతో ఉండక పోవచ్చు. కాని చతురస్రం నకు అన్నిభుజాలు సమానంగా ఉండుటవల్ల రాంబస్ లక్షణాలను సంతరించుకుంటుంది.
వైశాల్యము
[మార్చు]- రాంబస్ యొక్క కర్ణములు d1, d2 అయితే దాని వైశాల్యం ½ d1, d2 అవుతుంది.
- రాంబస్ కూడా ఒక సమాంతర చతుర్భుజం కావున దాని భూమి "b", ఎత్తు "h" అయితే దాని వైశాల్యం భూమి ఎత్తుల లబ్ధానికి సమానము.
- ఒక రాంబస్ ను ట్రెపీజియంగా తీసుకుంటే దాని సమాంతర భుజాలు a, b అయి, ఎత్తు "h"గా తీసుకుంటే దాని వైశాల్యం సమాంతర భుజాల పొడవుల సగటు, ఎత్తుల లబ్ధానికి సమానమవుతుంది.