చతురస్రం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చతురస్రం
తలం ద్విమితీయం
ఆంగ్ల పదం Square
నాలుగు కోణాల మొత్తము 360 డిగ్రీలు లేదా నాలుగు లంబకోణాలు
నిర్వచనం నాలుగు భుజాలు, కోణాలు సమానంగా గల చతుర్భుజం
భుజములు AB, BC, CD, DA
శీర్షములు A, B, C, D
కర్ణములు AC, BD
అన్ని భుజాలు సమానం, సమాంతరం
అన్ని కోణములు సమానము, ప్రతి కోణం 90 డిగ్రీలు
ఆసన్న కోణములు పూరకాలు (వాటిమొత్తం=180 డిగ్రీలు)
వైశాల్యము ఒక భుజము యొక్క వర్గము

ఒక సమాంతర చతుర్భుజంలో అన్ని భుజాలు సమానంగా ఉంటే దానిని సమ చతుర్భుజం లేదా రాంబస్ అంటారు.

లక్షణాలు

[మార్చు]
  • దీనిలో నాలుగు భుజాలుంటాయి.
  • నాలుగు అంతర కోణాల మొత్తము 360 డిగ్రీలు.
  • అన్ని భుజాలు సమానంగా, సమాంతరముగా ఉంటాయి.
  • ఎదురెదురు కోణాలు సమానంగా ఉంటాయి.
  • ఆసన్న కోణాల మొత్తము 180 డిగ్రీలు ఉంటుంది.
  • దీనికి రెండు కర్ణాలుంటాయి. ఒక కర్ణం సమ చతుర్భుజాన్ని రెండు సర్వ సమాన త్రిభుజాలుగా విభజిస్తుంది.
  • రెండు కర్ణాలు చతురస్రాన్ని నాలుగు సర్వసమాన లంబ కోణ త్రిభుజాలుగా విభజిస్తుంది.
  • రెండు కర్ణాలు సమానంగా ఉంటాయి.
  • కర్ణములు పరస్పరం లంబ సమద్విఖండన చేసుకుంటాయి.
  • చతురస్ర నిర్మాణానికి ఒక స్వతంత్ర కొలత కావాలి.
  • చతురస్రం యొక్క ఒక కొలతను "భుజం" అంటారు.
  • దీని వైశాల్యం దాని భుజం యొక్క వర్గానికి సమానంగా ఉండును.
  • దీని చుట్టుకొలత దాని భుజము పొడవునకు నాలుగు రెట్లు ఉండును.

వైశాల్యము

[మార్చు]
  • చతురస్ర వైశాల్యం దాని భుజము యొక్క వర్గమునకు సమానము.
  • చతురస్రం కూడా రాంబస్ లక్షణాలను కల్గి ఉండును కావున దాని యొక్క కర్ణములు d1, d2 అయితే దాని వైశాల్యం ½ d1, d2 అవుతుంది.
  • చతురస్రం కూడా ఒక జత సమాంతర భుజములు కల్గి ఉన్నందువల్ల అది సమాంతర చతుర్భుజం కావున దాని భూమి "b", ఎత్తు "h" అయితే దాని వైశాల్యం భూమి ఎత్తుల లబ్ధానికి సమానము.
  • ఒక చతురస్రమును ట్రెపీజియంగా తీసుకుంటే దాని సమాంతర భుజాలు a, b అయి, ఎత్తు "h"గా తీసుకుంటే దాని వైశాల్యం సమాంతర భుజాల పొడవుల సగటు, ఎత్తుల లబ్ధానికి సమానమవుతుంది.

యివి కూడా చూడండి

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=చతురస్రం&oldid=2880480" నుండి వెలికితీశారు