Jump to content

సమలంబ చతుర్భుజం

వికీపీడియా నుండి
సమలంబ చతుర్భుజంలో భాగాలు
ట్రెపీజియం లలో రకాలు

ఒక చతుర్భుజం లో ఒక జత ఎదుటి భుజాలు సమాంతరంగా ఉంటే దానిని ట్ర్రెపీజియం లేదా సమలంబ చతుర్భుజం అంటారు.

లక్షణాలు

[మార్చు]
  • దీనిలో నాలుగు భుజాలుంటాయి.
  • నాలుగు అంతర కోణాల మొత్తము 360 డిగ్రీలు.
  • ఒక జత ఎదురుభుజాలు సమాంతరంగా ఉండాలి.
  • సమాంతరం గాని భుజాలపై గల ఆసన్నకోణాల మొత్తము 180 డిగ్రీలు అవుతుంది.
  • ట్రెపీజియం నిర్మాణానికి నాలుగు స్వతంత్ర కొలతలు కావాలి.
  • సమాంతర భుజాల మధ్య గల లంబ దూరాన్ని "ఎత్తు" అంటారు.
  • సమాంతరంగా లేని భుజాలను "legs" అంటారు.
  • సమాంతరంగా లెని భుజాల మధ్యబిందువులను కలుపు రేఖాఖండాన్ని "మధ్యగత రేఖ" అంటారు.
  • మధ్యగత రేఖ పొడవు, ట్రెపీజియం ఎత్తు ల లబ్ధం ట్రెపీజియం వైశాల్యమవుతుంది.
  • ప్రతి చతుర్భుజం ట్రెపీజియం లక్షణాలతో ఉండక పోవచ్చు. కాని సమాంతర చతుర్భుజం, రాంబస్, చతురస్రం, దీర్ఘచతురస్రం లకు ఒకజత సమాంతర భుజాలు కలిగియున్నందువల్ల అవి ట్రెపీజియం లక్షణాలను సంతరించుకుంటాయి.

వైశాల్యము

[మార్చు]

a, b లు ట్రెపీజియం లోని సమాంతర భుజాలైతే "h" అనునది ఎత్తు ఐతే ట్రెపీజియం వైశాల్యం ఈ క్రింది సూత్రం ద్వారా తెలుసుకొనవచ్చును.

వైశాల్యమునకు సూత్రము
ట్రెపీజియం వైశాల్యము=½ X ఎత్తు X సమాంతర భుజాల మొత్తము

ట్రెపీజియం వైశాల్యము=½ h (a+b)
ట్రెపీజియం వైశాల్యము=ఎత్తు X మధ్యగతము

యివి కూడా చూడండి

[మార్చు]