గోలింగేశ్వర స్వామి ఆలయం
శ్రీ గోలింగేశ్వర స్వామి దేవాలయం | |
---|---|
భౌగోళికాంశాలు : | 17°03′11″N 82°10′10″E / 17.0531°N 82.1695°E |
పేరు | |
ప్రధాన పేరు : | శ్రీ గోలింగేశ్వర స్వామి దేవాలయం |
ప్రదేశం | |
దేశం: | భారత దేశం |
రాష్ట్రం: | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా: | తూర్పు గోదావరి |
ప్రదేశం: | బిక్కవోలు |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | శ్రీ గోలింగేశ్వర స్వామి దేవాలయం |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
దేవాలయాలు మొత్తం సంఖ్య: | ఒకటి |
ఇతిహాసం | |
నిర్మాణ తేదీ: | శతాబ్దం |
గోలింగేశ్వర స్వామి ఆలయం, తూర్పు గోదావరి జిల్లా, బిక్కవోలు గ్రామం బిరుదాంకపురం గ్రామంలో ఉన్న దేవాలయం.
ఆలయం చరిత్ర
[మార్చు]పూర్వం బిరుదాంకుడు అనే రాజు కానేటి కోటలో వుండి ఈ ప్రాంతాన్నంతా పరిపాలించేవాడు. ప్రస్తుతం ఈ కోట పూర్తిగా శిథిలమైపోయింది.ఇప్పుడు మిగిలివున్నది ఆకోటలోని మహాలక్ష్మి అమ్మవారి గుడి మాత్రమే ఉంది. బిరుదాంక మహారాజు పాలనలో బిరుదాంకపురం బిక్కవోలులో 118 దేవాలయములు నిర్మించి 118 చెరువులు త్రవ్వించాడు. వీటిలో ప్రసిద్ధి చెందిన దేవాలయాలు.
- శ్రీ గోలింగేశ్వర స్వామి దేవాలయం.
- శ్రీ కుమార సుబ్రమజ్యేశ్వర స్వామి ఆలయం.
- శ్రీ లక్ష్మీ నారాయణస్వామి ఆలయం.
- శ్రీ విఘ్నేశ్వర ఆలయాలు.
శ్రీ గోలింగేశ్వరస్వామి మొదట బిరుదాంకపురంలో మంద బయలు భూమిలో కప్పబడి వుండేది. గ్రామంలో ఉన్న ఓ రైతు యొక్క ఆవు ప్రతి నిత్యం తన పాలు ఈ లింగాకారం వున్న ప్రదేశంలో కార్చి వెళ్ళిపోయేది. రైతు ఆవు పాలు ఇవ్వక పోవడంతో అనుమానం పడి తన పాలికాపుని ఆవుని ఒక కంటకనిపెట్టి వుండమని చెప్పాడు. పాలికాపు ప్రతి రోజులాగే ఆవుల మందలో ఉన్న ఆవును వదిలాడు. తర్వాత పాలికాపు ఆ ఆవుని గమనించగా,ఆ ఆవు అక్కడక్కడ మేత వేస్తూ తిన్నగా లింగాకారంవున్న ప్రదేశానికి వచ్చి, అక్కడ పాలుకార్చిన తరువాత మేత మేస్తూ ప్రక్కలకు పోయింది. అది చూసిన పాలికాపు ఆ ప్రదేశానికి వెళ్ళి చూస్తే అక్కడ ఆవు కార్చిన పాలు ఉన్నాయి. ఆవులకాపరి సాయంకాలం దూడలను తిరిగి ఇండ్లకు తోలుకొచ్చి వాటి స్థానాల్లో వాటిని కట్టేసి తన రైతుకు జరిగింది అంతా చెప్పాడు. రైతు ఈ విషయాన్ని గ్రామంలోని వారికి చెప్పాడు. గ్రామస్థులు అంతా పాలుకార్చిన ప్రదేశానికి వెళ్ళి, అక్కడ పాలు కట్టిన చిన్నమడుగుని చూశారు. దానితో పాలు మడుగుకట్టిన భూమిలోపల ఏ దేవుడో, దేవతో ఉండవచ్చని భావించి గ్రామస్తులంతా మంచి ముహూర్తంలో అక్కడ త్రవ్వారు. అక్కడ పానవట్టంతో సహా లింగం బయటపడింది. బిరుదాంక మహారాజు గుడి కట్టించడానికి ముందుకొచ్చి పునాదులు త్రవ్వుతుంటే ఆ పునాదుల్లో పుట్టబయలుదేరింది. దాన్ని త్రవ్వితే కొద్ది మరోపుట్ట పుట్టింది. అలా ఎన్ని సార్లు త్రవ్వినా పుట్టపుట్టుకొస్తూనే వుంది. ఆ పుట్టను అలాగే వుంచి తిరిగి పునాదులు త్రవ్వుతుండగా కుమార సుబ్రమణ్యేశ్వర స్వామి విగ్రహం బయటపడింది. మొదట బయల్పడిన లింగంనకు శ్రీ గోలింగేశ్వర స్వామి అని పిలిచారు. భారతదేశంలో కుమార సుబ్రమణ్యేశ్వర స్వామి వారి విగ్రహాలు రెండుచోట్ల మాత్రమే ఉన్నాయి. ఒకటి దక్షిణ దేశంలోని 'ఫలణి'లోను రెండవది బిరుదాంకపురంలో వెలిశారు.[1]
శ్రీ సుబ్రమణ్యేశ్వరస్వామి
[మార్చు]ప్రతి సంవత్సరం షష్టి రోజు నుండి అయిదు రోజుల పాటు గ్రామస్థులు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. వేలాది భక్తులు స్వామివార్ని దర్శించుకుంటారు.
చిత్రమాలిక
[మార్చు]-
బిక్కవోలు గోలింగేశ్వర, సుబ్రహ్మణ్యస్వామి వార్ల ఆలయాలు
-
బిక్కవోలు గోలింగేశ్వర, సుబ్రహ్మణ్యస్వామి వార్ల ఆలయాలు
-
బిక్కవోలు గోలింగేశ్వర, సుబ్రహ్మణ్యస్వామి వార్ల ఆలయాలు
-
బిక్కవోలు గోలింగేశ్వర, సుబ్రహ్మణ్యస్వామి వార్ల ఆలయాలు
-
బిక్కవోలు ఆలయాల మార్గ పటము
మూలాలు
[మార్చు]- ↑ ఎన్. ఎస్, నాగిరెడ్డి (2003). తూర్పుగోదావరి జిల్లాలో ప్రసిద్ధి దేవాలయాలు. ఎన్ ఎస్ నాగిరెడ్డి.