Jump to content

సోలన్

అక్షాంశ రేఖాంశాలు: 30°54′18″N 77°05′49″E / 30.905°N 77.097°E / 30.905; 77.097
వికీపీడియా నుండి
సోలన్
పుట్టగొడుగుల నగరం
పట్టణం
పైనుండి, ఎడమ నుండి కుడికి: తోడో నాట్యం, శూలిని ఉత్సవం,శూలిని దేవి గుడి, యుంగ్ డ్రుంగ్ బౌద్ధారామం, ధోలంజీ, సోలన్ నగర దృశ్యం
పైనుండి, ఎడమ నుండి కుడికి: తోడో నాట్యం, శూలిని ఉత్సవం,శూలిని దేవి గుడి, యుంగ్ డ్రుంగ్ బౌద్ధారామం, ధోలంజీ, సోలన్ నగర దృశ్యం
Nickname: 
భారతదేశపు పుట్టగొడుగుల నగరం
సోలన్ is located in Himachal Pradesh
సోలన్
సోలన్
హిమాచల్ ప్రదేశ్‌లో పట్టణ స్థానం
Coordinates: 30°54′18″N 77°05′49″E / 30.905°N 77.097°E / 30.905; 77.097
దేశం India
రాష్ట్రంహిమాచల్ ప్రదేశ్
జిల్లాసోలన్
Elevation
1,550 మీ (5,090 అ.)
జనాభా
 (2011)
 • Total39,256
Time zoneUTC+5:30 (IST)
PIN
173212
టెలిఫోన్ కోడ్01792
Vehicle registrationHP- HP 14, HP 01S, HP 02S, HP 64, HP 59

సోలన్ హిమాచల్ ప్రదేశ్ లోని పట్టణం, సోలన్ జిల్లా ముఖ్య పట్టణం. ఇది హిమాచల్ ప్రదేశ్ లోని అతిపెద్ద మునిసిపల్ కౌన్సిల్. ఇది రాష్ట్ర రాజధాని సిమ్లాకు దక్షిణాన 45.5 కి.మీ. దూరంలో సముద్ర మట్టం నుండి 1550 మీటర్ల ఎత్తున ఉంది. [1] ఈ ప్రదేశానికి హిందూ దేవత షూలిని దేవి పేరు పెట్టారు. ప్రతి సంవత్సరం జూన్లో, దేవతకు ఉత్సవం జరుగుతుంది. ఇందులో భాగంగా సెంట్రల్ థోడో మైదానంలో 3 రోజుల జాతర జరుగుతుంది. సోలన్ పూర్వపు సంస్థానమైన బాఘాట్^కు రాజధాని. [2]

ఇక్కడ పుట్టగొడుగులను విస్తారంగా పెంచడం వలన సోలన్‌ను "భారతదేశపు పుట్టగొడుగుల నగరం" అని పిలుస్తారు [3] మష్రూమ్ రీసెర్చ్ డైరెక్టరేట్ (DMR) కూడా ఇక్కడి చంబాఘాట్ లోనే ఉంది.

ఈ ప్రాంతంలో రామములగ కాయలు (టొమాటోలు) ఎక్కువగా ఉత్పత్తి అవడం వల్ల సోలన్ ను "ఎర్ర బంగారపు పట్టణం" అని కూడా పిలుస్తారు. [1] నగరం, చండీగఢ్ సిమ్లా నగరాల మధ్య కాల్కా-సిమ్లా జాతీయ రహదారి -22 పై ఉంది. న్యారో గేజ్ కల్కా-సిమ్లా రైల్వే కూడా సోలన్ గుండా వెళుతుంది. పంజాబ్-హిమాచల్ సరిహద్దులో ఉన్న సోలన్, శివాలిక్ కొండలలో ఉంది.

సోలన్‌లో పురాతన దేవాలయాలు [4] మఠాలూ ఉన్నాయి. [5] దేశంలోని అత్యంత పురాతన సారాయి తయారీ కేంద్రాల్లో ఒకటి ఇక్కడ ఉంది. ఈ నగరంలో కొండపై 300 సంవత్సరాల పురాతన కోట కూడా ఉంది. షూలిని మాత ఆలయం, జటోలి శివాలయం ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశాలు. ఈ ప్రాంతంలోని అత్యంత ప్రసిద్ధ బౌద్ధ మఠాలలో ఒకటి యుండుంగ్ విహారం.

చరిత్ర

[మార్చు]

స్థానిక జానపద కథనాల ప్రకారం, పాండవులు తమ అరణ్యవాస సమయంలో సోలన్‌ ప్రాంతంలో నివసించారు. [6] 1815 లో బ్రిటిషు వారు గూర్ఖాలను ఓడించి, బాఘట్ రాజ్యాన్ని (ఇప్పుడు సోలన్) గెలుచుకున్నారు. సోలన్ నగరానికి సమీపంలో ఉన్న ఒక పర్వతం మీద ఇప్పటికీ గూర్ఖా కోట లేదా ఆర్కి కోట ఉంది. ఇది సోలన్ యొక్క చారిత్రిక పర్యాటక ఆకర్షణలలో ఒకటి. [7] ఈ పట్టణం బాగట్ సంస్థానానికి రాజధానిగా ఉంది. బాఘట్ అనే పదం బావు లేదా బహు నుండి వచ్చింది, దీని అర్థం "చాలా", ఘాట్ అంటే "కనుమ". ప్రారంభంలో బాఘాట్ సంస్థాన రాజధాని భూచాలి పరగణా లోని భోచ్ వద్ద ఉండేది. సోలన్‌లో కంటోన్మెంటును నిర్మించిన తరువాత, రాజధానిని ఇక్కడికి మార్చారు. 1902 లో ఇక్కడికి రైలు మార్గం వచ్చింది. [8] సోలన్ నగర పరిణామం ఈ క్రింది క్రమంలో జరిగింది.

  • బ్రిటిషర్లు సోలన్ వద్ద కంటోన్మెంట్ ప్రాంతాన్ని స్థాపించారు.
  • అద్భుతమైన నాణ్యమైన మినరల్ వాటర్ లభ్యత కారణంగా 1855 లో సోలన్ సారాయి తయారీ బట్టీని స్థాపించారు.
  • బాఘట్ రాజ్య ప్రధాన కార్యాలయాన్ని భోచ్ నుండి సోలన్ కు మార్చారు
  • 1902 లో కల్కా-సిమ్లా రైలు మార్గం ప్రారంభం.
  • కల్కా-సోలన్-సిమ్లా రహదారిపై రవాణా కార్యకలాపాలు ప్రారంభం.
  • పట్టణ స్థానిక సంస్థ, సోలన్ మున్సిపల్ కౌన్సిల్ 1950 లో ఉనికిలోకి వచ్చింది.
  • 1972 సెప్టెంబరు 1 న సోలన్ జిల్లా ఏర్పడింది, సోలన్ పట్టణం జిల్లా ముఖ్య పట్టణంగా మారింది. [8]

భౌగోళికం

[మార్చు]

సోలన్ పట్టణం 30°55′N 77°07′E / 30.92°N 77.12°E / 30.92; 77.12 నిర్దేశాంకాల వద్ద ఉంది. [9] [10] సముద్ర మట్టం నుండి దీని ఎత్తు 1502 మీటర్లు. 2280 మీటర్ల ఎత్తున ఉన్న కరోల్ పర్వతం అత్యంత ఎతైన ప్రదేశం. పాండవులు తమ 12 సంవత్సరాల అరణ్య వాసంలో ధ్యానం చేశారని నమ్ముతున్న పాండవ గుహ ఈ పర్వత శిఖరం వద్దనే ఉంది. శీతాకాలంలో అప్పుడప్పుడు సోలన్‌లో మంచు కురుస్తుంది. [11]

చైల్, డగ్‌షాహి, సబాతు, కందఘాట్, కసౌలి, రాజ్ఘర్, సలోగ్ర, చురీధార్ శిఖరం వంటి దగ్గరి లోని పర్యాటక ప్రదేశాలకు వెళ్ళేందుకు సోలన్ నుండే బయలుదేరుతారు

శీతోష్ణస్థితి

[మార్చు]
శీతోష్ణస్థితి డేటా - Solan (1981–2010, extremes 1999–2011)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 27.5
(81.5)
29.2
(84.6)
32.5
(90.5)
35.8
(96.4)
38.0
(100.4)
39.0
(102.2)
35.1
(95.2)
33.0
(91.4)
32.0
(89.6)
31.5
(88.7)
30.2
(86.4)
27.0
(80.6)
39.0
(102.2)
సగటు అధిక °C (°F) 18.4
(65.1)
19.9
(67.8)
23.8
(74.8)
29.0
(84.2)
31.6
(88.9)
31.2
(88.2)
28.9
(84.0)
28.2
(82.8)
28.0
(82.4)
27.0
(80.6)
23.8
(74.8)
20.7
(69.3)
25.9
(78.6)
సగటు అల్ప °C (°F) 2.5
(36.5)
4.5
(40.1)
8.3
(46.9)
12.6
(54.7)
16.2
(61.2)
18.7
(65.7)
20.2
(68.4)
19.8
(67.6)
16.9
(62.4)
10.5
(50.9)
5.9
(42.6)
3.0
(37.4)
11.6
(52.9)
అత్యల్ప రికార్డు °C (°F) −3.6
(25.5)
−2.8
(27.0)
1.0
(33.8)
4.6
(40.3)
8.5
(47.3)
12.5
(54.5)
16.0
(60.8)
15.0
(59.0)
10.5
(50.9)
5.0
(41.0)
1.0
(33.8)
−2.5
(27.5)
−3.6
(25.5)
సగటు వర్షపాతం mm (inches) 61.8
(2.43)
69.9
(2.75)
74.3
(2.93)
46.0
(1.81)
61.5
(2.42)
118.0
(4.65)
218.5
(8.60)
218.9
(8.62)
138.4
(5.45)
22.3
(0.88)
14.9
(0.59)
47.6
(1.87)
1,092.1
(43)
సగటు వర్షపాతపు రోజులు 3.4 4.3 4.7 3.3 4.7 6.7 11.9 10.8 5.7 1.6 1.0 2.1 60.2
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) 52 49 45 38 37 52 73 78 70 52 49 51 54
Source: India Meteorological Department[12][13]

పర్యాటక ఆకర్షణలు

[మార్చు]

సోలన్ లోను, చుట్టుపక్కలా అనేక ఆసక్తికర ప్రదేశాలున్నాయి. [14]

  • షిల్లీ రోడ్‌లోని మాతా షూలిని దేవి ఆలయం
  • రాజ్‌గఢ్ రోడ్‌లోని జటోలి ఆలయం
  • మాల్ రోడ్‌లోని చిల్డ్రన్స్ పార్క్
  • 20 నిమిషాల దూరంలో షూలిని విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ బహుమానాలు పొందిన యోగానంద లైబ్రరీ
  • కొండ పైన జవహర్ పార్కు. ఇక్కడ నుండి పట్టణం మొత్తాన్ని చూడవచ్చు.
  • మోహన్ మెకిన్ బ్రూవరీస్: భారతదేశంలోని అత్యంత పురాతన డిస్టిలరీ, ప్రపంచంలోనే పురాతనమైన వాటిలో ఒకటి.
  • కల్కా-సిమ్లా రైల్వే న్యారో గేజ్‌లో టాయ్ రైలు, సోలన్ రైల్వే స్టేషన్. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం.
  • కరోల్ కా టిబ్బా
  • బడీకీ ధార్: సముద్ర మట్టానికి 6781 అడుగుల ఎత్తులో ఉంది. సిమ్లా అందమైన దృశ్యాలను ఈ కొండ పైనుంచి చూడవచ్చు. ఈ ప్రదేశం శివుని ఆలయానికి, జూన్ 14/15 న నిర్వహించే వార్షిక ఉత్సవానికీ ప్రసిద్ధి చెందింది.
  • మోహన్ శక్తి జాతీయ హెరిటేజ్ పార్కు
  • ట్యాంక్ రోడ్‌లో వాటర్ ట్యాంకులు
  • అటవీ నర్సరీ ప్రాంతం
  • డాక్టర్ యశ్వంత్ సింగ్ పర్మార్ హార్టికల్చర్ అండ్ ఫారెస్ట్రీ విశ్వవిద్యాలయం
  • బరోగ్ రైల్వే స్టేషన్
  • కసౌలి
  • చైల్
  • గిరిపుల్, గౌడ
  • బాన్ మొనాస్టరీ, డోలాన్జీ
  • సాధుపుల్ వద్ద వాటర్ పార్కు, కేఫ్ [15]
  • సిటీ ఫ్యాషన్- లక్కర్ బజార్ సోలన్. అత్యంత ప్రసిద్ధ ఫ్యాషన్ బోటిక్ ఒకటి.
  • మిథూస్- అప్పర్ బజార్ లో ఉంది. ఇది సోలన్ లోని అత్యంత పురాతన షోరూము. ప్రజలు అత్యంత ఇష్టపడే దుస్తుల షోరూంలలో ఇదొకటి.
షార్విల్లా హెల్త్ రిసార్ట్స్ సోలన్

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Solan Travel and Tourism Guide". Archived from the original on 2016-03-04. Retrieved 2020-11-14.
  2. Capital of Bhagat state Archived 25 నవంబరు 2010 at the Wayback Machine
  3. Service, Tribune News. "Solan has Mushroom City tag, yet Himachal lags behind three states in production". Tribuneindia News Service (in ఇంగ్లీష్). Retrieved 2020-01-06.
  4. "Religious Places of Worship,Temples in Solan, India". www.touristlink.com (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-06-22. Retrieved 2020-01-06.
  5. him_admin. "Monasteries". Himachal Tourism Official Website (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-01-06.
  6. "Travel Is Our Passion: Trek To Karol Tibba, Pandava Cave". travelisourpassion.blogspot.in. Retrieved 2016-06-02.
  7. "Gurkha Fort". Archived from the original on 2019-01-02. Retrieved 2020-11-14.
  8. 8.0 8.1 "Historical Evolution Solan City" (PDF). Archived from the original (PDF) on 21 July 2011.
  9. Falling Rain Genomics, Inc – Solan
  10. "Geographical setting" (PDF). Archived from the original (PDF) on 21 July 2011.
  11. Report page:8 Archived 21 జూలై 2011 at the Wayback Machine
  12. "Station: Solan Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 547–548. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 14 February 2020.
  13. "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M72. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 14 February 2020.
  14. "Places of Interest". HP Solan Nic in.
  15. "CM inaugurates Water Park at Sadhupul". The Tribune India, Himachal. 1 July 2017. Archived from the original on 12 సెప్టెంబరు 2018. Retrieved 14 నవంబరు 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=సోలన్&oldid=4335209" నుండి వెలికితీశారు