కేలాంగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కేలాంగ్
పట్టణం
కర్దాంగ్ బౌద్ధ మఠం నుండి కేలాంగ్ దృశ్యం
కర్దాంగ్ బౌద్ధ మఠం నుండి కేలాంగ్ దృశ్యం
కేలాంగ్ is located in Himachal Pradesh
కేలాంగ్
కేలాంగ్
నిర్దేశాంకాలు: 32°35′N 77°02′E / 32.58°N 77.03°E / 32.58; 77.03అక్షాంశ రేఖాంశాలు: 32°35′N 77°02′E / 32.58°N 77.03°E / 32.58; 77.03
దేశంభారతదేశం
రాష్ట్రంహిమాచల్ ప్రదేశ్
జిల్లాలాహౌల్ స్పితి
సముద్రమట్టం నుండి ఎత్తు
3,080 మీ (10,100 అ.)
జనాభా వివరాలు
 • మొత్తం2,000 (2,020 est)
భాషలు
 • అధికారికహిందీ
కాలమానంUTC+5:30 (IST)

కేలాంగ్ హిమాచల్ ప్రదేశ్ లోని పట్టణం, లాహౌల్ స్పితి జిల్లా ముఖ్య పట్టణం. ఇది మనాలి-లేహ్ హైవే పై సముద్రమట్టం నుండి 3098 మీటర్ల ఎత్తున ఉంది. మనాలికి ఉత్తరాన రోహ్‌తాంగ్ సొరంగం గుండా వెళ్తే 71 కి.మీ. దూరంలోను, భారత-టిబెట్ సరిహద్దు నుండి 125 కి.మీ. దూరం లోనూ ఉంది.

దర్శనీయ స్థలాలు, పండుగలు[మార్చు]

టిబెటన్ బౌద్ధమత ద్రుక్పా శాఖకు చెందిన అతిపెద్ద, అతి ముఖ్యమైన మఠం, కర్దాంగ్ మఠం కీలాంగ్‌లో ఉంది. ఇది కీలాంగ్ నుండి భాగా నదికి అవతలి గట్టున ఉంది.

కేలాంగ్ సమీపంలో ఉన్న ప్రదేశాల్లో కర్దాంగ్, షసూర్, తాయూల్ మఠాలు ఉన్నాయి, ఇవన్నీ కేలాంగ్ నుండి కొద్ది కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. శ్రీ నవాంగ్ దోర్జే ఇంట్లో స్థానిక దేవత కేలాంగ్ వజీర్ ఆలయం కూడా ఉంది.

ఇక్కడ ఏటా జూలైలో లాహాల్ ఉత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా పెద్ద మార్కెట్, అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో జరుగుతాయి. [1]

పర్యాటకం[మార్చు]

కేలాంగ్, లాహౌల్ స్పితి జిల్లా ముఖ్య పట్టణం. లాహౌల్ లోని చాలా ప్రభుత్వ కార్యాలయాలు, సౌకర్యాలకు నిలయం.

సర్క్యూట్ హౌస్, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (పిడబ్ల్యుడి) రెస్ట్ హౌస్, సైనిక విశ్రాంతి గృహం, టూరిస్ట్ బంగ్లా, అనేక చిన్న హోటళ్ళతో సహా అనేక పర్యాటక సౌకర్యాలు పట్టణంలో ఉన్నాయి. [2]

రవాణా[మార్చు]

మనాలి నుండి ఎన్‌హెచ్ 21 లో భాగమైన మనాలి-లే హైవే ద్వారా కేలాంగ్‌ చేరుకోవచ్చు. ఇది మనాలి నుండి ఉత్తరాన 71 కి.మీ. దూరంలో ఉంది. రోహ్తాంగ్ కనుమ వద్ద భారీ హిమపాతం కారణంగా అక్టోబరు చివరి నుండి మే మధ్య వరకు ఈ దారిని మూసేస్తారు. 2019-20 వరకు ఇలాగే జరిగింది. అయితే, 2020 అక్టోబరులో అటల్ సొరంగాన్ని తెరిచిన తరువాత, దాదాపు సంవత్సరం పొడుగునా కేలాంగ్ వెళ్ళే వీలు కలిగింది. మే, జూన్ నెలల్లో చాలా మంది పర్యాటకులు రోహ్తాంగ్ కనుమను సందర్శిస్తారు. మనాలి నుండి వేసవి కాలంలో బస్సులు కూడా తిరుగుతాయి.

వాతావరణం[మార్చు]

Kyelang (1961–1990, rainfall 1951–2000)-శీతోష్ణస్థితి
నెల జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నవంబరు డిసెంబరు సంవత్సరం
అత్యధిక °C (°F) 13.1 9.0 16.7 18.7 25.9 27.7 28.7 28.2 27.1 22.9 20.2 13.9 nil
(nil)
సగటు అధిక °C (°F) 6.7 6.0 9.8 14.8 22.1 25.9 26.8 26.7 25.6 21.8 16.3 12.1
సగటు అల్ప °C (°F) -16.5 -17.7 -13.8 -7.4 -0.9 2.9 5.3 6.7 1.3 -4.1 -7.7 -14.1
అత్యల్ప °C (°F) -19.4 -19.7 -16.1 -13.6 -1.9 -0.2 1.7 4.6 -0.1 -8.9 -10.4 -17.5 nil
(nil)
వర్షపాతం mm (inches) 78.0 92.8 141.1 88.2 71.1 25.8 60.3 42.1 55.5 24.4 25.8 35.3
స. వర్షపు రోజులు(≥ 2.5 mm) 6.3 5.9 8.7 6.5 5.4 2.2 5.6 4.3 3.5 2.0 1.6 3.1
తేమ % 74 76 75 66 62 62 74 77 64 52 54 67
Source: India Meteorological Department[3]

మూలాలు[మార్చు]

  1. [1]
  2. [2]
  3. "Climate of Himachal Pradesh" (PDF). Climatological Summaries of States Series - No. 15. India Meteorological Department. January 2010. pp. 65–68. Archived from the original (PDF) on 20 February 2020. Retrieved 8 March 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=కేలాంగ్&oldid=3122178" నుండి వెలికితీశారు