Coordinates: 31°32′25″N 78°16′20″E / 31.540278°N 78.272222°E / 31.540278; 78.272222

రెకాంగ్ పియో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రెకాంగ్ పియో
పియో
మెయిన్ స్ట్రీట్, రెకాంగ్ పియో, 2010
మెయిన్ స్ట్రీట్, రెకాంగ్ పియో, 2010
రెకాంగ్ పియో is located in Himachal Pradesh
రెకాంగ్ పియో
రెకాంగ్ పియో
హిమాచల్ ప్రదేశ్‌లో పట్టణ స్థానం
Coordinates: 31°32′25″N 78°16′20″E / 31.540278°N 78.272222°E / 31.540278; 78.272222
దేశం India
రాష్ట్రంహిమాచల్ ప్రదేశ్
జిల్లాకిన్నౌర్
Elevation
2,290 మీ (7,510 అ.)
Population
 • Total2,397 (1,529 పురు 868 స్త్రీ)
భషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)

రెకాంగ్ పియో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం. ఇది కిన్నౌర్ జిల్లాకు ముఖ్య పట్టణం. స్థానికులు దీన్ని పియో అని పిలుచుకుంటారు.

సముద్ర మట్టం నుండి 2,290 మీటర్ల ఎత్తున ఉన్న రెకాంగ్ పియో, సిమ్లా నుండి 260 కిలోమీటర్లు, పోవారీ నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. జిల్లా ముఖ్య పట్టణంగా గతంలో కల్పా ఉండేది. తరువాత దాన్ని రెకాంగ్ పియోకు మార్చారు. రెకాంగ్ పియో కిన్నౌర్ జిల్లా లోని ప్రధాన వాణిజ్య కేంద్రం. జిల్లాలోని అతిపెద్ద మార్కెట్ ఇక్కడ ఉంది. రెకాంగ్‌పియోలోని హెచ్‌ఆర్‌టిసి బస్‌స్టాండ్ నుంచి జిల్లాలోని ముఖ్యమైన ప్రదేశాలకు బస్సు సౌకర్యం ఉంది.

పర్యాటక విశేషాలు[మార్చు]

కిన్నౌర్ కైలాష్ పర్వతం శివుడి నివాసంగా హిందువులు భావిస్తారు. రెకాంగ్ పెయో నుండి ఈ శిఖరాన్ని చూడవచ్చు. పట్తణంలో ఉన్న 79 అడుగుల ఎత్తైన శిల ఆకృతి శివలింగాన్ని పోలి ఉంటుంది. ఈ శివలింగం పగటిపూట సమయం గడిచేకొద్దీ రంగును మారుస్తూంటుంది. రెకాంగ్ పియోలో బౌద్ధ మఠం కూడా ఉంది.[1]

చిత్ర మాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Reckong Peo | District Kinnaur, Government of Himachal Pradesh | India". హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ వెబ్‌సైటు (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-11-14. Retrieved 2020-11-14.