జలియన్ వాలాబాగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జలియన్ వాలాబాగ్ మెమోరియల్, అమృత్సర్

భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్లో గల ఒక పబ్లిక్ గార్డెన్ జలియన్ వాలాబాగ్. 1919 ఏప్రిల్ 13 న పంజాబీ న్యూ ఇయర్. ఈ సందర్భంగా ఈ ఉద్యానవనంలో సమావేశమైన శాంతియుత వేడుకరులను బ్రిటిష్ దళాలు చుట్టుముట్టి వారిపై మారణకాండ జరిపింది, ఇక్కడ జరిగిన ఈ దురంతమే జలియన్ వాలాబాగ్ దురంతం. ఈ దుర్ఘటనలో మరణించిన వారి జ్ఞాపకార్ధం 1951 లో ఒక స్మారకం స్థాపించబడింది. ఈ స్మారకం జాతీయ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ 6.5 ఎకరాల (26,000 m2) గార్డెన్, సిక్కుల పవిత్ర పుణ్యకేత్రమైన స్వర్ణ దేవాలయానికి సమీపంలో ఉంది.

జలియన్ వాలాబాగ్ దురంతం

[మార్చు]

జలియన్ వాలాబాగ్ దురంతం భారత స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో జరిగిన అత్యంత దురదృష్టమైన సంఘటన. జలియన్ వాలాబాగ్ అనేది ఉత్తర భారతదేశంలోని అమృత్‌సర్ పట్టణంలో ఒక తోట. 1919 ఏప్రిల్ 13 న బ్రిటీష్ సైనికులు జనరల్ డయ్యర్ సారథ్యంలో ఈ తోటలో సమావేశమైన నిరాయుధులైన స్త్రీ, పురుషులు, పిల్లలపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపారు[1][2]. ఈ కాల్పులు పది నిమిషాలపాటు కొనసాగాయి. 1650 రౌండ్లు కాల్పులు జరిగాయి. అప్పటి ఆంగ్ల ప్రభుత్వ లెక్కల ప్రకారం 379 మంది మరణించారు. కానీ ఇతర గణాంకాల ప్రకారం అక్కడ 1000 కి పైగా మరణించారు[3]. 2000 మందికి పైగా గాయపడ్డారు.

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Jallianwala Bagh commemoration volume and Amritsar and our duty to India. Publication Bureau, Punjabi University. 1994. ISBN 978-81-7380-388-8.
  2. Datta, Vishwa Nath (1969). Jallianwala Bagh. [Kurukshetra University Books and Stationery Shop for] Lyall Book Depot.
  3. Home Political Deposit, September, 1920, No 23, National Archives of India, New Delhi; Report of Commissioners, Vol I, New Delhi

ఇతర లింకులు

[మార్చు]