మైఖేల్ ఓ డయ్యర్
సర్ మైఖేల్ ఓ డయ్యర్ | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | బారన్స్‌టైన్, ఐర్లాండ్ | 1864 ఏప్రిల్ 8||
మరణం | 1940 మార్చి 13 కాక్స్‌టన్ హాల్, లండన్ | (వయసు 75)||
జాతీయత | బ్రిటీష్ | ||
తల్లిదండ్రులు |
| ||
జీవిత భాగస్వామి | డేమ్ ఊనా ఓ డయ్యర్ | ||
పూర్వ విద్యార్థి | బాలియల్ కళాశాల, ఆక్స్‌ఫర్డ్ | ||
వృత్తి | వలస ప్రభుత్వ పరిపాలన |
సర్ మైఖేల్ ఫ్రాన్సిస్ ఓ డయ్యర్ (28 ఏప్రిల్ 1864 – 13 మార్చి 1940) 1913 నుంచి 1919 వరకూ పంజాబ్ ప్రావిన్సుకు లెఫ్టినెంట్ గవర్నర్‌గా పనిచేశాడు. జనరల్ రెజినాల్డ్ డయ్యర్ చేసిన జలియన్ వాలాబాగ్ దురంతాన్ని సమర్థించి, "సరైన చర్య" అని పేర్కొన్నాడు.[1][2] అందుకు ప్రతిగా ఈ దుర్ఘటన జరిగిన 21 సంవత్సరాలకు 1940లో లండన్‌లో విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నప్పుడు భారతీయ విప్లవకారుడు ఉద్దమ్ సింగ్ చేతిలో హత్యకు గురయ్యాడు.
తొలినాళ్ళ జీవితం
[మార్చు]జాన్, మార్గరెట్ దంపతుల 14 మంది సంతానంలో ఆరవ కుమారునిగా ఐర్లాండులోని బారన్స్‌టౌన్‌లో మైఖేల్ ఫ్రాన్సిస్ ఓ డయ్యర్ జన్మించాడు.[3][4] టులామూర్‌లోని సెయింట్ స్టానిస్‌లాస్ కళాశాలలో చదువుకుని, 1882లో భారత సివిల్ సర్వీసులకు ప్రవేశ పరీక్ష, 1884లో తుది పరీక్ష పాసయ్యాడు.[3] ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన బాలియల్ కళాశాలలో తన రెండేళ్ళ ప్రొబేషన్ పూర్తిచేసుకుని, జ్యూరిస్‌పుడెన్స్‌లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు.
1885లో భారతదేశంలో ఉద్యోగంలో చేరాడు, [3] పంజాబ్ ప్రావిన్సులోని షాపూర్‌లో మొదటి పోస్టింగు పొందాడు. భూమి శిస్తు నిర్ణయంలో ప్రత్యేకత, అనుభవం సాధించడంతో 1896లో పంజాబ్ భూమి, వ్యవసాయ రికార్డుల నిర్వహణకు డైరెక్టరుగా నియమితుడయ్యాడు; తర్వాతి ఏడాది అల్వార్, భరత్‌పూర్ రాష్ట్రాలకు కూడా భూమి శిస్తు నిర్ణయం విషయంలో ఇన్‌ఛార్జి అయ్యాడు.
చాలా కాలం వేచిచూశాకా, ఓ డయ్యర్‌కి లార్డ్ కర్జన్ పంజాబ్ నుంచి వాయువ్య సరిహద్దు ప్రావిన్సు ఏర్పాటుచేయడానికి చేసే ప్రయత్నాల్లో కీలకమైన భాగం అప్పగించాడు; కొత్త ప్రావిన్సుకు రెవెన్యూ కమిషనర్‌గా నియమితుడై 1901 నుంచి 1908 వరకూ పనిచేశాడు. 1908-1909 కాలంలో హైదరాబాద్ రాజ్యానికి రెసిడెంటుగా తాత్కాలిక బాధ్యతలు వహించాడు.[3] 1910 నుంచి 1912 వరకూ మధ్యభారతంలో గవర్నర్-జనరల్ ప్రతినిధిగా పనిచేశాడు. 1908 జూన్‌లో అతనిని సీఎస్ఐగా నియమించారు.[5]
జలిలయన్ వాలాబాగ్ దురంతం
[మార్చు]1912 డిసెంబరున మైఖేల్ ఓ.డయ్యర్ పంజాబ్‌ని పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించారు, ఇదే పదవిలో డయ్యర్ 1919 వరకూ కొనసాగాయి.
మూలాలు
[మార్చు]- ↑ Michael O'Dwyer's telegram to Dyer: "Your action correct. Lieutenant Governor approves"; see Disorder Inquiry Committee Report, Vol II, p. 197
- ↑ Saga of Freedom Movement, Udham Singh, 2002, pp. 67–68
- ↑ 3.0 3.1 3.2 3.3 Dictionary of National Biography 1931–40, edited by L. G. Wickham Legg, Oxford Univ. Press, London, p. 655
- ↑ Singh, Sikander (2016). A Great Patriot and Martyr Udham Singh. Unistar Books. p. 71. ISBN 8189899597.
- ↑ London Gazette; 23 June 1908