మైఖేల్ ఓ డయ్యర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సర్ మైఖేల్ ఓ డయ్యర్

వ్యక్తిగత వివరాలు

జననం (1864-04-08)1864 ఏప్రిల్ 8
బారన్స్‌టైన్, ఐర్లాండ్
మరణం 1940 మార్చి 13(1940-03-13) (వయసు 75)
కాక్స్‌టన్ హాల్, లండన్
జాతీయత బ్రిటీష్
తల్లిదండ్రులు
  • జాన్ ఓ డయ్యర్
  • మార్గరెట్ ఓ డయ్యర్
జీవిత భాగస్వామి డేమ్ ఊనా ఓ డయ్యర్
పూర్వ విద్యార్థి బాలియల్ కళాశాల, ఆక్స్‌ఫర్డ్
వృత్తి వలస ప్రభుత్వ పరిపాలన

సర్ మైఖేల్ ఫ్రాన్సిస్ ఓ డయ్యర్ (28 ఏప్రిల్ 186413 మార్చి 1940) 1913 నుంచి 1919 వరకూ పంజాబ్ ప్రావిన్సుకు లెఫ్టినెంట్ గవర్నర్‌గా పనిచేశాడు. జనరల్ రెజినాల్డ్ డయ్యర్ చేసిన జలియన్ వాలాబాగ్ దురంతాన్ని సమర్థించి, "సరైన చర్య" అని పేర్కొన్నాడు.[1][2] అందుకు ప్రతిగా ఈ దుర్ఘటన జరిగిన 21 సంవత్సరాలకు 1940లో లండన్‌లో విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నప్పుడు భారతీయ విప్లవకారుడు ఉద్దమ్ సింగ్ చేతిలో హత్యకు గురయ్యాడు.

‌‌మైఖేల్ ఓ డయ్యర్ హత్య అనంతరం ఉద్ధమ్ సింగ్‌ను అరెస్టు చేస్తున్న దృశ్యం

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

జాన్, మార్గరెట్ దంపతుల 14 మంది సంతానంలో ఆరవ కుమారునిగా ఐర్లాండులోని బారన్స్‌టౌన్‌లో మైఖేల్ ఫ్రాన్సిస్ ఓ డయ్యర్ జన్మించాడు.[3][4] టులామూర్‌లోని సెయింట్ స్టానిస్‌లాస్ కళాశాలలో చదువుకుని, 1882లో భారత సివిల్ సర్వీసులకు ప్రవేశ పరీక్ష, 1884లో తుది పరీక్ష పాసయ్యాడు.[3] ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన బాలియల్ కళాశాలలో తన రెండేళ్ళ ప్రొబేషన్ పూర్తిచేసుకుని, జ్యూరిస్‌పుడెన్స్‌లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు.

1885లో భారతదేశంలో ఉద్యోగంలో చేరాడు, [3] పంజాబ్ ప్రావిన్సులోని షాపూర్‌లో మొదటి పోస్టింగు పొందాడు. భూమి శిస్తు నిర్ణయంలో ప్రత్యేకత, అనుభవం సాధించడంతో 1896లో పంజాబ్ భూమి, వ్యవసాయ రికార్డుల నిర్వహణకు డైరెక్టరుగా నియమితుడయ్యాడు; తర్వాతి ఏడాది అల్వార్, భరత్‌పూర్ రాష్ట్రాలకు కూడా భూమి శిస్తు నిర్ణయం విషయంలో ఇన్‌ఛార్జి అయ్యాడు.

చాలా కాలం వేచిచూశాకా, ఓ డయ్యర్‌కి లార్డ్ కర్జన్ పంజాబ్ నుంచి వాయువ్య సరిహద్దు ప్రావిన్సు ఏర్పాటుచేయడానికి చేసే ప్రయత్నాల్లో కీలకమైన భాగం అప్పగించాడు; కొత్త ప్రావిన్సుకు రెవెన్యూ కమిషనర్‌గా నియమితుడై 1901 నుంచి 1908 వరకూ పనిచేశాడు. 1908-1909 కాలంలో హైదరాబాద్ రాజ్యానికి రెసిడెంటుగా తాత్కాలిక బాధ్యతలు వహించాడు.[3] 1910 నుంచి 1912 వరకూ మధ్యభారతంలో గవర్నర్-జనరల్ ప్రతినిధిగా పనిచేశాడు. 1908 జూన్‌లో అతనిని సీఎస్ఐగా నియమించారు.[5]

జలిలయన్ వాలాబాగ్ దురంతం

[మార్చు]

1912 డిసెంబరున మైఖేల్ ఓ.డయ్యర్ పంజాబ్‌ని పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించారు, ఇదే పదవిలో డయ్యర్ 1919 వరకూ కొనసాగాయి.

మూలాలు

[మార్చు]
  1. Michael O'Dwyer's telegram to Dyer: "Your action correct. Lieutenant Governor approves"; see Disorder Inquiry Committee Report, Vol II, p. 197
  2. Saga of Freedom Movement, Udham Singh, 2002, pp. 67–68
  3. 3.0 3.1 3.2 3.3 Dictionary of National Biography 1931–40, edited by L. G. Wickham Legg, Oxford Univ. Press, London, p. 655
  4. Singh, Sikander (2016). A Great Patriot and Martyr Udham Singh. Unistar Books. p. 71. ISBN 8189899597.
  5. London Gazette; 23 June 1908