యర్రా నారాయణస్వామి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యర్రా నారాయణస్వామి

లఘు పరిశ్రమల శాఖ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1976 - 1978
నియోజకవర్గం ఎమ్మెల్సీ

ఎమ్మెల్యే
పదవీ కాలం
1985 – 1989
నియోజకవర్గం తాడేపల్లిగూడెం

ఎమ్మెల్యే
పదవీ కాలం
1999 – 2004
నియోజకవర్గం తాడేపల్లిగూడెం

వ్యక్తిగత వివరాలు

జననం 30 ఏప్రిల్ 1931
ఉప్పులూరు, ఉండి మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, భారతదేశం
మరణం 2023 మార్చి 29
భీమవరం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్

యర్రా నారాయణస్వామి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1985, 1999లలో రెండు సార్లు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పని చేశాడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

నారాయణ స్వామి 1931లో ఏప్రిల్‌ 30న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి మండలం ఉప్పులూరు గ్రామంలో జన్మించాడు. ఆయన ఉత్తరపరదేశ్ రాష్ట్రం లక్నోలో ఎంఏ, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

యర్రా నారాయణస్వామి ఉండి మండలం, ఉప్పులూరు గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, ఉండి విశాల సహకార పరపతి సంఘం చైర్మన్‌గా పని చేశాడు. ఆయన 1972లో కాంగ్రెస్‌ పార్టీ తరుపున స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికై 1976 నుండి 78 వరకు మంత్రిగా పని చేసి ఆ తరువాత ఎన్‌టిఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించాక ఆ పార్టీలో చేరి తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 1988లో పశ్చిమ గోదావరి జిల్లా జడ్‌పి చైర్మన్‌గా ఎన్నికయ్యాడు. యర్రా నారాయణస్వామి 1994 నుండి 99 వరకు టీడీపీ నుండి రాజ్యసభ సభ్యునిగా పని చేశాడు.

నారాయణస్వామి టీడీపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, పోలవరం ప్రాజెక్టు సాధన కమిటీ ఛైర్మన్‌గా వివిధ హోదాల్లో పని చేసి, 2005 తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నాడు.

మరణం

[మార్చు]

యర్రా నారాయణస్వామి వయోభారంతోపాటు అస్వస్థతకు గురై భీమవరంలోని ప్రయివేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో 2023 మార్చి 29న మరణించాడు.[1][2][3]

మూలాలు

[మార్చు]
  1. Eenadu (14 November 2023). "మాజీ మంత్రి యర్రా నారాయణస్వామి కన్నుమూత". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
  2. A. B. P.Desam (29 March 2023). "మాజీ మంత్రి యర్రా నారాయణ స్వామి కన్నుమూత". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
  3. Sakshi (30 March 2023). "మాజీ మంత్రి నారాయణస్వామి కన్నుమూత". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.